ఈమె అచ్చ తెలుగు హీరోయిన్. పుట్టి పెరిగింది అంతా ఉమ్మడి ఆంధ్రాలోనే. పద్దెనిమిదేళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చేసింది. బోలెడన్ని హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. దాదాపు 20 ఏళ్ల పాటు నటిగా కొనసాగింది. ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో మెల్లమెల్లగా సినిమాలు తగ్గించేసింది. ప్రస్తుతం పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?
పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు రవళి. ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియని పేరు. 'పెళ్లి సందడి' రవళి అంటే మాత్రం చాలామంది గుర్తుపట్టేస్తారు. అవును పైన ఫొటోలో కనిపస్తున్నది ఆమెనే. 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో పుట్టిన ఈమె.. 1990లో 'జడ్జిమెంట్' అనే మలయాళ మూవీతో నటిగా మారింది. ఆ తర్వాత ఏడాదే తెలుగులో 'జయభేరి' మూవీలో హీరోయిన్‌గా చేసింది. తొలుత నాలుగేళ్ల పాటు ఈమెకు పెద్దగా ఛాన్సులు రాలేదు. ఎప్పుడైతే 'పెళ్లి సందడి' చేసిందో ఈమె దశ తిరిగిపోయింది.
(ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!)
1996లో వచ్చిన 'పెళ్లి సందడి' సినిమా.. రవళి కెరీర్‌కి బూస్టప్ ఇచ్చింది. దీంతో వరసపెట్టి అవకాశాలు వచ్చాయి. రవళి చేసిన చిత్రాల్లో ఒరేయ్ రిక్షా, వినోదం, చిన్నబ్బాయి, ముద్దుల మొగుడు, శుభాకాంక్షలు, మర్ద్(హిందీ) తదితర చిత్రాలు ఈమెకు చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక హీరోయిన్ గా ఛాన్సులు తగ్గిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు మూవీస్ చేసింది. 2011లో 'మాయగాడు' అనే సినిమాలో చివరగా నటించింది.
రవళి వ్యక్తిగత విషయానికొస్తే.. 2007లో నీలి కృష్ణ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం రవళికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సీరియల్ నటి హరిత.. రవళికి అక్క అవుతుంది. ఇకపోతే ఎప్పటికప్పుడు తిరుమల దర్శనానికి వచ్చే రవళి.. తాజాగా ఫ్యామిలీతో కలిసి స్వామి వారిని దర్శించుకుంది. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు చూసి తొలుత ఆమెని గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత గుర్తుపట్టి, ఈమె ఆమెనా అని అనుకుంటున్నారు.
(ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'జబర్దస్త్' ఫైమా.. అసలు ఏమైందంటే?)
Comments
Please login to add a commentAdd a comment