![Baapu Movie Trailer Launch Event](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/raana.jpg.webp?itok=gBEUiNT2)
∙దయా, బ్రహ్మాజీ, రానా, తిరువీర్
రెగ్యులర్‌కి భిన్నంగా ఉండే ‘బాపు’లాంటి సినిమాలు రావడం చాలా అరుదు. ఒక సంస్కృతిని చూపించే ఇలాంటి చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకుల్లా నేను కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అని హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati ) అన్నారు. బ్రహ్మాజీ(Brahmaji) లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘బాపు’(Bapu). దయా దర్శకత్వంలో కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది.
హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బాపు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి రానా దగ్గుబాటి, నటుడు తిరువీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరువీర్ మాట్లాడుతూ– ‘‘బాపు’ ట్రైలర్‌లో మట్టివాసన కనిపించింది. దయాగారు చాలా మంచి సినిమా తీశారు’’ అన్నారు. ‘‘మన కుటుంబంలోని పాత్రలు ఈ సినిమాలో కనిపిస్తాయి.
ఈ మూవీని అందరం ్రపోత్సహిద్దాం’’ అని దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్ పేర్కొన్నారు. ‘‘బాపు’ మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఈ చిత్రానికి మంచి పేరు రావాలి’’ అన్నారు బ్రహ్మాజీ. ‘‘మా చిత్రాన్ని అందరూ థియేటర్స్‌లో చూడాలి’’ అని దయా కోరారు. ‘‘నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన సినిమా ‘బాపు’’ అన్నారు సంగీత దర్శకుడు ఆర్‌ఆర్ ధ్రువన్.
Comments
Please login to add a commentAdd a comment