Gangavva Gives Thati Kallu Party To Rana Daggubati - Sakshi
Sakshi News home page

రానాకు గంగవ్వ కల్లు దావత్‌..  ‘పరేషాన్‌’ చేసిన దగ్గుబాటి హీరో!

May 21 2023 12:46 PM | Updated on May 21 2023 1:01 PM

Gangavva Gives Thati Kallu Party To Rana Daggubati - Sakshi

అచ్చమైన తెలంగాణ పల్లె మాటలతో ఆరుపదుల వయసులోనూ యూట్యూబ్‌ని షేక్‌ చేస్తుంది గంగవ్వ.  మై విలేజ్‌ షో అనే యూట్యూబ్‌ చానల్‌ ద్వారా అందరికి పరిచమైన గంగవ్వ.. బిగ్‌బాస్‌ 4 ద్వారా మరింత ఫేమస్‌ అయింది. ఇస్మార్ట్‌ శంకర్‌, లవ్‌స్టోరీతో పాటు పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం పలు సినిమాల ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫుల్‌ బిజీ అయింది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్‌ కోసం విలేజ్‌కి వెళ్లిన రానాకు కల్లు తాగించి మరోసారి వార్తల్లో నిలిచింది గంగవ్వ. 

(చదవండి: బికినీలో అనసూయ రచ్చ...స్విమ్మింగ్‌ ఫూల్‌ పిక్స్‌ వైరల్‌)

రానా సమర్పణలో ‘మసూద’ ఫేమ్‌ తిరువీర్‌ హీరోగా నటించిన చిత్రం ‘పరేషాన్‌’. రూపక్‌ రోనాల్డ్‌సన్‌ దర్శకత్వం వహించారు. వాల్తేర్‌ ప్రొడక్షన్స్‌పై సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమాని జూన్‌ 2న విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మై విలేజ్‌ షో టీమ్‌తో కలిసి సందడి చేశాడు రానా.

(చదవండి: వెన్నెల కిషోర్‌ ఇంట్లో కుప్పలుగా రెండువేల నోట్ల కట్టలు.. ఫోటో వైరల్‌)

పరేషాన్‌ టీమ్‌తో కలిసి గంగవ్వ ఉండే ఊరికి వెళ్లాడు. పల్లెటూరు వాతావరణం లోకి అడుగుపెట్టిన రానా కి గంగవ్వ తాటి కల్లు తాగిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement