
ఒకప్పటి హీరోయిన్ రవళి గుర్తుందా? అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రవళి ముఖ్యంగా ‘పెళ్లిసందడి’ సినిమాతో పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు సహా తమిళంలోనూ స్టార్ హీరోలతో జతకట్టి అప్పట్లో సూపర్ క్రేజ్‌ను దక్కించుకుంది. 18 ఏళ్లకే నటిగా కెరీర్ ప్రారంభించి ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ కనిపించింది.
అయితే పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన రవళి ఇప్పటివరకు రీఎంట్రీ ఇవ్వలేదు. తాజాగా తిరుమలలో దర్శనమిచ్చిన ఈమె లుక్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పడు అందచందాలతో అలరించిన రవళి ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.