సాక్షి, హైదరాబాద్ : ప్రేమోన్మాది పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన రవళికి మంగళవారం గాంధీ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం పూర్తి చేశారు. అనంతరం రవళి మృత దేహాన్ని వరంగల్ జిల్లా రామచంద్రపురానికి తరలించారు. ఈ సందర్భంగా తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆస్పత్రి వద్ద రవళి కుటుంబాన్ని పరమార్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రవళి ఆరోగ్యం మొదటి నుంచి విషమంగానే ఉంది. ప్రభుత్వమే అన్ని రకాల వైద్య ఖర్చులను భరించింది. రవళిని బతికించడానికి డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నించారు. కానీ దురదృష్టవశాత్తు ఆమె మరణించింది. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూస్తాము. రవళి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామ’ని హామి ఇచ్చారు.
అంతేకాక రవళి తల్లిదండ్రులు కోరిక ప్రకారం నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు. ఇందుకు అవసరమైన అన్ని ఆధారాలను కోర్టు ముందు ఉంచుతామన్నారు. వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామి ఇచ్చారు. (అతడ్ని కూడా అదే విధంగా చంపాలి : రవళి తండ్రి)
Comments
Please login to add a commentAdd a comment