మూడో సినిమా ఇబ్బంది పెట్టింది | Victory Venkatesh next movie with director Tarun Bhaskar | Sakshi
Sakshi News home page

మూడో సినిమా ఇబ్బంది పెట్టింది

Nov 23 2020 1:03 AM | Updated on Nov 23 2020 1:03 AM

Victory Venkatesh next movie with director Tarun Bhaskar - Sakshi

‘పెళ్ళి చూపులు’ సినిమాతో పరిశ్రమ దృష్టి మొత్తం తన వైపునకు తిప్పుకున్నారు దర్శకుడు తరుణ్‌  భాస్కర్‌. ఈ సినిమా తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి దర్శకత్వం వహించారాయన. ఆ తర్వాత ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో నటుడిగా మారారు. కాగా తరుణ్‌ భాస్కర్‌ తర్వాతి సినిమా వెంకటేశ్‌తో ఉంటుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తరుణ్‌ కొత్త ప్రాజెక్ట్‌ క్రైమ్‌ డ్రామాగా ఉంటుందట.

ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘నా 3వ సినిమా నన్ను చాలా ఇబ్బందుల్లో పెట్టింది. రెండు పెద్ద ప్రాజెక్ట్‌లు చేసే అవకాశం వచ్చింది.. వీటిలో ఒకదాన్ని ఎంచుకోవడం చాలా కష్టమైంది. బాగా ఆలోచించిన తర్వాత క్రైమ్‌ డ్రామాతో సినిమా తెరకెక్కిద్దాం అని నిర్ణయించుకున్నాను. ఈ సినిమాలో ఓ ప్రముఖ స్టార్‌ హీరో నటించనున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది. ఈ సినిమా ప్రేక్షకుల్ని అస్సలు నిరుత్సాహపరచదు’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement