Vijay Deverakonda And Gowtam Tinnanuri VD12 Officially Launched With A Pooja Ceremony - Sakshi
Sakshi News home page

VD12: రౌడీ హీరోతో శ్రీలీల.. ఘనంగా సినిమా ప్రారంభం

Published Wed, May 3 2023 3:53 PM | Last Updated on Wed, May 3 2023 4:08 PM

Vijay Devarakonda And Gowtam Tinnanuri VD12 Movie Opening Ceremony - Sakshi

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్‌లో ఖుషీ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంత ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే మరో సినిమాను లైన్‌లో పెట్టేశాడు విజయ్‌.

జెర్సీ మూవీ డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రౌడీ హీరో సినిమాను అనౌన్స్‌ చేశాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

VD12 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం నేడు(బుధవారం) రామానాయుడు స్టూడియోస్‌లో జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement