
మోబిన్ ఖలీదా(ఫైల్)
అంబర్‌పేట: అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ మోహన్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాపూనగర్‌కు చెందిన షేక్ అబ్దుల్ రసూల్ కుమార్తె మోబిన్ ఖలీదా(32)కు నెల రోజుల క్రితం చాంద్రాయణగుట్ట ఫూల్‌బాగ్‌కు చెందిన ఖైసర్ కుమారుడు మహ్మద్ సాబెర్‌తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 12 తులాల బంగారం, 30 తులాల వెండి కట్నంగా ఇచ్చారు. గత కొద్ది రోజులుగా అత్తింటివారు అదనపు కట్నం కోసం ఖలీదాను వేధిçస్తున్నారు. ఇళ్లు కొనివ్వాలంటూ ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆమె ఈ నెల 27న పుట్టింటికి వచ్చింది. అప్పటినుంచి మనస్తాపపానికిలోనైన ఖలీదా సోమవారం రాత్రి ఇంట్లో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.