Director Tarun Bhaskar
-
పరేషాన్‌తో అలాంటి అనుభూతి కలిగింది
‘‘కేరాఫ్ కంచరపాలెం, సినిమా బండి, బలగం..’ చిత్రాలు చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. ‘పరేషాన్’ మూవీ చూసినప్పుడు కూడా అలాంటి అనుభూతి కలిగింది. సినిమా చూస్తున్నప్పుడు మనల్ని మనం మర్చిపోతే అదే మ్యాజిక్. అలాంటి మ్యాజిక్ ‘పరేషాన్’ లో జరిగింది’’ అని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అన్నారు. తిరువీర్, పావని కరణం జంటగా రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘పరేషాన్. రానా దగ్గుబాటి సమర్పణలో సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘పరేషాన్’ సక్సెస్ మీట్‌కి ముఖ్య అతిథిగా తరుణ్ భాస్కర్ హాజరయ్యారు. ‘‘లగాన్’ లాంటి టీం కలిసి చేసిన సినిమా ఇది. గెలవాలంటే లాస్ట్ బాల్కి సిక్స్ కొట్టాలి.. రానాగారు వచ్చి మాతో సిక్స్ కొట్టించారు’’ అన్నారు తిరువీర్. ‘‘పరేషాన్’ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు పావని కరణం. ‘‘పరేషాన్’కి నైజాంలో మరో 75 థియేటర్స్ పెంచుతున్నాం’’ అన్నారు రూపక్ రోనాల్డ్సన్. -
మూడో సినిమా ఇబ్బంది పెట్టింది
‘పెళ్ళి చూపులు’ సినిమాతో పరిశ్రమ దృష్టి మొత్తం తన వైపునకు తిప్పుకున్నారు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఈ సినిమా తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి దర్శకత్వం వహించారాయన. ఆ తర్వాత ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో నటుడిగా మారారు. కాగా తరుణ్ భాస్కర్ తర్వాతి సినిమా వెంకటేశ్‌తో ఉంటుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తరుణ్ కొత్త ప్రాజెక్ట్ క్రైమ్ డ్రామాగా ఉంటుందట. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘నా 3వ సినిమా నన్ను చాలా ఇబ్బందుల్లో పెట్టింది. రెండు పెద్ద ప్రాజెక్ట్‌లు చేసే అవకాశం వచ్చింది.. వీటిలో ఒకదాన్ని ఎంచుకోవడం చాలా కష్టమైంది. బాగా ఆలోచించిన తర్వాత క్రైమ్ డ్రామాతో సినిమా తెరకెక్కిద్దాం అని నిర్ణయించుకున్నాను. ఈ సినిమాలో ఓ ప్రముఖ స్టార్ హీరో నటించనున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది. ఈ సినిమా ప్రేక్షకుల్ని అస్సలు నిరుత్సాహపరచదు’’ అన్నారు. -
'పెళ్లిచూపులు' తప్పక చూడాలి: కేటీఆర్
చిన్నగా థియేటర్లకు వచ్చి పెద్ద హిట్ అయిన 'పెళ్లిచూపులు' తప్పక చూడాల్సిన సినిమా అంటూ ఐటీ మంత్రి కేటీఆర్ కితాబునిచ్చారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను, చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు. 'పెళ్లిచూపులు' టీంతో కలిసి సినిమాను చూసిన ఆయన ఇది సందేశాత్మక చిత్రమంటూ ప్రశంసల జల్లు కురిపించారు. మహిళా సాధికారత, యువత అభిరుచులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం వంటి అంశాలతో సందేశాత్మకంగా ఉందని కేటీఆర్ తెలిపారు. యువతకు ఉపయోగపడే చాలా విషయాలను సున్నితంగా చూపించారన్నారు. నిర్మాత సురేష్ బాబు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. కాగా మంత్రి అభినందనల పట్ల చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. మంచి కంటెంట్‌కు ప్రేక్షకాదరణ తప్పక ఉంటుందని 'పెళ్లిచూపులు' మరోసారి నిరూపించింది. ఇప్పటికే భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమా త్వరలో మిలియన్ మార్క్ చేరనుంది. ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించిన విజయ్ దేవరకొండ, రీతూ వర్మలు చేతి నిండా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. Watched an exceptionally well made movie 'Pellichoopulu' which breaks new ground on many counts. Kudos to Tarun & entire team. Must watch — KTR (@KTRTRS) 16 August 2016 'Pellichoopulu' breaks new ground without being preachy; unconventional professions, women empowerment, entrepreneurial spirit & much more — KTR (@KTRTRS) 16 August 2016 -
అతని కమిట్మెంట్ నచ్చింది : నిర్మాత సురేశ్‌బాబు
‘‘దర్శకుడు తరుణ్ భాస్కర్ అండ్ టీం పక్కాగా కథ తయారు చేసుకుని ప్లానింగ్‌గా వెళ్లడంతో ‘పెళ్లి చూపులు’ వంటి మంచి అవుట్‌పుట్ వచ్చింది. ఈ చిత్రం నాకు నచ్చడంతో రిలీజ్లో నేను కూడా భాగస్వామినయ్యా. తరుణ్ గతంలో నన్ను కలిసినప్పుడు నేనో చిత్రం చేయమంటే తను మాత్రం ఈ చిత్రానికే ఫిక్స్ అయిపోయి నా సినిమా చేయనన్నాడు. తన కమిట్మెంట్ నచ్చింది. త్వరలో తనతో మా బ్యానర్లో ఓ సినిమా చేస్తా’’ అని నిర్మాత డి.సురేశ్‌బాబు అన్నారు. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, యష్ రాగినేని నిర్మించిన ‘పెళ్లి చూపులు’ ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రాన్ని అనుకున్న బడ్జెట్లో తెరకెక్కించేందుకు ప్లానింగ్‌తో ముందుకెళ్లాం. ప్రొడక్షన్ మైండ్ అనే సాఫ్ట్వేర్ ఉపయోగించడంతో ఎక్కడా ఇబ్బందులు రాలేదు. ఈ చిత్రాన్ని నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఇచ్చే బహుమతిగా భావిస్తున్నా’’ అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ఆరు నుంచి అరవై ఏళ్ల వ యసు వారందరూ చూడదగ్గ చిత్రమిది. గతంలో షార్ట్ ఫిల్మ్స్ చేసిన తరుణ్ భాస్కర్ ఈ చిత్రాన్ని చక్కగా తీశాడు. వివేక్ స్వరపరచిన పాటలు ఈ చిత్రానికి హైలెట్’’ అని పేర్కొన్నారు. విజయ్, రీతూవర్మ, దర్శకుడు ‘మధుర’ శ్రీధర్, నటుడు నందు తదితరులు పాల్గొన్నారు.