
ప్రభుత్వ డాక్టర్ వివేక్ భార్య నీరజకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహా్వనిస్తున్న బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ సతీమణి త్రివేణి
ధర్మవరం: ప్రభుత్వ వైద్యుని భార్య బీజేపీ సేవలో తరిస్తున్నారు. ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప దంతవైద్యునిగా పనిచేస్తున్నారు. ఈయన భార్య నీరజ కూడా డాక్టరే. అయితే ఆమె ప్రైవేట్‌గా వైద్య సేవలందిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తరఫున భార్య త్రివేణి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం డాక్టర్ వివేక్ ఇంటివద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు.
ఈ సందర్భంగా దంతవైద్యుని సమక్షంలోనే ఆయన భార్య డాక్టర్ నీరజకు బీజేపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ డాక్టర్ భార్య రాజకీయ పార్టీలో చేరడం విమర్శలకు తావిచ్చింది. ఇదిలా ఉండగా బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ నామినేషన్ సమయంలో సమర్పించిన వివరాలలో భార్య పేరు ప్రస్తావించలేదు. పిల్లలు మాత్రమే ఉన్నట్లు పొందుపరిచారు. ఎన్నికల ప్రచారంలో మాత్రం సత్యకుమార్ భార్యగా త్రివేణి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment