VD12: Vijay Devarakonda's Birthday Special Poster Released - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ బర్త్‌డే స్పెషల్‌.. కొత్త సినిమా పోస్టర్‌ చూశారా?

Published Tue, May 9 2023 6:03 PM | Last Updated on Tue, May 9 2023 6:11 PM

VD12: Vijay Devarakonda Birthday Special Poster Released - Sakshi

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే!  ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ ఈ మూవీని నిర్మిస్తున్నాయి. విజయ్ దేవరకొండ కెరీర్‌లో 12వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 3న సినీ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

నేడు(మే 9) విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. పియానోని తలపిస్తూ పేర్చిన కాగితపు ముక్కలపై కథానాయకుడి రూపం కనిపించడం ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో విజయ్ సరసన నాయికగా శ్రీలీల నటిస్తున్నారు. 

అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తుండగా నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా గిరీష్ గంగాధరన్, ఆర్ట్ డైరెక్టర్ గా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానుంది.

చదవండి: నాన్న తెలుగులో పెద్ద హీరో, కానీ నాకు మాత్రం ఆఫర్లు రావట్లే: హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement