
పావని, తిరువీర్, రానా
‘‘యంగ్ టీమ్ అంతా ప్రేమించి ప్యూర్ ఎనర్జీతో ‘పరేషాన్’ సినిమా తీశారు. ఈ చిత్రంలో నేనూ భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను. ఈ చిత్రం మంచి హిట్ కావాలి. అలాగే నా తమ్ముడు అభిరామ్ నటించిన ‘అహింస’ కూడా జూన్ 2న రిలీజ్ అవుతోంది. అన్ని సినిమాలు బాగా ఆడాలి’’ అని హీరో రానా దగ్గుబాటి అన్నారు. ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా, పావని కరణం హీరోయిన్‌గా రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వంలో తెర కెక్కిన చిత్రం ‘పరేషాన్’.
రానా దగ్గుబాటి సమర్పణలో వాల్తేర్ ప్రొడక్షన్స్పై విశ్వతేజ్ రాచకొండ, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా జూన్ 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను రానా దగ్గుబాటి విడుదల చేశారు. ‘‘వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది’’ అన్నారు తిరువీర్. ‘‘పరేషాన్’ అందర్నీ నవ్విస్తుంది’’ అన్నారు విశ్వతేజ్ రాచకొండ, సిద్ధార్థ్ రాళ్ళపల్లి. ‘‘కుటుంబంతో కలిసి మా సినిమాకి రండి’’ అన్నారు రూపక్ రోనాల్డ్‌సన్. ఈ కార్యక్రమంలో పావని కరణం, సంగీత దర్శకుడు యశ్వంత్ నాగ్, సినిమాటోగ్రాఫర్ వాసు, నటుడు మురళి, గీత రచయిత చంద్రమౌళి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment