
‘‘బాపు’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ చిత్రంపై క్యూరియాసిటీ కలిగించింది. సినిమా టాక్ బాగుంటే మన తెలుగు ఆడియన్స్ సెకండ్ డే నుంచి హౌస్‌ఫుల్ చేస్తారు. ఇది చాలా మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు. బ్రహ్మాజీ లీడ్ రోల్‌లో దయా దర్శకత్వం వహించిన చిత్రం ‘బాపు’. ఆమని, ‘బలగం’ సుధాకర్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్, ధన్యా బాలకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. రాజు, సీహెచ్ భానుప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ రేపు విడుదల కానుంది.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, చందు మొండేటి, బుచ్చిబాబు సాన, హీరో సత్యదేవ్, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘ఈ మూవీ ట్రైలర్‌లో రా ఎమోషన్ కనిపిస్తోంది’’ అన్నారు. ‘‘పెద్ద సినిమా, చిన్న సినిమా అని ఉండదు. మంచి సినిమా ఏదైనా పెద్ద చిత్రమే’’ అని చందు మొండేటి చె΄్పారు. ‘‘ఈ సినిమాని దయాగారు చాలా బాగా తీశారు’’ అన్నారు బుచ్చిబాబు సానా. ‘‘ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను’’ అని బ్రహ్మాజీ తెలిపారు. ‘‘కిస్మత్’ తర్వాత ‘బాపు’ నా రెండో సినిమా’’ అన్నారు భానుప్రసాద్ రెడ్డి. ‘‘మా సినిమాని ప్రేక్షకులు పెద్ద హిట్ చేయాలి’’ అని పేర్కొన్నారు దయా.
Comments
Please login to add a commentAdd a comment