కిస్సిక్ భామ బాలీవుడ్ ఎంట్రీ.. హీరోగా ఎవరంటే? | Tollywood Actress Sreeleela Bollywood Entry With This Hero | Sakshi
Sakshi News home page

Sreeleela: శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. హీరోగా ఎవరంటే?

Published Sun, Feb 16 2025 9:05 AM | Last Updated on Sun, Feb 16 2025 11:14 AM

Tollywood Actress Sreeleela Bollywood Entry With This Hero

పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీలీల. ఆ తర్వాత పలు సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించింది. ఇటీవల పుష్ప-2 సినిమాలో కిస్సిక్‌ సాంగ్‌తో అభిమానులను ఓ ఊపు ఊపేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. దక్షిణాదిలో ఓ ఊపు ఊపేస్తోన్న శ్రీలీలకు బాలీవుడ్‌లోనూ క్రేజీ ఛాన్ కొట్టేసింది. శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చేసింది.

బాలీవుడ్ కార్తీక్ ఆ‍ర్యన్ సరసన కనిపించనుంది ముద్దుగుమ్మ. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ టీజర్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్‌, అనురాగ్ బసు ప్రొడక్షన్‌ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ నిర్మిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement