భర్త వివాహేతర సంబంధాలు.. భార్య ఆత్మహత్య | new bride suicide due to husband unmaritual relations | Sakshi
Sakshi News home page

భర్త వివాహేతర సంబంధాలు.. భార్య ఆత్మహత్య

Published Tue, Jul 4 2017 7:28 AM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

భర్త వివాహేతర సంబంధాలు.. భార్య ఆత్మహత్య

భర్త వివాహేతర సంబంధాలు.. భార్య ఆత్మహత్య

జీడిమెట్ల: భర్త వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సూరారం టీఎస్‌ఐఐసీ కాలనీకి చెందిన సత్తిరెడ్డి కుమార్తె నీరజా(26), అల్వాల్‌కు చెందిన సుచిన్‌రెడ్డి లకు ఫిబ్రవరి 16 న వివాహం జరిగింది. సుచిన్‌రెడ్డికి పెళ్లికి ముందే పలువురు యువతులతో సంబంధాలు ఉన్నాయి.

పెళ్లయిన తరువాత కూడా అతను తన వైఖరి మార్చుకోకపోగా భార్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. సోమవారం ఉదయం అతను నీరజకు ఫోన్‌ చేసి తిట్టడంతో మనస్థాపానికి గురైన ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి సత్తిరెడ్డి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement