
భర్తతో త్రినయని (ఫైల్), త్రినయని మృతదేహం
కీసర: భర్త వేధింపులు తాళలేక ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. సోమవారం కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ సుధీర్‌కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని మౌలాలికి చెందిన త్రినయని (21), అక్షయ్‌కుమార్ (25) ప్రేమించుకొని ఏడు నెలల క్రితం ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఈసీఐఎల్ కమలానగర్‌లో ఇంటిని అద్దెకు తీసుకొని కొన్ని నెలలు ఉన్నారు. మూడు నెలల క్రితం రాంపల్లి పరిధిలోని పీసీఆర్ ఎన్‌క్లేవ్‌కు మకాం మార్చారు.
కాగా పెళ్లైన కొన్ని నెలల నుంచే భర్త అక్షయ్‌కుమార్, అత్తమామలు జగ్జీవన్, రమాదేవి.. త్రినయనిని మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం తెల్లవారుజామున ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో త్రినయని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. విష యం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మృతురాలి తండ్రి రాజ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment