Archana Singh
-
స్త్రీలోక సంచారం
అర్చనా సింగ్ పోలీస్ కానిస్టేబుల్. కొత్వాలి స్టేషన్లో ఆమె డ్యూటీ. కొత్వాలి ఝాన్సీ జిల్లాలో ఉంది. ఝాన్సీ జిల్లా ఉత్తర ప్రదేశ్‌లో ఉంది. అర్చనకు 30 ఏళ్లు. పెళ్లైంది. పదేళ్ల కూతురు, ఇంకో ఆర్నెల్ల కూతురు ఉన్నారు. భర్తకు హరియాణాలో ఉద్యోగం. ప్రైవేట్ కంపెనీలో చేస్తాడు. అర్చన తల్లిదండ్రులు కాన్పూర్‌లో ఉంటారు. అర్చన పెద్ద కూతురు కాన్పూర్‌లో అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరుగుతోంది. భర్తకు, తల్లిదండ్రులకు, పెద్ద కూతురికి దూరంగా అర్చన 2016 నుంచి కొత్వాలీలో డ్యూటీ చేస్తోంది. ఇప్పుడు నెలల బిడ్డ, తను ఉంటున్నారు. ఆదివారం ఉదయం అకస్మాత్తుగా ఉత్తర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అర్చనను పిలిపించారు. ఆమెతో కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాత అర్చనను ఆగ్రాకు బదలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు! అర్చన సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయింది. ఏం జరిగిందో ఆమెకు తెలియలేదు. కానైతే మంచే జరిగింది. తను కోరుకుంటున్నదే జరిగింది. ఆగ్రాలో ఉంటే పెద్దకూతురితో, భర్తతో కలిసి ఉండేందుకు వీలవుతుంది. తల్లిదండ్రులూ దగ్గరగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఉంటూ రోజూ డ్యూటీకి వెళ్లి రావడమంత సంతోషం ఏముంటుంది.. ఈ చిన్ని జీవితానికి! ఆమెకు ఇంతటి ‘మహర్దశ’ను పట్టించింది చిన్న కూతురు. ఎప్పట్లాగే ఆ.. నెలల బిడ్డను తనతో పాటు డ్యూటీకి తెచ్చిన అర్చన ఆ బిడ్డను తన కళ్ల ఎదుటే ఓ బల్ల మీద ఉంచి తన పనిలో తను ఉన్నప్పుడు ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ ఫొటోను చూసిన వెంటనే లక్నోలోని ‘టైమ్స్’ పత్రిక ఆమె గురించి రాసింది. ఆ వార్త చదివిన డీజీపి వెంటనే అర్చనకు ‘వరం’ ఇచ్చారు. అన్నీ వెంట వెంటనే! అర్చనైతే చాలా హ్యాపీగా ఉంది. డీజీపీని, కొత్వాలీలో తనతో కలిసి పని చేసినవారిని, తనను కలుపుకుని పనిచేసినవారిని, పత్రికా ప్రతినిధులను తలచుకుని తలుచుకుని ధన్యవాదాలు తెలుపుతోంది. ఇప్పుడిక అర్చన తన విధులను మరింత ధ్యాసగా నిర్వర్తించడానికి ఆమె కుటుంబం ఆమెకు తోడ్పడుతుంది. అర్చన గురించి డీజీపీ తను చదివిన వార్తను ట్యాగ్ చేస్తూ ఏం ట్వీట్ చేశారో చూడండి. ‘‘21 శతాబ్దపు అచ్చమైన మహిళ. ఏ బాధ్యతనైనా నిబద్ధతతో చేస్తుంది. అందుకు ఒక నిదర్శనం అర్చన.’’ ఆపిల్ కో–ఫౌండర్ స్టీవ్ జాబ్స్ నలుగురి పిల్లల్లో పెద్దమ్మాయి లీసా బ్రెనన్ రచయిత్రి. ఆమె కొత్త పుస్తకం ‘స్మాల్ ఫ్రై’ ఇటీవలే మార్కెట్లోకి వచ్చింది. ఆ పుస్తకంలోని కొన్ని భాగాల్లో తండ్రితో తనకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా రాసుకున్నారు లీసా. స్టీవ్ జాబ్స్ 2011 అక్టోబర్‌లో క్యాన్సర్‌తో చనిపోయారు. ఆపిల్ కంపెనీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు తను ప్రేమించిన యువతితో విడిపోయి పక్కకు వచ్చేశాడు స్టీవ్. ఆ తర్వాతి ఏడాది పుట్టిన అమ్మాయే లీసా. అయితే స్టీవ్ ఆమెను తన కూతురు కాదనేశాడు. వైద్యపరీక్షల్లో నిర్ధారణ అయ్యాక గానీ లీసాకు తనే తండ్రి అని అంగీకరించలేక పోయాడు. ఇవన్నీ లీసా పెద్దగా మనసులో పెట్టుకున్నట్లు లేదు. తొమ్మిదేళ్ల వయసులో తండ్రితో కలిసి స్కేటింగ్‌కి వెళ్లే టప్పుడు వాళ్లిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉండేదో తన ‘స్మాల్ ఫ్రై’ పుస్తకంలో ఒక చోట రాశారు లీసా. ‘‘హే, స్మాల్ ఫ్రై, లెట్ అజ్ బ్లాస్ట్. వియ్ ఆర్ లివింగ్ ఆన్ బారోడ్ టైమ్’’ అనేవారట స్టీవ్. ‘అరువు తెచ్చుకున్న సమయాన్ని ఉత్తేజంతో నింపుకుందాం’ అని ఆయన మాటలకు అర్థం. లీసాకు అది అర్థం అయింది కానీ, ‘స్మాల్ ఫ్రై’ అనే మాటను తనకు తెలిసిన అర్థంలోనే తీసుకుని, తను కూడా తండ్రిని.. ‘ఓకే ఫ్యాట్ ఫ్రై, లెటజ్ గో’ అనేదట. ‘స్మాల్ ఫ్రై’ అనే మాటకు రెండు అర్థాలున్నాయి. ప్రాముఖ్యంలేని మనిషి లేదా వస్తువు అనేది ఒక అర్థం. పిల్ల చేప అనేది ఇంకో అర్థం. ఇవి రెండూ కాకుండా.. లీసా అనుకున్న అర్థం వీటికి భిన్నమైనది. ఫ్రెంచి ఫ్రైస్ ఉంటాయి కదా.. బంగాళ దుంపలతో చేసేవి.. వాటిల్లో తినగా అడుగున మిగిలిపోయిన తునకల్ని స్మాల్ ఫ్రైస్ అంటారని అనుకున్న లీసా.. తనను అంత మాట అన్న తండ్రిపై ప్రతీకారంగా ‘ఫ్యాట్ ఫ్రై’ అనేసిందట. ఆ తర్వాత తెలుసుకుందట.. తండ్రి తనను పిల్ల చేప (ఎదుగుతున్న చేప) అనే అర్థంలో ‘స్మాల్ ఫ్రై’ అని అన్నాడని. చివరికి అదే మాటను ఆమె తన పుస్తకానికి టైటిల్‌గా పెట్టుకున్నారు. -
200 ఏళ్ల క్రితం కథతో...
కౌశిక్ అంగారిక హీరోగా నౌండ్ల శ్రీనివాస్ దర్శకత్వంలో వియాన్ జీ, గీతా కౌశిక్ నిర్మించిన సినిమా ‘దమయంతి’. అర్చనా సింగ్, రవళి, అనిక, ఆగస్టీన్ కీలక పాత్రలు చేశారు. హీరో కౌశిక్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. టీజర్‌ను రిలీజ్ చేసిన నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘నా దగ్గర స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసిన శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకునిగా మారాడు. ఈ సినిమా కథ విన్నప్పుడు ఎగై్జట్ అయ్యాను. 200 ఏళ్ల కిందటి సబ్జెక్ట్‌ను వర్తమాన కాలానికి లింక్ చేసి సినిమా చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్. టీజర్, ట్రైలర్ బాగున్నాయి’’ అన్నారు. ‘‘శిష్యునిగా నన్ను ఆదరించినందుకు భరద్వాజ్‌గారికి ధన్యవాదాలు. నల చక్రవర్తి భార్యనే దమయంతి. కానీ ఆ తరహా కథ కాదు. పొయెటిక్ స్పర్శతోపాటు థ్రిల్లింగ్ మిళితమై ఉన్న సినిమా ఇది. టీమ్ అందరు బాగా సహకరించారు. నటించినవారందరికీ సమప్రాధాన్యం ఉంది. కథ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నాకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు శ్రీనివాస్. ‘‘డైరెక్టర్‌ను నమ్మి ఈ సినిమా చేశాను. ఈ సినిమా క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. మ్యూజిక్ బాగా వచ్చింది. వచ్చే నెలలో ఆడియోను రిలీజ్ చేస్తాం. సినిమా అందరికీ నచ్చి తీరుతుంది’’ అన్నారు కౌశిక్. ‘‘షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. నవంబర్ లేదా డిసెంబర్లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు ఈ చిత్ర నిర్మాత గీతకౌశిక్. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్. ఆత్రేయ. -
వంటకాల బండి...ఇది మహిళలదండి!
న్యూఢిల్లీ: గాజులు లేని వంట ఘుమ ఘుమ లాడున్....అనే మాట వంటను వృత్తిగా చేసుకొని బతుకుతున్న మగవాళ్ల గురించి స్ఫూర్తిగా చెప్పినదైయుండున్. ఇంటి వంటకు మాత్రమే పరిమితమవుతున్న మగువలు కూడా వంటను వృత్తిగా చేసుకుంటే నలభీములు కూడా వారి ముందు బలదూర్ అని నిరూపిస్తున్నారు బెంగళూరుకు చెందిన 32 ఏళ్ల అర్చనా సింగ్. సరసమైన ధరలకు నాణ్యమైన ఆహారాన్ని వేడివేడిగా అందించడంతోపాటు తోటి మహిళలుకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో అర్చనా సింగ్ ట్రక్కు ద్వారా ఆహారాన్ని సరఫరాచేసే సరికొత్త స్కీమ్‌ను ప్రారంభించారు. చదువు, సంధ్యలు, నైపుణ్యం గల మహిళలు ఎక్కడైనా, ఏపనైనా చేసుకొని బతుకగలరు. ఇటు చదువు, అటు నైపుణ్యంలేని మహిళలు నేటి ఆధునిక సమాజంలో గౌరవప్రదంగా బతకడం కష్టమే. అందుకనే అర్చనా సింగ్ తన టీమ్‌లోకి అలాంటి మహిళలనే ఎక్కువగా తీసుకున్నారు. వారందరనికి ఆమెనే వివిధ ర కాల వంటకాల్లో శిక్షణ ఇచ్చారు. సాధారణ సంప్రదాయ భోజనాలతోపాటు పసందైన బిర్యానీ, చికెన్ టిక్కాలు, ఆలూ టిక్కీ హాట్‌డాగ్స్, చీజ్ కేక్స్ అన్నీ చేస్తారు అర్చనా సింగ్ టీమ్. వీరు తమ వంటకాలను ట్రక్కులో టెకీ సెంటర్లకు, కాలేజీలకు, ట్రాఫిక్ సెంటర్లకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. అర్చనా టీమ్ ఈ వ్యాపారాన్ని చేపట్టి సరిగ్గా రెండు నెలలు కూడా కానప్పటికీ సూపర్ డూపర్ హిట్టయింది. ఘుమఘుమలాడే వంటకాలు అద్భుతం, అమోఘం అని భోజన ప్రియులు కితాబివ్వడమే కాకుండా మరిన్ని ట్రక్కులతో అన్ని వీధులకు వ్యాపారాన్ని విస్తరించాల్సిందిగా అర్చనా టీమ్‌కు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వారి సలహామేరకు ఇరుగు, పొరుగు పట్టణాలతోపాటు రాష్ట్రాలకు విస్తరించాలని అర్చనా సింగ్ భావిస్తున్నారు. త్వరలో ఔరంగాబాద్, పాట్నా నగరాల్లో కూడా తమ సర్వీసులను ప్రారంభిస్తున్నామని, మరో ఆరేడు నెలల్లో హైదరాబాద్-చెన్నై నగరాల మధ్య కూడా చేపడతామని చెప్పారు. ‘సెవెన్త్ సిన్’ పేరిట ట్రక్కు ద్వారా ఆహార సరఫరా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అర్చనా టీమ్ ఏడవ రోజైనా ఆదివారం నాడు విశ్రాంతేమీ తీసుకోవడం లేదు. బిచ్చగాళ్లు, నిరుపేదలు, మురకివాడల ప్రజలకు ఉచితంగా భోజనాలను అందిస్తూ సామాజిక సేవ కూడా చేస్తోంది. ఈ ఫుడ్ ట్రక్ సర్వీసును ప్రారంభించాలనే ఆలోచన తనకు తొలిసారిగా 2015, డిసెంబర్ నెలలోనే వచ్చిందని, నైపుణ్యంలేని మహిళలకు ఉపాధి కల్పించాలని నిర్ణయించుకున్నందున వారికి తగిన శిక్షణ ఇచ్చి ప్రారంభించేందుకు ఇంతకాలం పట్టిందని అర్చన తెలిపారు. వంట చేయడంలో తాను ఎక్కడా శిక్షణ తీసుకోలేదని, తన తండ్రి నౌకాధికారి అవడం వల్ల ఆయనతోపాటు దేశంలోని పలు ప్రాంతాలకు తిరగాల్సి వచ్చిందని, ఆ సందర్భంగా ప్రతి వంటకాన్ని రుచి చూడడమే కాకుండా అది ఎలా చేయాలో నేర్చుకున్నానని, ఇంటి పట్టున ఉండడంకన్నా తన అభిరుచితో వ్యాపారం ఎందుకు చేయకూడదని అనుకొని ఈ వ్యాపారం ప్రారంభించానని చెప్పారు. ఆడవాళ్లే ఎందుకు, నైపుణ్యంగల చెఫ్‌లను తీసుకుంటే తాము కూడా పెట్టుబడులు పెడతామంటూ ముందుకొచ్చిన కొంతమంది వ్యాపారులు ఉన్నారని, అయినా తాను మహిళలతో మాత్రమే వ్యాపారాన్ని నిర్వహిస్తాననే కృతనిశ్చయంతో ముందుకు కదిలానని ఆర్చన వివరించారు. టెక్, యూనివర్శిటీ ప్రాంతాలకే కాకుండా ముందుగా ఫోన్ ద్వారా బుక్ చేసుకున్న పార్టీలకు కూడా తమ టీమ్ ఆహారాన్ని సరఫరా చేస్తోందని ఆమె చెప్పారు. ట్రక్కును తాను స్వయంగా నడుపుతుంటే ప్రవీణ్ నందూ ఫుడ్ సర్వీస్ సీఈవోగా, నటాషా పాత్రో చెఫ్‌గా, దీప, ఉషా, హేమ సహాయకులుగా పనిచేస్తున్నారని ఆమె తెలిపారు. -
చిన్న చిత్రాలు నిలబడాలంటే..
చిన్న బడ్జెట్ చిత్రాలు బతికి బట్ట కట్టాలంటే ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలన్నారు తమిళ దర్శకుల సంఘం కార్యదర్శి ఆర్కే.సెల్వమణి. నాన్‌కడవుల్ రాజేంద్రన్, లొల్లుసభ స్వామినాథన్,అర్చనాసింగ్, కృష్ణమూర్తి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం యానై మేల్ కుదిరై సవారి. బెట్లర్స్ సినిమా పతాకంపై కథ,మాటలు, పాటలు దర్శకత్వం, నిర్మాణం బాధ్యతలను కరుప్పయ్య మురుగన్ నిర్వహించారు. హిమాలయన్ సంగీత బాణీలు సమకూర్చిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. సీనియర్ దర్శకుడు, నటుడు కే.భాగ్యరాజ్ ఆడియోను ఆవిష్కరించగా తొలి సీడీని దర్శకుడు పేరరసు అందుకున్నారు. ఆర్కే.సెల్వమణి మాట్లాడుతూ మహానగరాల్లో థియేటర్లు ఐదు నక్షత్రాల స్థాయికి మారిపోతున్నాయన్నారు. చాలా వరకు మల్టీఫ్లెక్స్ థియేటర్లుగా రూపాంతరం చెందుతున్నాయన్నారు. ఆ థియేటర్లలో సినిమా చూడాలంటే టికెట్ ధర, ఇతర తినుబండారాలకంటూ ఒక మనిషికి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. సాధారణ ప్రేక్షకులు అంత ఖర్చు పెట్టి సినిమాలు చూడలేరని అన్నారు. అంతే కాకుండా మల్టీఫ్లెక్స్ థియేటర్లలో భారీ బడ్జెట్ చిత్రాలను చూడడానికే ప్రేక్షకులు ఆసక్తి చూపుతారని పేర్కొన్నారు.అందువల్ల థియేటర్ల యాజమాన్యం అలాంటి చిత్రాలనే ప్రదర్శిస్తారని అన్నారు. అందువల్ల చిన్న బడ్జెట్ చిత్రాలు మల్టీఫ్లెక్స్ థియేటర్లలో ప్రదర్శనకు నోచుకునే అవకాశం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి చిన్న చిన్న నగరాలు, గ్రామాల్లో రూ.50 ధరగా 100 మంది కూర్చుని చూసేలా థియేటర్లను ప్రభుత్వం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.అప్పుడే పైరసీ బాధ తప్పుతుందని, చిన్న నిర్మాతలు బతికి బట్టకట్టగలుగుతారని ఆర్కే.సెల్వమణి అన్నారు. -
పులి పోరు.. అవార్డుల జోరు..
ఈరోజు నువ్వో నేనో తేలిపోవాల్సిందే అంటూ హోరాహోరీగా పోరాడుతున్న ఈ పులుల చిత్రం బాగుంది కదూ.. దీన్ని తీసింది మన దేశానికి చెందిన ఫొటోగ్రాఫర్ అర్చనా సింగ్. ఆమె ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే 5న మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ జాతీయ పార్కులో తీశారు. ప్రతిష్టాత్మక నేషనల్ జియోగ్రాఫిక్ రీడర్స్ ఫొటో ఆఫ్ ద ఇయర్-2014 పోటీలో ‘నేచర్’ విభాగంలో ఈ ఫొటోకు ప్రత్యేక ప్రశంస లభించింది.