
భర్తతో జయలక్ష్మి (ఫైల్)
పెళ్లైన నాలుగు నెలలకే వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన బుధవారం సుబ్రహ్మణ్యనగర పోలీస్ స్టేష న్ పరిధిలో చోటు చేసుకుంది.
కర్ణాటక,కృష్ణరాజపురం : పెళ్లైన నాలుగు నెలలకే వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన బుధవారం సుబ్రహ్మణ్యనగర పోలీస్ స్టేష న్ పరిధిలో చోటు చేసుకుంది. జయలక్ష్మి (24)అనే మహిళకు నాలుగు నెలల క్రితం బెంగళూరు నగరంలో ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న కిరణ్‌కుమార్ అనే వ్యక్తితో వివాహమైంది. అప్పటి నుంచి ఇద్దరు ఉత్తరహళ్లిలో నివాసం ఉంటున్నారు. బుధవా రం భర్త కార్యాలయానికి వెళ్లిన అనంతరం జయలక్ష్మి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సుబ్రహ్మణ్య పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు వెల్లడి కావాల్సి ఉంది.
ఉరికి వేలాడుతున్న జయలక్ష్మి