
పెళ్లిసందడి చిత్రం ద్వారా ఫేమ్ తెచ్చుకున్న భామ శ్రీలీల. ఆ తర్వాత ధమాకా సూపర్ హిట్‌తో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. టాలీవుడ్‌లో ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. యంగ్ హీరోలతో పాటు అగ్రతారలతోనూ నటిస్తోంది. వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల పలు ప్రశ్నలకు సమాధానలిచ్చింది. వరుసగా అగ్ర హీరోల సినిమాల్లో చేయడం వల్ల ఏదైనా ప్రత్యేక ముద్ర పడుతుందని మీకెప్పుడైనా భయం వేసిందా? అని ప్రశ్నించగా తనదైన శైలిలో బదులిచ్చింది శ్రీలీల.
(ఇది చదవండి: స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్.. ఏకంగా త్రిష ప్లేస్‌లో!)
శ్రీలీల మాట్లాడుతూ.. 'సీనియర్లతో ఒకలా.. యువ హీరోలతో చేస్తే మరోలా ఇమేజ్ అనే రోజులు ఎప్పుడో పోయాయి. ప్రజలు ఇప్పుడలా ఆలోచించట్లేదు. చాలా మారిపోయారు. ఎంతో ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారు. సినిమా అనేది సృష్టించిన కథ. తెరపైకి తీసుకురావడానికి అందుకు తగిన పాత్రలకు సరిపోయే తారలనే ఎంచుకుంటారు. మనకిచ్చిన పాత్రకు వందశాతం న్యాయం చేస్తున్నామా? అన్నదే ప్రేక్షకులు చూస్తారు. అంతే కానీ మీ పక్కన ఉన్నది అగ్ర హీరోనా, యువ హీరోనా అనేది ఎవరూ చూడరు. ఏ ఆర్టిస్ట్‌కు కూడా ఇలాంటి ఆలోచన ఉండకూడదు. అసలు వయసును ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవద్దు.' అని అన్నారు. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్, ఆదికేశవ చిత్రాలతో పాటు నితిన్, రామ్, విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది.
(ఇది చదవండి: ప్రేయసితో సహజీవనం.. ఆమె ప్రెగ్నెన్సీపై డౌట్ పడ్డ నటుడు!)
🌸Comfy🌸 pic.twitter.com/QHbPaL7cdT
— Sreeleela14 (@SreeLeela_1) May 29, 2023
Comments
Please login to add a commentAdd a comment