200 ఏళ్ల క్రితం కథతో... | TAMMAREDDYBHARADWAJ LAUNCHES DAMAYANTHI TEASER | Sakshi
Sakshi News home page

200 ఏళ్ల క్రితం కథతో...

Published Sun, Oct 28 2018 3:10 AM | Last Updated on Thu, Mar 28 2019 6:31 PM

TAMMAREDDYBHARADWAJ LAUNCHES DAMAYANTHI TEASER - Sakshi

కౌశిక్‌ అంగారిక

కౌశిక్‌ అంగారిక హీరోగా నౌండ్ల శ్రీనివాస్‌ దర్శకత్వంలో వియాన్‌ జీ, గీతా కౌశిక్‌ నిర్మించిన సినిమా ‘దమయంతి’. అర్చనా సింగ్, రవళి, అనిక, ఆగస్టీన్‌ కీలక పాత్రలు చేశారు. హీరో కౌశిక్‌ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. టీజర్‌ను రిలీజ్‌ చేసిన నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘నా దగ్గర స్క్రిప్ట్‌ రైటర్‌గా పనిచేసిన శ్రీనివాస్‌ ఈ సినిమాతో దర్శకునిగా మారాడు. ఈ సినిమా కథ విన్నప్పుడు ఎగై్జట్‌ అయ్యాను. 200 ఏళ్ల కిందటి సబ్జెక్ట్‌ను వర్తమాన కాలానికి లింక్‌ చేసి సినిమా చేశారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌. టీజర్, ట్రైలర్‌ బాగున్నాయి’’ అన్నారు. ‘‘శిష్యునిగా నన్ను ఆదరించినందుకు భరద్వాజ్‌గారికి ధన్యవాదాలు. నల చక్రవర్తి భార్యనే దమయంతి.

కానీ ఆ తరహా కథ కాదు. పొయెటిక్‌ స్పర్శతోపాటు థ్రిల్లింగ్‌ మిళితమై ఉన్న సినిమా ఇది. టీమ్‌ అందరు బాగా సహకరించారు. నటించినవారందరికీ సమప్రాధాన్యం ఉంది. కథ ఇంపార్టెంట్‌ రోల్‌ ప్లే చేస్తుంది. నాకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు శ్రీనివాస్‌. ‘‘డైరెక్టర్‌ను నమ్మి ఈ సినిమా చేశాను. ఈ సినిమా క్రెడిట్‌ ఆయనకే దక్కుతుంది. మ్యూజిక్‌ బాగా వచ్చింది. వచ్చే నెలలో ఆడియోను రిలీజ్‌ చేస్తాం. సినిమా అందరికీ నచ్చి తీరుతుంది’’ అన్నారు కౌశిక్‌. ‘‘షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. నవంబర్‌ లేదా డిసెంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు ఈ చిత్ర నిర్మాత గీతకౌశిక్‌. ఈ చిత్రానికి సంగీతం:ఎస్‌.ఎస్‌. ఆత్రేయ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement