damayanthi
-
200 ఏళ్ల క్రితం కథతో...
కౌశిక్ అంగారిక హీరోగా నౌండ్ల శ్రీనివాస్ దర్శకత్వంలో వియాన్ జీ, గీతా కౌశిక్ నిర్మించిన సినిమా ‘దమయంతి’. అర్చనా సింగ్, రవళి, అనిక, ఆగస్టీన్ కీలక పాత్రలు చేశారు. హీరో కౌశిక్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. టీజర్‌ను రిలీజ్ చేసిన నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘నా దగ్గర స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసిన శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకునిగా మారాడు. ఈ సినిమా కథ విన్నప్పుడు ఎగై్జట్ అయ్యాను. 200 ఏళ్ల కిందటి సబ్జెక్ట్‌ను వర్తమాన కాలానికి లింక్ చేసి సినిమా చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్. టీజర్, ట్రైలర్ బాగున్నాయి’’ అన్నారు. ‘‘శిష్యునిగా నన్ను ఆదరించినందుకు భరద్వాజ్‌గారికి ధన్యవాదాలు. నల చక్రవర్తి భార్యనే దమయంతి. కానీ ఆ తరహా కథ కాదు. పొయెటిక్ స్పర్శతోపాటు థ్రిల్లింగ్ మిళితమై ఉన్న సినిమా ఇది. టీమ్ అందరు బాగా సహకరించారు. నటించినవారందరికీ సమప్రాధాన్యం ఉంది. కథ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నాకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు శ్రీనివాస్. ‘‘డైరెక్టర్‌ను నమ్మి ఈ సినిమా చేశాను. ఈ సినిమా క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. మ్యూజిక్ బాగా వచ్చింది. వచ్చే నెలలో ఆడియోను రిలీజ్ చేస్తాం. సినిమా అందరికీ నచ్చి తీరుతుంది’’ అన్నారు కౌశిక్. ‘‘షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. నవంబర్ లేదా డిసెంబర్లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు ఈ చిత్ర నిర్మాత గీతకౌశిక్. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్. ఆత్రేయ. -
షాపింగ్‌కు వెళ్లిన విద్యార్థిని అదృశ్యం..
చిక్కడపల్లి(హైదరాబాద్) : షాపింగ్ చేయడానికి వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన చాలా ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన నగరంలోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం పిలిటి గ్రామానికి చెందిన కుప్పిలి దమయంతి(19) గత కొన్ని రోజుల నుంచి దోమలగూడలోని లైఫ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓ ఇనిస్టిస్ట్యూట్లో గ్రూప్-2 కోచింగ్ తీసుకుంటోంది. ఈ నెల 11వ తేదిన సాయంత్రం 7 గంటలకు హాస్టల్ నుంచి షాపింగ్‌కు అని వెళ్లిన దమయంతి తిరిగి రాలేదు. ఆమె అచూకీ కోసం కుటుంబసభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోయేసరికి ఆమె తల్లిదంద్రులు చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తు చేస్తున్నారు. -
అరుణోదయ వ్యవస్థాపకుడు ‘కానూరి’ కన్నుమూత
ఖమ్మం: ఓ కళా దిగ్గజం కన్నుమూసింది.. ఎమర్జన్సీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కలంతో పోరాడిన యోధుడు తిరిగిరాని లోకాలకు తరలివెళ్లాడు. ప్రజా కళాకారుడు, కళాదిగ్గజం, అరుణోదయ వ్యవస్థాపకుడు కానూరి వెంకటేశ్వరరావు (99) శుక్రవారం ఖమ్మం నగరంలోని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యాలయంలో అనారోగ్యంతో మృతిచెందారు. 1916లో కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా కోడూరులో రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన భార్య దమయంతి ఇరవయ్యేళ్ల క్రితం మృతి చెందారు. ఆయనకు నలుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఆదర్శ కమ్యూనిస్టుగా, ప్రజా కళాకారుడిగా చివరిదాకా నిలిచిన కానూరి జీవితం ఆదర్శప్రాయం. గరికపాటి రాజారావు, సుబ్బారావు, పాణిగ్రహి కోవలో నడిచి నిలిచిన ప్రజా కళాకారుడు. అలాగే, చివరి వరకు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయంలోనే జీవించారు. ప్రజానాట్యమండలి వ్యవస్థాపక ప్రముఖుడు... తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రజానాట్యమండలి వ్యవస్థాపక ప్రముఖుల్లో కానూరి ఒకరు. నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి రైతాంగ పోరాటాల ప్రేరణతో అరుణోదయ సాంసృ్కతిక సమాఖ్యను స్థాపించారు. అప్పటినుంచి వ్యవస్థాపకులుగా, ప్రస్తుతం అరుణోదయ సాంసృ్కతిక సమాఖ్య గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వందలాది క్యాంపులు నిర్వహించి వేలాది మంది కళాకారులకు శిక్షణ ఇచ్చారు. నక్సల్బరీ ఉద్యమం నుంచి గోదావరిలోయ ప్రజాసాహిత్యం వరకు వ్యంగ్య రచయితగా పేరొందారు. కళ వాణిజ్య విలువలను అద్దుకుంటున్న వేళ.. ప్రజా కళాకారుడిగా కానూరి నిబద్ధతగా నిలబడ్డారు. స్వాతంత్య్ర యోధుల పెన్షన్‌ను నిరాకరించాడు. తన జీవితాంతం ప్రజా ఉద్యమాల చెంతనే నిలిచాడు. ప్రజాకళకే అంకితమయ్యారు. కొండపల్లి సీతారామయ్య కమ్యూనిస్టు పార్టీ కృష్ణా జిల్లా కార్యదర్శిగా ఉండగా, 5 తాలూకాలలో సాంసృ్కతిక, బుర్రకథల దళాలుండేవి. వీటిని కానూరి కన్వీనర్‌గా వ్యవహరించేవారు. ఆనాటి నుంచి కమ్యూనిస్టు పార్టీ సారధ్యంలో ప్రజానాట్యమండలిలో వివిధ కళారూపాలను ప్రదర్శించారు. 1945లో 20 ఏళ్ల వయసులో సంప్రదాయ కళారంగం నుంచి ప్రజానాట్యమండలిలోకి ప్రవేశించారు. అప్పటినుంచి నేటి వరకు ఆ కళారంగమే శ్వాసగా బతికారు. -
కనీసం మీరైనా అర్థం చేసుకోరూ..!
అమ్మానాన్నలతో కలిసి మా పెదనాన్న కూతురి పెళ్లికి వెళ్లానో రోజు. పెళ్లికొడుకుతో పాటు ఒక అబ్బాయి వచ్చాడు. అతను పెళ్లికొడుక్కి బెస్ట్ ఫ్రెండ్ అట. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం. బాగా సంపాదిస్తున్నాడు. మనిషి కూడా బావున్నాడు. ఆ రోజు అతను స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. కానీ అతను మాత్రం నాకు అట్రాక్ట్ అయ్యాడు. నేనెక్కడుంటే అక్కడికి వచ్చేవాడు. ఇబ్బందిగా అనిపించేది. పెళ్లికొడుకు తరఫువాడు కాబట్టి ఏమీ అనలేను. దాంతో అతడు మరింత చనువు తీసుకున్నాడు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా దగ్గరికొచ్చి నన్ను ఇష్టపడుతున్నానని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. ముక్కూ ముఖం తెలియనివాడితో పెళ్లేంటి! అందుకే ‘నో’ చెప్పి వెళ్లిపోయాను. అక్కడితో వదిలేస్తాడనుకున్నాను. కానీ విషయాన్ని మా అమ్మానాన్నల వరకూ తీసుకెళ్లాడు. అమ్మా నాన్నా ఎగిరి గంతేశారు. ఓకే అనేశారు. కనీసం నా ఇష్టం తెలుసుకోకుండా, ముహూర్తాలు కూడా పెట్టించేశారు. నన్ను ఆయన చేతిలో పెట్టేశారు. మొదటిరాత్రి ఆయన తనకున్న సరదా అఫైర్ల గురించి చెప్పారు. నన్నూ చెప్పమని బలవంతపెట్టారు. దాంతో నేను మా క్లాస్మేట్ని ఇష్టపడిన విషయం, అతడికి నా మనసులో మాట చెప్పేలోపే నాకు పెళ్లి కుదిరిపోయిన విషయం చెప్పాను. అతనేదో సరదాగాతీసుకుంటాడనుకున్నాను. అయితే అంతెత్తున లేచారు. మోసం చేశావన్నారు. నిందలు వేశారు. నిప్పులు కక్కారు. నన్ను దోషిని చేసి పదిమందిలో నిలబెట్టారు. అమ్మానాన్నలు కూడా నన్ను సపోర్ట్ చేయలేదు సరికదా, నీ ప్రేమకథలన్నీ ఎవడు చెప్పమన్నాడు అంటూ విరుచుకుపడ్డారు. నేనతన్ని ఇష్టపడ్డానే కానీ, కనీసం అతనికి చెప్పనైనా చెప్పలేదు అని ఎంత మొత్తుకున్నా ఎవరికీ బుర్రకెక్కలేదు. మా వారయితే... మనసులో మరొకరిని పెట్టుకున్న నీతో కాపురం చేస్తే వ్యభిచారంతో సమానం అన్నారు. ఆ మాట నా మనసును విరిచేసింది. ప్రేమించానంటూ వెంటపడి, అందరినీ ఒప్పించి పెళ్లాడిన వ్యక్తి చిన్న విషయానికే అంతగా రియాక్ట్ అవ్వడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాంటివాడు ముందు ముందు ఎంత నరకాన్ని చూపిస్తాడో! అందుకే విడాకులు ఇవ్వమంటే మారు మాట్లాడకుండా ఇచ్చేశాను. ఎంత వేగంగా పెళ్లి జరిగిందో... అంతే వేగంగా మా బంధం విచ్ఛిన్నమైపోయింది. ఆ తర్వాత ఆయన మరో పెళ్లి చేసుకున్నాడు. కానీ నాకు మాత్రం మరో మగాడికి నా మనసులో కానీ, జీవితంలో కానీ చోటివ్వాలనిపించలేదు. అమ్మానాన్నలు కూడా నన్ను చేరదీయకపోవడంతో తెలిసినవారి సాయంతో బెంగళూరు వెళ్లిపోయాను. కష్టపడి బోలెడు సంపాదించాను. అమ్మ చనిపోయినప్పుడు కనీసం కబురైనా చెప్పలేదు నాన్న. కానీ నాన్న చనిపోయినప్పుడు మాత్రం బంధువులు కబురు పెట్టారు. దాంతో తిరిగొచ్చేశాను. అన్ని కార్యాలూ జరిపించి, ఆపైన ఇక్కడే ఉండిపోయాను. మొదట్లో నాకంటూ ఎవరూ లేరే అన్న బాధ తొలిచేసేది. కానీ ఓ పాపను దత్తత తీసుకున్నాను. దాంతో ఒంటరిదాన్ని అన్న భావన తొలగిపోయింది. ఇప్పటికీ చాలామంది నావైపు అదోలా చూస్తుంటారు. జరిగినదాంట్లో నా తప్పు లేదన్న విషయం వాళ్లెవరికీ అర్థం కాదు చెప్పినా. కన్న తల్లిదండ్రులే నన్ను అర్థం చేసుకోనప్పుడు బయటివాళ్లెలా అర్థం చేసుకుంటారు! అర్థం చేసుకోలేని వ్యక్తితో జీవితాన్ని పంచుకోకపోవడమే మంచిది. నా నిర్ణయాన్ని మీరైనా సమర్థిస్తారని నమ్ముతున్నాను. - దమయంతి, ఆముదాలవలస