
ఇండస్ట్రీలో ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ శ్రీలీల. పెళ్లిసందD సినిమాతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ధమాకా సూపర్ హిట్‌తో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. అందానికి తోడు అదృష్టం కూడా తోడైనట్లు ఈ సినిమా హిట్‌తో శ్రీలీల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సీనియర్ హీరోల దగ్గర్నుంచి యంగ్‌స్టర్స్ కూడా ఆ బ్యూటీతో జతకట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పటికే మహేశ్ బాబు, రామ్, వైష్ణవ్ తేజ్, నవీన్ పొలిశెట్టి నటిస్తున్న సినిమాల్లో శ్రీలీల హీరోయిన్‌గా ఖరారు అయ్యిందని జోరుగా టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు మరో క్రేజీ హీరో సరసన కూడా ఆమె ఆఫర్ దక్కించుకున్నట్లు సమాచారం.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం సమంతతో ఖుషీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత విజయ్ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
Comments
Please login to add a commentAdd a comment