కామారెడ్డి: బీఆర్‌ఎస్‌లో సరైన గౌరవం దక్కడం లేదని, స్థానిక నాయకులు పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని బీబీపేట బీఆర్‌ఎస్ ఎంపీటీసీ 2 కొరివి నీరజ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆమె వీడియోలో మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టిన కనీస గౌరవంగా పిలువడం లేదని, పార్టీ నేతలు చిన్నచూపు చూస్తున్నారని ఆమె వాపోయారు.
ప్రొటోకాల్ ప్రకారం కూడా పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా అవ మాన పరుస్తున్నారన్నారు. బీ ఆర్‌ఎస్ మండల నేతల వల్లే ఇలాంటి అవమానం జరుగుతుందని పేర్కొన్నారు. ఆమె భర్త నర్సింలు వీడియోలో మాట్లాడుతూ స్థానిక పార్టీ నేతలతోనే అవమానం ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే స్పందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment