Madurawada
-
ఏడాదిన్నరగా ప్లాస్టిక్ డ్రమ్ములోనే మృతదేహం
అల్లిపురం (విశాఖ దక్షిణ): విశాఖపట్నం మధురవాడలోని వికలాంగుల కాలనీలో ప్లాస్టిక్ డ్రమ్ములో పుర్రె, అస్తిపంజరం బయటపడిన కేసులో చిక్కుముడి వీడింది. పోలీసుల విచారణలో మృతురాలు శ్రీకాకుళం జిల్లా మోదంటి వీధికి చెందిన బమ్మిడి ధనలక్ష్మి(24)గా గుర్తించారు. నిందితుడు శ్రీకాకుళం జిల్లా మందస గ్రామానికి చెందిన దండు రిషివర్ధన్ అలియాస్ కొప్పిశెట్టి రిషివర్ధన్ అలియాస్ రిషిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీస్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాదిలో వెల్డింగ్ దుకాణం నడుపుతున్న నండూరి రమేష్‌కు వికలాంగుల కాలనీలో ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటిని తన వద్ద పనిచేస్తున్న రిషికి 2020 సెప్టెంబర్‌లో అద్దెకు ఇవ్వగా.. అతడు కొంతకాలంగా అద్దె చెల్లించడం లేదు. ఆ ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లును మే 2021 నుంచి చెల్లించకపోవడం, బిల్లు ఎక్కువగా వస్తుండటంతో రమేష్ ఆ ఇంటిని చూసేందుకు ఈ నెల 4వ తేదీన వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండగా.. ఇంట్లో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఫ్యాన్లు తిరుగుతున్నాయి. ఇంటి వెనుక తలుపు తీసి ఉండటంతో లోపలకు వెళ్లి చూడగా.. ఓ పక్కన ప్లాస్టిక్ డ్రమ్ము పీవీసీ టేప్‌తో సీల్ చేసి ఉండటం, దుర్వాసన రావటంతో పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి డ్రమ్ము తెరిచిచూడగా.. పుర్రె, అస్థి పంజరం, జుట్టు కనిపించాయి. వివరాలు వెల్లడిస్తున్న పోలీస్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ చున్నీ బిగించి.. డ్రమ్ములో దాచేశాడు నిందితుడు రిషివర్ధన్ తన భార్యతో కలిసి రమేష్ ఇంట్లో అద్దెకు ఉండేవాడు. భార్య గర్భవతి కావటంతో 2021 జనవరిలో తన అత్తగారి ఊరైన శ్రీకాకుళం బల్లిగూడకు కాన్పు నిమిత్తం పంపించాడు. ఆ తరువాత తరచూ భార్యను చూసేందుకు వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో 2021 మే 29న శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు కోసం వేచి ఉండగా.. బమ్మిడి ధనలక్ష్మి (24) అనే మహిళ పరిచయమైంది. ఇద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. అక్కడి నుంచి ఇద్దరు కలసి ఆటోలో నాతవరం వరకు ప్రయాణించారు. అదే నెల 30న రిషికి ధనలక్ష్మి పలుమార్లు ఫోన్ చేసింది. తన భార్య ఇంటివద్ద లేదని రిషి చెప్పటంతో ధనలక్షి ఆ రోజు రాత్రి అతడి ఇంటికెళ్లింది. వేకువజామున 4.30 గంటల సమయంలో ధనలక్ష్మి రూ.2 వేలు కావాలని డిమాండ్ చేసింది. తన వద్ద 100 రూపాయలే ఉన్నాయని రిషి చెప్పగా.. అతడి భార్య దుస్తులు, టీవీ ఇమ్మని అడిగింది. అందుకు తిరస్కరించగా.. తాను అడిగినవి ఇవ్వకపోతే బయటకు వెళ్లి గొడవ చేస్తానని హెచ్చరించడంతో రిషి కోపంతో ఆమె మెడకు చున్నీ బిగించటంతో ప్రాణం విడిచింది. మృతదేహాన్ని బ్లాంకెట్ ప్లాస్టిక్ జిప్ కవర్లో ప్యాక్ చేసి.. ఇంట్లోని ప్లాస్టిక్ డ్రమ్‌లో దించి మూతను సెల్లో టేప్‌తో మూసివేశాడు. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయి తన సెల్‌ఫోన్‌ను 13 రోజులు స్విచ్ఛాఫ్ చేసి ఉంచాడు. ఆ తరువాత ఇంటిని ఖాళీ చేసిన రిషి వెల్డింగ్ షాపులో పని కూడా మానేసి తన అత్తగారింటికి వెళ్లిపోయాడు. ఇలా దొరికాడు ఘటనా స్థలంలో మృతురాలు ధనలక్ష్మికి చెందిన బ్యాగ్ లభించగా.. అందులో రిషి ఫోన్ నంబర్ రాసి ఉన్న ఓ స్లిప్ దొరికింది. కాల్ లిస్ట్ ఆధారంగా ఘటన జరగడానికి ముందు మృతురాలి నంబర్ నుంచి అతడి నంబర్‌కు ఫోన్లు రావడాన్ని గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టి మృతురాలి వివరాలతోపాటు నిందితుడిని గుర్తించారు. ధనలక్ష్మికి తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు ఎవరూ లేకపోవటంతో ఆమె కనిపించడం లేదని ఎక్కడా మిస్సింగ్ కేసు కూడా నమోదు కాలేదు. నిందితుడి ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేయగా.. అతడు 6 నెలలుగా కొమ్మాదిలోని ఒక హాస్టల్లో అసిస్టెంట్ కుక్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే కేసు ఛేదించినట్లు కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. -
నవ వధువు సృజన మృతిపై వీడిన మిస్టరీ.. అతడి కోసమే ఇలా..
సాక్షి, విశాఖపట్నం: మధురవాడలో నవ వధువు సృజన మృతిపై ఎట్టకేలకు మిస్టరీ వీడింది. సృజన మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలసులు నిర్ధారించారు. పెళ్లి ఆపాలనే ప్రయత్నంలోనే సృజన ప్రాణాలు పోగొట్టుకున్నట్టు వెల్లడించారు. పెళ్లికి 3 రోజుల ముందు ఇన్స్‌స్టాగ్రామ్‌లో పరవాడకు చెందిన ప్రియుడు మోహన్‌తో చాటింగ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, సరైన ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికి సమయం కావాలని మోహన్.. సృజనను కోరినట్టు చెప్పారు. దీంతో పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తానని ప్రియుడికి చెప్పింది. అనంతరం పెళ్లి ఆపేందుకు సృజన విష పదార్థం సేవించింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవ వధువు సృజన మృతి చెందినట్టు స్పష్టం చేశారు. ఇదీ జరిగింది.. విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెంలో నాగోతి శివాజీ, సృజనల వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. కళ్యాణ మండపంలో నవ వధువు సృజన ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం వధువు బ్యాగులో గన్నేరు పప్పు తొక్కలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: ప్రేమ పెళ్లి.. నా భర్త దగ్గరికి వెళ్లిపోతా.. ఇంతలోనే ఘోరం.. -
లంచం తీసుకోలేదని చంద్రబాబు చెప్పగలడా..?
సాక్షి, విశాఖపట్నం: మధురవాడ భూముల విషయంలో టీడీపీ నాయకులు, కొన్ని మీడియా సంస్థలు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బాబు హయాంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న టీడీపీ నేతల నుంచి వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతున్నందునే భూ ఆక్రమణల పేరిట తనపై, వైఎస్సార్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న టీడీపీ నాయకులు బండారు సత్యన్నారాయణమూర్తి తదితరులతో పాటు, ఈనాడు, ఆంధ్ర జ్యోతి, టీవీ5, మహాన్యూస్ మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ విశాఖ నార్త్ ఏసీపీ చుక్క శ్రీనివాసరావుకు శుక్రవారం పీఎంపాలెం పోలీసు స్టేషన్లో ఆయన ఫిర్యాదు ఇచ్చారు. వారం పది రోజుల్లో వారికి నోటీసులిస్తామని, ఆ తర్వాత పరువునష్టం దావా వేస్తానని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఎన్సీసీ వ్యవహారంలో మొదటి నుంచీ ఏం జరిగిందో వివరించారు. ‘‘2005లో విఎంఆర్డీఏ, జీవీఎంసీల బిడ్డింగ్‌లో ఆరుగురు బిల్డర్లు పాల్గొన్నారు. దాన్లో ఎన్సీసీ సంస్థ అత్యధికంగా రూ.93.20 కోట్లుకు బిడ్ వేసింది. అదే ఏడాది డిసెంబర్లో ఎన్సీసీకి ఆ భూముల్ని ఖరారు చేశారు. 2007లో అభివృద్ధి రుసుం, వడ్డీతో కలిపి మొత్తం రూ.95 కోట్లు సంస్థ చెల్లించింది. మధురవాడ ఐటీ సెజ్ సమీపంలో మొత్తం 97 ఎకరాల్లో 33 ఎకరాలు నివాసిత స్థలం, 15 ఎకరాలు కొండ ప్రాంతం, 50 ఎకరాలు వ్యవసాయ భూమి. భూమి ఉపయోగాన్ని మార్చుకునేందుకు వారికి 2014 వరకు పట్టింది. అంతకు ముందు 2012లో ఈవ్యవహారంపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. విచారణ తర్వాత సంస్థకు నోటీసులిచ్చి అడ్వకేట్ జనరల్ సూచనలతో 2013లో రద్దుచేశారు. కానీ డబ్బులు కట్టించుకుని రద్దు చేశారంటూ ఎన్సీసీ సంస్థ 2013 చివర్లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. కోర్టు 2014 మార్చిలో స్టేటస్కో ఉత్తర్వులిచ్చింది’’ అని విజయసాయిరెడ్డి వివరించారు. ఎన్సీసీ షరతులకు అంగీకరించిన బాబు... 2016లో సంస్థ ఈ భూములను ఫ్రీహోల్డ్ ల్యాండ్‌గా మార్చాలని ఎన్సీసీ అభ్యర్థించినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. ‘‘రెవెన్యూ పంపకంలో 3.5 శాతం భూమి నివాసిత ప్రదేశంగా, 4 శాతం భూమి వాణిజ్య పరంగా ప్రభుత్వానికి చెల్లిస్తామని, దానికి అంగీకరించకపోతే తమ సొమ్మును 12 శాతం వడ్డీతో వాపస్ చేయాలని సంస్థ కోరింది. ఆ కండిషన్‌కు నాటి సీఎం చంద్రబాబు అంగీకరించారు. తరవాత కేబినెట్లో ఆమోదించి 2019 ఫిబ్రవరిలో ఫ్రీ హోల్డ్ ల్యాండ్‌గా మార్చాడు. అనంతరం క్యాబినెట్ రద్దయినా.. ఆపద్ధర్మ సీఎం హోదాలో ఎన్సీసీ అభ్యర్థన మేరకు చంద్రబాబు రిజిస్ట్రేషన్ చార్జీలు రద్దుచేశారు. సంస్థకు అనుకూలంగా జీవో.121ని విడుదల చేశారు. దీనివల్ల ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడింది. జీపీఏ చేసేందుకు అంగీకారం తెలపడంతో ప్రభుత్వానికి మరో రూ.50 కోట్ల నష్టం కలిగింది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక జీపీఏ వల్ల ప్రభుత్వానికి నష్టం వస్తోంది కనక కుదరదని చెప్పి తప్పనిసరిగా రిజిస్ట్రే్టషన్ చేసుకోవాలని పేర్కొంది. భూమి విలువను అంచనా వేయడానికి కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సూచనల మేరకు మొత్తం రిజిస్ట్రేషన్ చార్జీలు, అభివృద్ధి చార్జీలు కలిపి రూ.187.97 కోట్లకుపైగా వసూలు చేశాం’’ అంటూ వివరించారు. దమ్ముంటే ఎన్సీసీ విషయంలో తప్పు చేయలేదని తిరుపతి వేంకటేశ్వరస్వామి వద్ద ప్రమాణం చేయాలని బాబుకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎక్కడున్నా వదిలే ప్రసక్తే లేదు.. చంద్రబాబు 2014–19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏకంగా రూ.7లక్షల కోట్లు విదేశాలకు తరలించారంటూ... ప్రభుత్వ భూమిని కబ్జాచేస్తే తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోదని స్పష్టంచేశారు. ‘‘రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఎక్కడ భూఆక్రమణ చేసినా తిరిగి స్వాధీనం చేసుకుంటాం. చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు, అనుచరులు.. ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించుకున్నా.. వదిలే ప్రసక్తే లేదు’’ అన్నారు. అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుల బినామీ కంపెనీలపై ఈడీకి ఫిర్యాదు చేస్తానన్నారు. ‘‘జీఆర్పీఎల్ కంపెనీ మురళి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మంచి స్నేహితుడు. ఆ కంపెనీలో నా అల్లుడికి వాటాలున్నాయనేది పచ్చి అబద్ధం. వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఈనాడు రామోజీరావు ఫిలిం సిటీ కట్టాడు. సంస్థ యజమానిని వెన్నుపోటు పొడిచి ఆంధ్రజ్యోతిని రాధాకృష్ణ లాక్కున్నాడు. మహాన్యూస్ సుజనాచౌదరి ప్రభుత్వ బ్యాంక్‌లకు రుణాలెగ్గొట్టిన ఆర్థిక నేరగాడు. వీళ్లు మాపై బురద జల్లడమా?’’ అని దుయ్యబట్టారు. -
భూ బకాసురులు
కళానగర్లోటీడీపీ నాయకుల దందా ఆక్రమణలు తొలగించిన చోటే నిర్మాణాలు హెచ్చరిక బోర్డులు మాయం మధురవాడ : భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. టీడీపీ నేతల అండతో ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేసేస్తున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జీవీఎంసీ 4,5 వార్డుల్లో కబ్జాలు నిత్యకృత్యమయ్యాయి. వీరి దందా ముందు హెచ్చరిక బోర్డులు కూడా తలవంచుతున్నాయి. సాక్షాత్తూ కలెక్టర్ పేరిట ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి నిర్మాణాలు చేస్తున్నా రెవెన్యూ,జీవీఎంసీ అటు వైపు కన్నెత్తి చూడక పోవడంపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. కలెక్టర్ పేరిట ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు సైతం పీకి పడేసి ఆక్రమణలకు పాల్పడుతున్నా వారి వంక కన్నెత్తి చూసేవారు కూడా కరువయ్యారు. ఈ ఆక్రమణలకు ప్రధాన సూత్రధారులు అధికార పార్టీనాయకులు, వారి అనుచరులే కావడంతో వారి అగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. దీనికి జీవీఎంసీ 5వ వార్డులోని కళానగర్‌లోని ఈడబ్ల్యూఎస్ లే అవుట్లో ఆక్రమణల పర్వమే నిదర్శనం. ఇదీ పరిస్థితి సర్వే నంబరు 161/1లో ఉన్న 36.12ఎకరాలు ప్రభుత్వ భూమి,161/2లో మరికొంత అనాధీన ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన భూమిలో కొంత గెడ్డ ఉండగా, 1985 ప్రాంతంలో సుమారు 55 మంది కళాకారులకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. తర్వాత మరి కొందరికి పట్టాలు ఇచ్చారు. మిగిలిన విస్తీర్ణం ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉన్నా.. క్షేత్ర స్థాయిలో ఆక్రమణలు వెలిశాయి. పేదల పేరిట టీడీపీ నాయకులు ఇటు గెడ్డ స్థలంలో, ప్రభుత్వ స్థంలో కూడా డెబ్రిస్ వేసి కప్పేసి మరో వైపు నిర్మాణాలు చేస్తున్నారు. తొలగించిన చోటే నిర్మాణాలు ఇక్కడ గెడ్డ వైపు రెండు చోట్ల గతంలో ప్రస్తుతం ల్యాండ్ ప్రొటెక్షన్ స్పెషల్ ఆర్ఐగా ఉన్న రవిశంకర్ ఆధ్వర్యంలో ఆక్రమణలు తొలగించి, హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆక్రమణ తొలగించిన స్థంలోనే షెడ్ వెలసింది. హెచ్చరిక బోర్డు పీకేసి మరో షెడ్ నిర్మించారు. ఇష్టానుసారంగా గెడ్డ స్థలం పూడ్చివేత ఇక కళానగర్– వాంబే కాలనీ మధ్య ఉన్న గెడ్డె–చెక్ డ్యాం స్థలం కప్పుకున్న వారికి కప్పు కున్నంత అన్నట్టు ఉంది. దీనిని ఆనుకుని ఇళ్లు నిర్మాణం చేసుకున్న వారు, చోటా నాయకులు డెబ్రిస్ తెచ్చి ఇష్టాను సారంగా పూడ్చి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. కోట్లు విలువ చేసే భూమిపై ఎందుకు నిర్లక్ష్యం? ఈ కాలనీ జాతీయ రహదారి సమీపంలో ఉండడంతో ఎకరం రూ.8కోట్ల వరకు పలుకుతోంది. ఇక్కడ ఒక్కో షెడ్ అనధికారికంగా రూ.5 నుంచి రూ.6లక్షల వరకుఅమ్ముడవుతుంది. దీంతో కబ్జారాయుళ్లు కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీల పేరిట షెడ్లు వేసి ఆక్రమణలకు పాల్పడున్నారు. ఇంత బహిరంగంగా ప్రభుత్వ భూమి కబ్జా, వ్యాపారం సాగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఆక్రమణలు రెగ్యులరైజ్ చేయిస్తామని, రెవెన్యూ అధికారులకు సమర్పించుకోవాలని టీడీపీ నాయకులు ఒక్కోరి వద్ద నుంచి రూ. 10 వేల వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కబ్జాదారులకు కలిసొచ్చిన వేళ రెండు నెలలుగా బదిలీలు, ఓటర్ల ఎన్యూమరేషన్, స్మార్టు పల్స్‌సర్వే కబ్జారాయుళ్లకు వరంగా మారాయి. ఇక్కడ ఉన్న ఐదుగురు వీఆర్వోలు స్మార్టు పల్స్ సర్వేలో ఎన్యూమరేటర్లుగా, వీఆర్ఏలను ట్యాబ్ అసిస్టెంట్లుగా ప్రభుత్వం నియమించింది. దీంతో ఆక్రమణల పర్వం నిరభ్యంతరంగా సాగుతుండటంతో మరికొంత మంది ఆక్రమణలు సిద్ధమవుతున్నారు. టీడీపీ నాయకుల కన్నెర్రతో మౌనం జీవీఎంసీ 4వ వార్డు సాయిరాంకాలనీలో కొన్ని ఆక్రమణలకు తొలగించేందుకు వీఆర్వోలు సిద్ధం కాగా ఇద్దరు టీడీపీ ముఖ్య నాయకులు అడ్డుపడటంతో వారు తోక ముడిచారు. టీడీపీ నేతలు ఆగడాలకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అని స్థానికులు అంటున్నారు. ఉన్నత స్థాయి అధికారులు ఆక్రమణ దారులకే కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పరిశీలించి చర్యలు నేను ఇటీవలే బాధ్యతలు స్వీకరించాను. ఈ విషయం ఇంత వరకు మా దృష్టికి రాలేదు. ఫీల్డ్‌లో పరిస్థితి అంతా పరిశీలించి చర్యలు చేపడతాం. అక్రమణ దారులపై కఠినంగా వ్యవహరిస్తాం. –ఎం.శంకరరావు, తహసీల్దార్