తిరువీర్, తరుణ్ భాస్కర్, రూపక్ రోనాల్డ్, పావని
‘‘కేరాఫ్ కంచరపాలెం, సినిమా బండి, బలగం..’ చిత్రాలు చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. ‘పరేషాన్’ మూవీ చూసినప్పుడు కూడా అలాంటి అనుభూతి కలిగింది. సినిమా చూస్తున్నప్పుడు మనల్ని మనం మర్చిపోతే అదే మ్యాజిక్. అలాంటి మ్యాజిక్ ‘పరేషాన్’ లో జరిగింది’’ అని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అన్నారు. తిరువీర్, పావని కరణం జంటగా రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘పరేషాన్. రానా దగ్గుబాటి సమర్పణలో సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదలైంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ‘పరేషాన్’ సక్సెస్ మీట్‌కి ముఖ్య అతిథిగా తరుణ్ భాస్కర్ హాజరయ్యారు. ‘‘లగాన్’ లాంటి టీం కలిసి చేసిన సినిమా ఇది. గెలవాలంటే లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టాలి.. రానాగారు వచ్చి మాతో సిక్స్ కొట్టించారు’’ అన్నారు తిరువీర్. ‘‘పరేషాన్’ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు పావని కరణం. ‘‘పరేషాన్’కి నైజాంలో మరో 75 థియేటర్స్ పెంచుతున్నాం’’ అన్నారు రూపక్ రోనాల్డ్‌సన్.
Comments
Please login to add a commentAdd a comment