pareshan movie
-
ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
ఎంటర్టైన్మెంట్ను అన్నివేళలా అందుబాటులోకి ఉంచేందుకు ఓటీటీలు ఉపయోగపడుతున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కామెడీ షోలు, రియాలిటీ షోలు.. ఇలా భిన్నరకాల కంటెంట్‌తో బోలెడంత వినోదాన్ని అందిస్తున్నాయి. అందుకే ప్రేక్షకులు థియేటర్లో రిలీజయ్యేవాటితో పాటు ఓటీటీ రిలీజెస్ మీద కూడా ఓ కన్నేస్తున్నారు. ఈ రోజు శుక్రవారం కావడంతో ఓటీటీలో కొత్త సినిమాలు ప్రత్యక్షమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్‌లో రంగబలి టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రంగబలి. పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యుక్తి తరేజ హీరోయిన్గా నటించింది. జూలై 7న థియేటర్లో విడుదలైన ఈ సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. నేటి(ఆగస్టు 4) నుంచి రంగబలి ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ ఓటీటీలో పరేషాన్ ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన చిత్రం ‘పరేషాన్’. రానా దగ్గుబాటి సమర్పణలో సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదలైంది. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. దాదాపు రెండు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 4 నుంచి ఈ చిత్రం సోనీలివ్‌లో అందుబాటులోకి వచ్చింది. దయ సిరీస్ ఎందులో అంటే? ఇకపోతే అటు దయ అనే వెబ్ సిరీస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. ఇందులో జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. పవన్ సాధినేని దర్శకత్వం వహించాడు. అలాగే భాగ్‌సాలే అనే మూవీ సైతం ఓటీటీలోకి వచ్చేసింది. ఇది అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. చదవండి: రీఎంట్రీకి రెడీ అయిన నజ్రియా -
ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్
ఎప్పటిలానే మరో వీకెండ్. ఈసారి థియేటర్లలో దాదాపు 10 వరకు చిన్న చిత్రాలు విడుదల కానున్నాయి. వీటిలో ధోనీ నిర్మించిన 'ఎల్‌జీఎమ్' తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ లేవు. దీంతో మూవీ లవర్స్ ఓటీటీల వైపు చూస్తున్నారు. వాళ్ల కోసమా అన్నట్లు ఈసారి దాదాపు 18 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కు సిద్ధమైపోయాయి. దిగువన ఉన్న ఆ జాబితానే. ఇందులో స్ట్రీమింగ్ అవుతున్నాయి అని చెప్పినవన్నీ ఈ రోజు అంటే గురువారం రిలీజ్ అయ్యాయి అని. మిగతావన్నీ శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్నాయని అర్థం. మరి ఇంకెందుకు లేటు.. ఈ వీకెండ్ ఏం చూడాలో ప్లాన్ ఫిక్స్ చేసుకోండి. వీటిలో రంగబలి, పరేషాన్ సినిమాలకు తోడు 'దయ' వెబ్ సిరీస ఆసక్తి కలిగిస్తున్నాయి (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్.. తెలుగులోనూ) ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ హాట్‌స్టార్ దయ - తెలుగు వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ద లాస్ట్ ఫ్లవర్స్ ఆఫ్ ఎలైస్ హర్ట్ - ఇంగ్లీష్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఫేటల్ సెడక్షన్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ రంగబలి - తెలుగు సినిమా ద బిగ్ నైల్డ్ ఇట్ బేకింగ్ ఛాలెంజ్ - ఇంగ్లీష్ సిరీస్ ద హంట్ ఫర్ వీరప్పన్ - హిందీ సిరీస్ చూనా - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) హెడ్ టూ హెడ్ - అరబిక్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) హార్ట్ స్టాపర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్) ద లాస్ట్ అవర్స్ ఆఫ్ మారియో బ్యూయోండో - స్పానిష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) ద లింకన్ లాయర్ సీజన్ 2: పార్ట్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్) సోనీ లివ్ ఫటాఫటీ - బెంగాలీ మూవీ పరేషాన్ - తెలుగు సినిమా బుక్ మై షో లాస్ట్ & ఫౌండ్ - ఇంగ్లీష్ చిత్రం సైలెంట్ హవర్స్ - ఇంగ్లీష్ మూవీ టూ క్యాచ్ కిల్లర్ - ఇంగ్లీష్ సినిమా ఆహా హైవే - తమిళ సినిమా సైనా ప్లే డార్క్ షేడ్స్ ఆఫ్ సీక్రెట్ - మలయాళ సినిమా (ఇదీ చదవండి: నా మనసులో ఉన్నది అతడే.. ఆల్రెడీ పెళ్లి!: రష్మిక) -
ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలివే, లిస్ట్ చూసేయండి!
జూలై నెలలో ఎక్కువగా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటిలో ఒకటీరెండు మాత్రమే సక్సెస్ రుచి చూశాయి. భారీ బడ్జెట్ సినిమాలేవీ దరిదాపుల్లో కూడా లేకపోవడంతో మరిన్ని చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అలాగే బాక్సాఫీస్ దగ్గర విడుదలైన సినిమాలు అటు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. మరి ఈ వారం అటు థియేటర్, ఇటు ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేద్దాం.. థియేటర్లో విడుదలయ్యే సినిమాలు.. ⇒ ఎల్జీఎం (తెలుగు) - ఆగస్టు 4 ⇒ కృష్ణగాడు అంటే ఒక రేంజ్ - ఆగస్టు 4 ⇒ రాజుగారి కోడిపులావ్ - ఆగస్టు 4 ⇒ విక్రమ్ రాథోడ్ - ఆగస్టు 4 ⇒ మిస్టేక్ - ఆగస్టు 4 ⇒ మెగ్ 2: రాక్షస తిమింగలం - ఆగస్టు 3 ⇒ దిల్సే - ఆగస్టు 4 ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లు హాట్‌స్టార్ ⇒ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ3 - ఆగస్టు 2 ⇒ దయా (తెలుగు సిరీస్)- ఆగస్టు 5 నెట్‌ఫ్లిక్స్ ⇒ చూనా (హిందీ వెబ్ సిరీస్) - ఆగస్టు 3 ⇒ రంగబలి - ఆగస్టు 4 ⇒ ది హంట్ ఫర్ వీరప్పన్ (డాక్యుమెంటరీ సిరీస్) - ఆగస్టు 4 సోనీ లివ్ ⇒ పరేషాన్ (తెలుగు) - ఆగస్టు ⇒ పోర్ తొడిల్ (తమిళ్) - ఆగస్టు 4 చదవండి: తమన్నా కోసం ఆ టాప్ హీరోయిన్ను టార్గెట్ చేసిన అజిత్ -
ఓటీటీలోకి ఆ చిన్న సినిమా.. మరీ ఇంత ఆలస్యమా?
సాధారణంగా ఓటీటీల్లోకి ఏ సినిమా అయినా వీలైనంత త్వరగానే వచ్చేస్తుంటాయి. భారీ బడ్జెట్ చిత్రాలైతే కాస్త ఆలస్యంగా స్ట్రీమింగ్ అవుతుంటాయి కానీ చిన్న మూవీస్ అయితే నెలలోపే స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేసుకుంటూ ఉంటాయి. రానా సమర్పణలో వచ్చిన 'పరేషాన్' మూవీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది. (ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్) స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ 'మసూద' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తిరువీర్ ఇందులో హీరోగా నటించారు. మిగతా వాళ్లందరూ చాలావరకు కొత్త నటీనటులే. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌తో వచ్చిన ఈ సినిమా జూన్ 2న థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా జనాల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో చాలామంది ఈ మూవీ గురించి మర్చిపోయారు. అలాంటి ఆగస్టు 4 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. 'పరేషాన్' కథేంటి? మంచిర్యాలలో జులాయిగా తిరిగే కుర్రాడు ఐజాక్(తిరువీర్). తన జాబ్ కోసం దాచుకున్న డబ్బుల్ని ఫ్రెండ్‌కి ఇచ్చి సహాయపడే రకం. ఓ రోజు ఊరిలో జరిగిన పెళ్లిలో శిరీష(పావని)ని చూసి లవ్‌లో పడతాడు. ఆమె కూడా ప్రేమిస్తుంది. కొన్నాళ్లకు ఇద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు. వారం తిరక్కుండానే ఆమెకు వాంతులవుతాయి. దీంతో ఇద్దరూ పరేషాన్ అవుతారు. హైదరాబాద్ వెళ్లి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుందామని అనుకుంటారు. మరి ఐజాక్-శిరీషల పరిస్థితి ఏమైంది? చివరకు ఏం జరిగిందనేదే స్టోరీ. What if your best friends turn out to be your worst nightmares? Rana Daggubati presents the quirkiest film of the year, #Pareshan streaming on Sony LIV from Aug 4th.#Pareshan #PareshanOnSonyLIV #SonyLIV @RanaDaggubati @iamThiruveeR @PavaniKaranam1 @imvishwadev @siddharthr87 pic.twitter.com/Ic8SXK3apg — Sony LIV (@SonyLIV) July 20, 2023 (ఇదీ చదవండి: మెగా ప్రిన్సెన్స్ 'క్లీంకార' ఫస్ట్ వీడియో.. చరణ్ చేతుల్లో అలా!) -
పరేషాన్‌తో అలాంటి అనుభూతి కలిగింది
‘‘కేరాఫ్ కంచరపాలెం, సినిమా బండి, బలగం..’ చిత్రాలు చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. ‘పరేషాన్’ మూవీ చూసినప్పుడు కూడా అలాంటి అనుభూతి కలిగింది. సినిమా చూస్తున్నప్పుడు మనల్ని మనం మర్చిపోతే అదే మ్యాజిక్. అలాంటి మ్యాజిక్ ‘పరేషాన్’ లో జరిగింది’’ అని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అన్నారు. తిరువీర్, పావని కరణం జంటగా రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘పరేషాన్. రానా దగ్గుబాటి సమర్పణలో సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘పరేషాన్’ సక్సెస్ మీట్‌కి ముఖ్య అతిథిగా తరుణ్ భాస్కర్ హాజరయ్యారు. ‘‘లగాన్’ లాంటి టీం కలిసి చేసిన సినిమా ఇది. గెలవాలంటే లాస్ట్ బాల్కి సిక్స్ కొట్టాలి.. రానాగారు వచ్చి మాతో సిక్స్ కొట్టించారు’’ అన్నారు తిరువీర్. ‘‘పరేషాన్’ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు పావని కరణం. ‘‘పరేషాన్’కి నైజాంలో మరో 75 థియేటర్స్ పెంచుతున్నాం’’ అన్నారు రూపక్ రోనాల్డ్సన్. -
‘పరేషాన్’ మూవీ రివ్యూ
టైటిల్: పరేషాన్ నటీనటులు: తిరువీర్, పావని కరణం, బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, మురళీధర్ గౌడ్ తదితరులు నిర్మాత : సిద్ధార్థ్ రాళ్లపల్లి సమర్పణ: రానా దగ్గుబాటి దర్శకత్వం : రూపక్ రోనాల్డ్సన్ సంగీతం: యశ్వంత్ నాగ్ సినిమాటోగ్రఫీ: వాసు పెండమ్ ఎడిటర్ : హరిశంకర్ విడుదల తేది : జూన్ 2, 2023 ‘పరేషాన్’ కథేంటంటే.. క్రైస్తవ మతానికి చెందిన సమర్పణ్(మురళీధర్ గౌడ్) ఓ సింగరేణి ఉద్యోగి. అతని కొడుకు ఐజాక్ (తిరువీర్) తిరుగుబోతు. ఐటీఐ కూడా పాసవ్వక ఊర్లో ఆవారాగా తిరుగుతుంటాడు. కొడుకును దారిలో పెట్టేందుకు తన ఉద్యోగాన్ని అతనికి అప్పజెప్పాలనుకుంటాడు. దాని కోసం పై అధికారికి రెండు లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాల్సి వస్తోంది. భార్య చేతిపై ఉన్న బంగారు గాజులు అమ్మి రెండు లక్షలను జమ చేస్తాడు. ఆ డబ్బును మధ్యవర్తికి అప్పజెప్పి రమ్మని ఐజాక్ని పంపిస్తే.. అందులో కొత ఆపదలో ఉన్న తన స్నేహితుడు పాషా(బన్నీ అభిరామ్)కు ఇస్తాడు. మిగిలిన డబ్బు మరో స్నేహితుడు ఆగమ్ సత్తి(అర్జున్ కృష్ణ)కు ఇస్తాడు. తన తండ్రికి తెలియకముందే ఆ డబ్బును మధ్యవర్తికి ఇవ్వాలని ఐజాక్ తీవ్రంగా ప్రయత్నిస్తాడు. మరోవైపు ఐజాక్ ప్రేయసి శిరీష(పావని కరణం)తో శారీరకంగా దగ్గర అవుతాడు. ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చిందనే భయంతో పట్నం వెళ్లి పరీక్షలు చేయించాలకుంటాడు. డబ్బులు జమ చేస్కోని ఫ్రెండ్ పెళ్లికి వెళ్తే.. డబ్బులు కొట్టేస్తారు. అసలు ఆ డబ్బు ఎవరు కొట్టేశారు? లంచం కోసం ఇచ్చిన డబ్బుని కొడుకు తన స్నేహితులకు ఇచ్చాడని తెలిశాక సమర్పణ్ రియాక్షన్ ఏంటి? స్నేహితులకు ఇచ్చిన డబ్బులు రాక, అదే సమయంలో ప్రేయసి ప్రెగ్నెన్సీ టెన్షన్.. వీటిని ఐజాక్ ఎలా డీల్ చేశాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఈ మధ్య కాలంలో సినిమాల్లో తెలంగాణ యాస, కల్చర్‌ని ఎక్కువగా కనిపిస్తోంది. ఆ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. పరేషాన్ మూవీ కూడా ఆ కోవలోకే వస్తుంది. మంచిర్యాలకు చెందిన ఐదుగురు సింగరేణి పోరగాళ్ల కథ ఇది. తెలంగాణ నేటివీటీతో చాలా సహజంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు రూపక్ రొనాల్డ్సన్. సినిమా టైటిల్స్ నుంచి ఎండింగ్ వరకు ప్రతీది తెలంగాణ యాస, భాషని బేస్ చేసుకొని చాలా వినోదాత్మకంగా తెరకెక్కించారు. అయితే కథలో మాత్రం కొత్తదనం లేదు. పనీపాట లేకుండా ఆవారాగా తిరిగే కొడుకు, తిట్టే తండ్రి, ఓ లవ్‌స్టోరి, చివర్లో హ్యాపీ ఎండింగ్.. ఈ తరహా నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే పరేషాన్ కూడా అలాంటి కథే.కానీ తెలంగాణ నేటివిటీని జోడించి చాలా వినోదాత్మకంగా చూపించారు. క్రైస్తవ మత ప్రార్థనలతో వినోదాత్మకంగా సినిమా ప్రారంభం అవుతుంది. ఐజాక్ స్నేహితుల నేపథ్యం, పాషా చేసే ఓ పనికి పోలీసు స్టేషన్‌దాకా అందరు వెళ్లడం, అక్కడ జరిగే కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇక స్నేహితులకు డబ్బులు ఇచ్చాక ఐజాక్ పడే పరేషాన్.. శిరీషతో ప్రేమాయణంతో ఫస్టాఫ్ కామెడీగా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ పర్వాలేదు. ఇక సెకండాఫ్‌లో కథ సింపుల్‌గా, ఎలాంటి ట్విస్టులు లేకుండా సాగుతుంది. సత్తి కోసం వెతికే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. తాగుడుకు సంబంధించిన సీన్స్ ప్రతిసారి చూపించడం ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇక సత్తి వేలు తెగిన సీన్, ఐజాక్ బ్యాండ్ డ్రెస్ సీన్ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తాయి. ఎమోషనల్ సీన్స్ అంతగా వర్కౌట్ కాలేదు. ప్యూర్ తెలంగాణ నెటివిటీ, యాస కారణంగా తెలంగాణేతర ప్రేక్షకులను ఈ సినిమా అంతగా అలరించకపోవచ్చు. కానీ ఎలాంటి అంచానాలు లేకుండా థియేటర్స్‌కు వస్తే మాత్రం ‘పరేషాన్’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. తిరువీర్ మంచి నటుడు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతుంటాడు. పరేషాన్లో కూడా అంతే. ఐజాక్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. శిరీష పాత్రలో పావని కరణం చక్కగా నటించింది. ఆగమ్ సత్తిగా అర్జున్ కృష్ణ కొన్ని సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. ఐజాక్ స్నేహితులు ఆర్జీవీగా రవి, మైదాన్గా, పాషాగా బన్ని అభిరామ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. యశ్వంత్ నాగ్ సంగీతం బాగుంది. సౌ సారా, ముసి ముసి నవ్వుల మంజుల పాటలు అలరిస్తాయి. నేపథ్య సంగీతం కూడా సినిమా స్థాయిని పెంచింది. వాసు పెండమ్ సినిమాటోగ్రఫి బాగుంది. తెలంగాణ పల్లె అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
సింగరేణి పోరగాళ్ల కథే ‘పరేషాన్’: తిరువీర్
‘సింగరేణి పోరగాళ్ల కథే ‘పరేషాన్’. మంచిర్యాల ఊరుని ఒక బయోపిక్‌లా తీస్తే మా సినిమా అవుతుంది. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో సహజమైన వినోదం ఉంటుంది’’ అని హీరో తిరువీర్ అన్నారు. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వంలో ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన చిత్రం ‘పరేషాన్’. రానా దగ్గుబాటి సమర్పణలో సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. (చదవండి: త్వరలో భోళా మానియా) ఈ సందర్భంగా తిరువీర్ మాట్లాడుతూ– ‘‘నేను ఎలాంటి సినిమాలు చేయాలనుకున్నానో అనుకోకుండా ఘాజీ, మల్లేశం, పలాస.. అలాంటివే కుదిరాయి. ‘మసూద’ తర్వాత ఒక స్వేచ్ఛ దొరకడంతో ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాను. ఎలాగైనా ‘పరేషాన్’ని జనాల్లోకి తీసుకెళ్దామని రానాగారు ముందుకు రావడంతో మా సినిమాకి బలం వచ్చింది. ప్రస్తుతం శివం సెల్యులాయిడ్ నిర్మాణంలో ఓ సినిమా, ‘బటర్ ఫ్లై’ ఫేం సతీష్‌గారితో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
పరేషాన్ హిట్ కావాలి
‘‘యంగ్ టీమ్ అంతా ప్రేమించి ప్యూర్ ఎనర్జీతో ‘పరేషాన్’ సినిమా తీశారు. ఈ చిత్రంలో నేనూ భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను. ఈ చిత్రం మంచి హిట్ కావాలి. అలాగే నా తమ్ముడు అభిరామ్ నటించిన ‘అహింస’ కూడా జూన్ 2న రిలీజ్ అవుతోంది. అన్ని సినిమాలు బాగా ఆడాలి’’ అని హీరో రానా దగ్గుబాటి అన్నారు. ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా, పావని కరణం హీరోయిన్గా రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వంలో తెర కెక్కిన చిత్రం ‘పరేషాన్’. రానా దగ్గుబాటి సమర్పణలో వాల్తేర్ ప్రొడక్షన్స్‌పై విశ్వతేజ్ రాచకొండ, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా జూన్ 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను రానా దగ్గుబాటి విడుదల చేశారు. ‘‘వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది’’ అన్నారు తిరువీర్. ‘‘పరేషాన్’ అందర్నీ నవ్విస్తుంది’’ అన్నారు విశ్వతేజ్ రాచకొండ, సిద్ధార్థ్ రాళ్ళపల్లి. ‘‘కుటుంబంతో కలిసి మా సినిమాకి రండి’’ అన్నారు రూపక్ రోనాల్డ్సన్. ఈ కార్యక్రమంలో పావని కరణం, సంగీత దర్శకుడు యశ్వంత్ నాగ్, సినిమాటోగ్రాఫర్ వాసు, నటుడు మురళి, గీత రచయిత చంద్రమౌళి పాల్గొన్నారు. -
రానాకు గంగవ్వ కల్లు దావత్.. ‘పరేషాన్’ చేసిన దగ్గుబాటి హీరో!
అచ్చమైన తెలంగాణ పల్లె మాటలతో ఆరుపదుల వయసులోనూ యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది గంగవ్వ. మై విలేజ్ షో అనే యూట్యూబ్ చానల్ ద్వారా అందరికి పరిచమైన గంగవ్వ.. బిగ్‌బాస్ 4 ద్వారా మరింత ఫేమస్ అయింది. ఇస్మార్ట్ శంకర్, లవ్‌స్టోరీతో పాటు పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం పలు సినిమాల ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫుల్ బిజీ అయింది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ కోసం విలేజ్‌కి వెళ్లిన రానాకు కల్లు తాగించి మరోసారి వార్తల్లో నిలిచింది గంగవ్వ. (చదవండి: బికినీలో అనసూయ రచ్చ...స్విమ్మింగ్ ఫూల్ పిక్స్ వైరల్) రానా సమర్పణలో ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన చిత్రం ‘పరేషాన్’. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించారు. వాల్తేర్ ప్రొడక్షన్స్‌పై సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమాని జూన్ 2న విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మై విలేజ్ షో టీమ్‌తో కలిసి సందడి చేశాడు రానా. (చదవండి: వెన్నెల కిషోర్ ఇంట్లో కుప్పలుగా రెండువేల నోట్ల కట్టలు.. ఫోటో వైరల్) పరేషాన్ టీమ్‌తో కలిసి గంగవ్వ ఉండే ఊరికి వెళ్లాడు. పల్లెటూరు వాతావరణం లోకి అడుగుపెట్టిన రానా కి గంగవ్వ తాటి కల్లు తాగిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by My Village Show (@myvillageshow)