next movie
-
బాలీవుడ్ ఖాన్స్ రెమ్యునరేషన్ కలిపినా ప్రభాస్ రెమ్యునరేషన్ కి సరిపోదు
-
త్వరలో సెట్లోకి...
సినిమా సెట్లో అడుగుపెట్టి మునుపటి ఉత్సాహంతో చిత్రీకరణలో పాల్గొనడానికి సమంత రెడీ అవుతున్నట్లు సమాచారం. అనారోగ్య సమస్యల కారణంగా కొంత కాలంగా ఆమె చిత్రీకరణలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కాగా వచ్చే నెల నుంచి సమంత మూవీ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారని టాక్. అంతేకాదు... తన భవిష్యత్ సినిమాల్లోని రోల్స్‌కు సంబంధించి ప్రత్యేక శిక్షణతో ప్రస్తుతం ఆమె బిజీగా ఉన్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం.కాగా ఈ ఏడాది ఏప్రిల్ 28న తన బర్త్ డే సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ సినిమాను ప్రకటించారు సమంత. ఈ సినిమాలోని మెయిన్ లీడ్ రోల్లో నటించి, నిర్మించనున్నారు. అలాగే తమిళ హీరో విజయ్‌తో ఓ సినిమా, ఓ హిందీ సినిమాలో కూడా సమంత హీరోయిన్గా నటించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి... సమంత ఏ సినిమా సెట్స్‌లో ముందుగా అడుగుపెడతారు? ప్రస్తుతం ఏ సినిమాలోని పాత్ర కోసం శిక్షణ తీసుకుంటున్నారనేది తెలియాల్సి ఉంది. ఇక సమంత నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. -
నయా కాంబినేషన్
రజనీకాంత్ ఇప్పటివరకూ దక్షిణ, ఉత్తరాది, హాలీవుడ్ మూవీ (బ్లడ్ స్టోన్) కలుపుకుని దాదాపు 170 చిత్రాల్లో నటించారు. ఇన్ని సినిమాలు చేసిన ఆయన గత కొన్నేళ్లుగా హిందీ నిర్మాతలతో సినిమాలు చేసింది లేదు. ఇప్పుడు అగ్రనిర్మాత సాజిద్ నడియాడ్‌వాలాతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిందీలో ‘హౌస్‌ఫుల్ సిరీస్, 2 స్టేట్స్, హీరో పంతి, కిక్, సూపర్ 30, ఛిచోరే, 83’ తదితర చిత్రాలతో పాటు రీసెంట్ హిట్ ‘సత్య ప్రేమ్ కీ కథ’ చిత్రం నిర్మించారు సాజిద్ నడియాడ్వాలా. ‘హౌస్‌ఫుల్, హౌస్‌ఫుల్ 2, కిక్’ వంటి చిత్రాలకు దర్శకుడు కూడా. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్–సాజిద్ల నయా కాంబినేషన్ సెట్ అయింది. ‘‘ఒక లెజండరీ నటుడితో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను’’ అని సామాజిక మాధ్యమాల ద్వారా పేర్కొన్నారు సాజిద్. కాగా ఇది హిందీ చిత్రమా లేక పాన్ ఇండియన్ ప్రాజెక్టా? ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? వంటి విషయాలను సాజిద్ స్పష్టం చేయలేదు. -
వేసవిలో 171 షురూ
బ్రేక్ తీసుకునేది లేదు అన్నట్లు రజనీకాంత్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ‘జైలర్’ ఇటీవల విడుదలై, బంపర్ హిట్ సాధించింది. ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తన 170వ సినిమా చేస్తున్నారు రజనీ. ఇప్పటికే తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ‘లాల్ సలాం’ చిత్రంలో కీ రోల్ చిత్రీకరణ పూర్తి చేశారు. ఇక 170వ సినిమా పూర్తయిన వెంటనే 171వ సినిమాతో బిజీ అవుతారు రజనీ. ఈ చిత్రదర్శకుడు లోకేశ్ కనగరాజ్ వెల్లడించిన ప్లాన్ ప్రకారం వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభమవుతుంది. ఏప్రిల్‌లో చిత్రీకరణ ఆరంభించేలా లోకేశ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ హీరోగా లోకేశ్ దర్శకత్వం వహించిన ‘లియో’ ఈ నెల 19న రిలీజ్ కానుంది. కొన్ని నెలలుగా ‘లియో’తో బిజీగా గడిపిన లోకేశ్ ఈ చిత్రం విడుదల తర్వాత చిన్న గ్యాప్ తీసుకుని, రజనీ 171వ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఆరంభిస్తారట. నిజానికి ఈ చిత్రకథను తాను దర్శకత్వం వహించిన ‘మానగరం’ (2017)కి ముందే రాశారట. ఒక ఫ్రెండ్ కోసం రాసిన ఈ కథను రజనీకాంత్‌కి వినిపించగా ఆయనకు నచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల్లో కొన్నింటిని ‘ఐమ్యాక్స్ కెమెరా’తో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నామని లోకేశ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒక్క ట్వీట్‌తో గుడ్‌బై చెప్పాలనుకున్నా! ‘‘దర్శకుడిగా చిత్ర పరిశ్రమలో ఎక్కువ కాలం ఉండాలనుకోవడం లేదు.. కెరీర్ పరంగా గర్వపడే స్థాయిలో ఉన్నప్పుడు ఒక్క ట్వీట్‌తో దర్శకత్వానికి గుడ్‌బై అని అనౌ¯Œ ్స చేయాలనుకున్నా’’ అన్నారు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. దర్శకుడిగా త్వరగా రిటైర్మెంట్ తీసుకుంటా అని గతంలో ఓసారి చెప్పిన లోకేశ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలోనూ ఇదే విషయంపై స్పందించారు. ‘‘సినిమా ఇండస్ట్రీలో నేను ఎక్కువ కాలం ఉండాలనుకోలేదు. 10 మంచి సినిమాలు చేసి వీలైనంత త్వరగా రిటైర్ అవ్వాలనుకున్నాను. కెరీర్ పరంగా గర్వపడే స్థాయిలో ఉన్నప్పుడు ఒక్క ట్వీట్‌తో గుడ్‌బై అని అనౌన్స్ చేయాలనుకున్నాను. ఆ తర్వాత ఎన్నో ప్రదేశాలకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నాను. అయితే, ఇటీవల ఓ వేడుకలో దర్శకులందరం కలిశాం. రిటైర్మెంట్ ప్రయత్నాలను విరమించుకోవాలని వాళ్లు సూచించారు.. వాళ్ల మాటలపై ఉన్న గౌరవంతో రిటైర్మెంట్ గురించి ఇప్పుడే మాట్లాడాలనుకోవడం లేదు’’ అన్నారు. -
హీరోయిన్ స్నేహకు గోల్డెన్ ఛాన్స్.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ..!
నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లియో షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తదుపరి తన 68వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో విజయ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో తొలిరోజే గొడవ? నామినేషన్లలో ఉన్నది వీళ్లే!) కాగా ఇందులో కొడుకు పాత్రకు జంటగా నటి ప్రియాంక మోహన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇకపోతే తండ్రిగా నటించనున్న విజయ్ సరసన నటించే హీరోయిన్ గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ పాత్రకు ముందుగా నటి జ్యోతిక నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత కారణాలు ఏమైనా ఆమె నటించడం లేదని తెలిసింది. ఆ తరువాత నటి సిమ్రాన్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు ప్రచారం జరిగింది. తాజాగా నటి స్నేహ పేరు వెలుగులోకి వచ్చింది. ఆమెతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా 20 ఏళ్ల క్రితం విజయ్ సరసన స్నేహ వశీకర చిత్రంలో నటించారు. మళ్లీ ఇప్పుడు విజయ్‌తో జత కట్టే అవకాశం వచ్చింది. మరి మరోసారి విజయ్‌తో జత కట్టడానికి సై అంటారా? లేదా? అన్నది చూడాలి. కాగా విజయ్ 68వ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు లండన్‌లో జరుగుతున్నాయి. అవి ముగియగానే చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం. -
నాగార్జున నెక్ట్స్ సినిమా ప్రకటన ఎప్పుడంటే..
‘ది ఘోస్ట్’ చిత్రం విడుదల తర్వాత నాగార్జున నెక్ట్స్ సినిమా గురించిన ప్రకటన రాని విషయం తెలిసిందే. అయితే ఆ సమయం ఆసన్నమైందని, ఈ నెల 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమా ప్రకటన అధికారికంగా వెల్లడి కానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారని, వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారని టాక్. శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నారని తెలిసింది. -
‘ఏజెంట్’ తర్వాత అఖిల్ టార్గెట్ ఏంటి..?
‘ఏజెంట్’ తర్వాత అఖిల్ కొత్త సినిమా గురించిన అధికారిక ప్రకటన ఇంకా వెల్లడి కాలేదు. అయితే అనిల్ అనే ఓ కొత్త దర్శకుడితో అఖిల్ సినిమా చేయనున్నారని, ఈ సినిమాకు ‘ధీర’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని ప్రచారం జరిగింది. తాజాగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో అఖిల్ ఓ సినిమా చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. శ్రీకాంత్ ఓ కథను రెడీ చేసి, అఖిల్‌కు వినిపించారట. ఈ స్క్రిప్ట్ అఖిల్‌కి నచ్చిందని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అఖిల్ – శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లోని సినిమా ఉంటుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ‘పెద కాపు 1’ ఈ నెలలోనే విడుదల కానుంది. ఒకవేళ అఖిల్‌తో సినిమా కన్ఫార్మ్ అయితే.. ‘పెద కాపు 1’ విడుదల తర్వాత ప్రకటన వస్తుందేమో? -
వరలక్ష్మి వెంటబడుతున్న తెలుగు డైరెక్టర్
తెలుగు సినీ పరిశ్రమలో పవర్ఫుల్ లేడీ విలన్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు 'రమ్యకృష్ణ'. నరసింహా, నీలాంబరి చిత్రాల్లో హీరోకు సమానంగా ఆమె నటించిన తీరు అందరినీ మెప్పిస్తుంది. ఇప్పుడు జనరేషన్ మారింది. ఇప్పుడా ప్లేస్‌లోకి వరలక్ష్మి శరత్‌కుమార్ వచ్చేసిందని చాలామంది నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తుంటారు. అంతలా ఆమె తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. వరలక్ష్మికి తెలుగులో స్టార్ ఇమేజ్ అందించిన చిత్రం ‘క్రాక్’ . గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో జయమ్మగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఆ పాత్రలో ఆమె పలికించిన హావభావాలు తెలుగువారిని మెప్పించాయి. ముఖ్యంగా ఆమె బేస్ వాయిస్ ఈ పాత్రకు హైలైట్‌గా నిలిచింది. తరువాత ఇదే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన 'వీర సింహారెడ్డి' సినిమా తనకు మరింత పేరును తీసకువచ్చింది. ఇదే ఏడాదిలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాతో వరలక్ష్మికి తెలుగులో మరో హిట్ అందుకుంది. ఇందులో ఆమె 'భానుమతి' పాత్రలో బాలయ్యకు సోదరిగా నటించి మరింత స్టార్ ఇమేజ్ను పెంచుకుంది. సీమ యాసలో ఆమె చెప్పే పవర్ఫుల్ డైలాగ్‌లు సినీ ప్రియులను కట్టిపడేశాయి. ఈసినిమా విడుదలయ్యాకనే ఆమె నటన చూసే టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో లేడీ విలన్ వచ్చేసిందంటూ అప్పట్లో వరుస కామెంట్స్ కూడా చేశారు. వరలక్ష్మికి మరో ఛాన్స్ వరసు విజయాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న డైరెక్టర్ గోపీచంద్ మళ్లీ రవితేజతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన క్రాక్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించింది. దీంతో మళ్లీ మరో ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇందులో కూడా తన లక్కీ ఛార్మ్ అయిన వరలక్ష్మి కోసం ప్రత్యేక రోల్‌ను ఆయన క్రియేట్ చేస్తున్నాడట. ఈ సినిమా కోసం హీరోయిన్ ఎంపిక చేయడం కంటే ముందు వరలక్ష్మి ఎంపిక జరిగిపోయిందట. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమెను గోపీచంద్ ఇప్పటికే సంప్రదించాడని టాక్. ఇలా తన సినిమాలో జయమ్మ ఉంటే అది సూపర్ హిట్ ఖాయం అని ఆయన భావిస్తున్నారట. -
నాలుగోసారి...
హీరో అల్లు అర్జున్ , దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో నాలుగో సినిమా తెర కెక్కనుంది. ‘జులాయి’ (2012), ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (2015), ‘అల..వైకుంఠపురములో..’ (2020) చిత్రాల తర్వాత అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న కొత్త సినిమా ప్రకటన వెల్లడైంది. పద్మశ్రీ అల్లు రామలింగయ్య–మమత సమర్పణలో హారిక–హాసినీ క్రియేషన్్స, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. సోమవారం గురుపూర్ణిమ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రక టించారు. ‘ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను అలరించడానికి అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ సినిమాకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. కాగా ఈ సినిమా సోషియో ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్లో ఉంటుందని టాక్. -
8 సినిమాలు లైన్లో ఉన్నాయి ఏహీరో తో డైరెక్షన్ చేస్తానుఅంటే..!
-
కొత్త సినిమా కోసం కంప్లీట్ లుక్ మార్చేసిన శర్వానంద్
ప్రామిసింగ్ హీరో శర్వానంద్ వైవిధ్యమైన సినిమాలతో ముందుకు వెళ్తున్నారు. చివరగా ఒకే ఒక జీవితం సినిమాలో నటించిన శర్వానంద్ తాజాగా తన 35వ సినిమాను అనౌన్స్ చేశాడు.టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం బాగా కష్టపడుతున్న శర్వానంద్ ఇందులో సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మలయాళ కంపోజర్ హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. Thank you all for the birthday wishes ❤️ Will keep trying my best to entertain you all with quality films 🤗 #Sharwa35 pic.twitter.com/NVGlpc5PVU — Sharwanand (@ImSharwanand) March 6, 2023 -
ఆ యుంగ్ డైరెక్టర్ స్టోరీకి చిరు ఫిదా
-
డైరెక్టర్‌కు ఆ కండిషన్ పెట్టిన అజిత్
నటుడు అజిత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం తుణివు మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన తర్వాత చిత్రానికి సిద్ధమవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముందుగా నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆయన చిత్రం నుంచి తొలగించారు. ఆయన కథను పూర్తిగా సిద్ధం చేసుకోకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. కాగా ఇప్పుడు ఆయన స్థానంలోకి దర్శకుడు మగిళ్ తిరుమేణి వచ్చారు. నిజం చెప్పాలంటే ఈయన పేరును కూడా చిత్ర వర్గాలు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. కాగా అజిత్ నటించే నూతన చిత్రం షూటింగును మార్చి మొదటి లేదా రెండవ వారంలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తాజా సమాచారం. ఇందులో అజిత్ జంటగా నటించే నటి ఎవరనేది కూడా ఇంకా ప్రకటించలేదు. అయితే ఇందులో ప్రతి నాయకుడిగా అరుణ్ విజయ్, ముఖ్యపాత్రల్లో అధర్వ, బిగ్ బాస్ కవిన్, జాన్ కెక్కెన్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా దీనికి అనిరుధ్ సంగీతాన్ని, నీరవ్ షా చాయాగ్రహణం అందించనున్నారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్ర షూటింగ్‌ను మూడు నెలల్లో పూర్తిచేయాలని దర్శకుడికి అజిత్ నిబంధన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. రెండు లేదా మూడు షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తిచేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. చిత్రాన్ని ఈ ఏడాది చివరిలోనే విడుదల చేయాలని లైకా ప్రొడక్షన్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి డెవిల్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. తుణివు చిత్రంలో అజిత్ పాత్ర పేరు బ్లాక్ డెవిల్. దీంతో అందులోని డెవిల్ పేరును తన 62వ చిత్రానికి నిర్ణయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అజిత్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
మైల్స్టోన్ దిశగా హీరో ధనుష్.. 50వ సినిమా ఫిక్స్
తమిళసినిమా: ఆరంభంలోనే తుళ్లువదో ఇళమై అనే చిన్న చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన నటుడు ధనుష్. ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ వరకు ఎదిగారు. టాలీవుడ్‌నూ వదల్లేదు. తెలుగులో ధనుష్ నటించిన వాత్తి అనే ద్విభాషా చిత్రం (తెలుగులో సార్ పేరుతో) త్వరలో విడుదలకు ముస్తాబవుతుంది. అదే విధంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో చిత్రం కూడా కమిట్ అయ్యారు. తాజాగా తిరుచ్చిట్రం ఫలం చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. కాగా ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. చదవండి: హీరోయిన్‌తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, అసహనం వ్యక్తం చేసిన నటి ఈ చిత్ర షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. కాగా ధనుష్ తాజాగా ఓ మైల్‌స్టోన్‌ను టచ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అదే తన 50వ చిత్రం. ఇంతకు ముందు తిరుచ్చిట్రం ఫలం చిత్రాన్ని నిర్మించిన సన్‌పిక్చర్స్ సంస్థనే ఈ క్రేజీ చిత్రాన్ని నిర్మించనుంది. ఇంతకు ముందు రజనీకాంత్ కథానాయకుడిగా అన్నాత్తే చిత్రాన్ని నిర్మించిన ఈ సంస్థ ప్రస్తుతం అదే రజనీకాంత్ హీరోగా జైలర్ చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్, తెలుగు నటుడు సునీల్, నటి రమ్యకృష్ణ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఇందులో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ అతిథి పాత్రలో మెరవనున్నారు. చదవండి: ట్రోల్స్‌పై స్పందించిన గోపీచంద్ మలినేని నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం. మిగతా షూటింగ్ ఏప్రిల్ నెలాఖరుకి పూర్తి చేసి చిత్రాన్ని ఆగస్టులో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా తదుపరి సన్ పిక్చర్స్ సంస్థ ధనుష్ హీరోగా నటించే చిత్రాన్ని నిర్మించనుంది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రానికి దర్శకుడు, ఇతర నటీనటులు సాంకేతిక వర్గం వంటి వివరాలను త్వరలోనే వెల్లడించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. -
'ది కశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్ వివేక్ తర్వాతి చిత్రం ఇదే..
The Kashmir Files Director Vivek Agnihotri Announces The Delhi Files: 1990లో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో రూపొందిందిన సినిమా 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ చిత్రంలో బాలీవుడ్ దిగ్గజ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు. మార్చి 11న విడుదలై ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు పలు ప్రభుత్వాలు వినోదపు పన్నును సైతం మినహాయింపుని ఇచ్చాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కేవలం మౌత్ టాక్‌తోనే సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్సకత్వం వహించిన విషయం తెలిసిందే. I thank all the people who owned #TheKashmirFiles. For last 4 yrs we worked very hard with utmost honesty & sincerity. I may have spammed your TL but it’s important to make people aware of the GENOCIDE & injustice done to Kashmiri Hindus. It’s time for me to work on a new film. pic.twitter.com/ruSdnzRRmP — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 15, 2022 చదవండి: డైరెక్టర్ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో సామాజిక అంశాలను తన సినిమాలతో వేలెత్తి చూపే బాలీవుడ్ దర్శకులలో వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ఆయన ఇదివరకు 'ది తాష్కెంట్ ఫైల్స్' అనే సినిమాను తెరకెక్కించి హిట్ కొట్టారు. ఇక ఇటీవల వచ్చిన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంతో మరో విజయం సాధించారు. దీంతో ఆయన నెక్ట్స్ మూవీ ఏంటి ? అని ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తికి తెరదింపుతూ తన కొత్త సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ అగ్రిహోత్రి. ఆయన 'ది ఢిల్లీ ఫైల్స్' అనే చిత్రం తెరకెక్కిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ప్రకటనతో సినిమా చిత్రీకరణకు ముందే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రభాస్ 25వ చిత్రం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతి నిండా ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. ‘సలార్, రాధేశ్యామ్, ఆది పురుష్’తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి కాగా.. ‘సలార్’ చివరి షూటింగ్‌లు షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. మరోవైపు ఆది పురుష్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రభాస్ 25వ చిత్రం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ అక్టోబర్ 7న రానున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ #ప్రభాస్ 25 (#Prabhas25) ట్యాగ్‌ను సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. చదవండి: ‘గాడ్ ఫాదర్’లో తన రోల్ చెప్పెసిన గంగవ్వ, ఏకంగా చిరుకు.. అంతేగాక ఈ హ్యాష్ ట్యాగ్ ట్విటర్లో ఏకంగా టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్తగా కనిపించనున్నాడట. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అలాగే ప్రుభాస్ 25 చిత్రం ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్ 25వ చిత్రం దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నారు. బాహుబలితో ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్ చేసిన రాజమౌళియే ప్రభాస్ 25వ చిత్రాన్ని తెరకెక్కించడం నిజంగా విశేషం అంటూ ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజమందో తెలియాలంటే అక్టోబర్ 7వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. -
ఇతిహాసాల నేపథ్యంలో ప్రశాంత్ వర్మ కొత్త మూవీ, టైటిల్ ఖరారు
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఆయన తదుపరి చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆయన నాలుగవ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీకి ‘హనుమాన్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వెల్లడించారు. అంతేగాక దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. పురాణ ఇతిహాసాల నుంచి పుట్టుకొచ్చిన సూపర్ హీరో కథల నుంచి స్ఫూర్తి పొందిన కొత్త కథతో ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు టీజర్ ద్వారా మేకర్స్ స్పష్టం చేశారు. తెలుగులోనే ఒరిజినల్ సూపర్ హీరో ఈ మూవీ ఉండనుందని వారు పేర్కొన్నారు. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే.. నేపథ్య సంగీతంతో దైవిక అనుభూతిని కలిగించించేలా ఉండటంతో ప్రేక్షకులను విశేషం ఆకట్టుకుంటోంది. వైవిధ్యమైన కథతో సినిమాలను అందించడంలో ప్రశాంత్ వర్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. డిఫరెంట్ జానర్‌తో ‘అ!’ మూవీని నేషనల్ అవార్డ్ దక్కేలా వినూత్నంగా తెరకెక్కించాడు ఆయన. ఆ తర్వాత జీవిత రాజశేఖర్ లీడ్ రోల్ వచ్చిన కల్కి మూవీని సరికొత్త కథాంశంతో ప్రేక్షకులకు అందించాడు. ఈ మూవీకి స్క్రీన్ ప్లేతో పాటు విజువల్స్, మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇటీవల సౌత్‌లో తొలిసారిగా జాంబీల జానర్లో జాంబీరెడ్డి మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా సత్తా చాటుకుంది. -
కాంబినేషన్ కుదిరేనా?
ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమా చేయనున్న దర్శకుడి పేరు ఇదేనంటూ ఇప్పటికే కొంతమంది పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రశాంత్ నీల్, అనిల్æరావిపూడి వంటి దర్శకుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ పేరు తెరపైకి వచ్చింది. ఈ కాంబినేషన్ దాదాపు కుదిరినట్లేనని టాక్. ఇదిలా ఉంటే.. దర్శకుడు వేణు శ్రీరామ్‌తో అల్లు అర్జున్ ‘ఐకాన్: కనపడుటలేదు’ సినిమా కమిటయ్యారు. అలాగే కొరటాల శివతో ఓ సినిమా ఫిక్స్ అయింది. మరి... ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేస్తారో చూడాలి. -
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అశీష్ గాంధీ
'నాటకం' సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో అశిష్ గాంధీ. రగ్డ్ లుక్‌లో కనిపించి తొలి సినిమాతోనే మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో అయన తరువాతి చిత్రం మొదలైంది. 'నాటకం' చిత్ర దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. 'నాటకం' సినిమాతో తన ప్రతిభ చాటుకున్న కళ్యాణ్ జీ ఆ చిత్రంతో విమర్శకుల ప్రశంశలు పొందాడు. కాగా ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు అశీష్ గాంధీ. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3 గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. తిరుమల రెడ్డి సహా నిర్మాతగా ఉండగా, మణికాంత్ కూర్పుని అందిస్తున్నారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ రెండో వారంలో భారీ తారాగణంతో షూటింగ్‌కి వెళ్లబోతుంది. మొత్తంగా ఈ సినిమాలో మూడు డిఫరెంట్ పాత్రలు పోషిస్తుండగా.. తాజాగా పోలీస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.. ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ‘‘విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ఈ సినిమా తెరకెక్కుతుంది. దర్శకుడు చెప్పిన కథ చాలా బాగుంది. ఈ కథకి హీరోగా అశిష్ గాంధీ మాత్రమే సూట్ అవుతాడనిపించింది. ఇటీవలే జరిపిన ఫోటోషూట్ లో మూడు డిఫరెంట్ పాత్రలకు అశీష్ గాంధీ చాల బాగా సూట్ అయ్యాడు. మా బ్యానర్ నుండి రాబోతున్న ఈ సినిమా అందరికి మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఏప్రిల్ రెండో వారంలో షూటింగ్ వెళ్ళబోతున్నాం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు. -
రవితేజ @ 68
రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శ కత్వంలో ఓ సినిమా ఉండొ చ్చనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్త నిజమేనంటూ ఆదివారం చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. రవితేజకి ఇది 68వ సినిమా. ప్రసన్నకుమార్ బెజవాడ కథ–స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ చిత్రంలోని ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తారు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే త్రినాథరావుతో చేసే సినిమా ఆరంభమవుతుంది. -
మూడో సినిమా ఇబ్బంది పెట్టింది
‘పెళ్ళి చూపులు’ సినిమాతో పరిశ్రమ దృష్టి మొత్తం తన వైపునకు తిప్పుకున్నారు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఈ సినిమా తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి దర్శకత్వం వహించారాయన. ఆ తర్వాత ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో నటుడిగా మారారు. కాగా తరుణ్ భాస్కర్ తర్వాతి సినిమా వెంకటేశ్‌తో ఉంటుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తరుణ్ కొత్త ప్రాజెక్ట్ క్రైమ్ డ్రామాగా ఉంటుందట. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘నా 3వ సినిమా నన్ను చాలా ఇబ్బందుల్లో పెట్టింది. రెండు పెద్ద ప్రాజెక్ట్‌లు చేసే అవకాశం వచ్చింది.. వీటిలో ఒకదాన్ని ఎంచుకోవడం చాలా కష్టమైంది. బాగా ఆలోచించిన తర్వాత క్రైమ్ డ్రామాతో సినిమా తెరకెక్కిద్దాం అని నిర్ణయించుకున్నాను. ఈ సినిమాలో ఓ ప్రముఖ స్టార్ హీరో నటించనున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది. ఈ సినిమా ప్రేక్షకుల్ని అస్సలు నిరుత్సాహపరచదు’’ అన్నారు. -
ఇది కామ్ టైమ్
‘‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల అందరం ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ ఖాళీ సమయాన్ని ఎక్కువగా మన గురించి మనం విశ్లేషించుకోవడానికి ఉపయోగిద్దాం. నేను అదే చేస్తున్నాను’’ అన్నారు నిత్యా మీనన్. లాక్డౌన్లో చేస్తున్న విషయాల గురించి, తదుపరి చిత్రాల గురించి నిత్యా మీనన్ మాట్లాడుతూ– ‘‘ఈ ఖాళీ సమయాన్ని ఉపయోగకరంగా వినియోగించుకుంటున్నాను. అలాగే దీన్ని నా ‘కామ్ టైమ్’గా మార్చుకున్నాను. నా గురించి నేను ఇంకా ఎక్కువ విశ్లేషించుకోవడానికి వీలు దొరికింది. ఇలాంటి సమయం మళ్లీ దొరకదు. ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితి వల్ల అందరం మానసికంగా పోరాటం చేస్తున్నాం. ఎవరి ఫైట్ వాళ్లది. అలాగే ప్రస్తుతం డిజిటల్ నుంచి చాలా స్క్రిప్ట్ ఆఫర్స్ ఉన్నాయి. స్క్రిప్ట్ నచ్చితేనే సినిమా కమిట్ అవుతాను. వెబ్‌లోనూ అదే పద్ధతిని పాటిస్తాను. ప్రస్తుతం జయలలిత బయోపిక్, తమిళంలో ధనుష్ తో ఓ సినిమా, తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు. -
ఐదేళ్ల తర్వాత...!
‘సన్నాఫ్ సత్యమూర్తి’ (2015) చిత్రం తర్వాత స్ట్రయిట్ తెలుగు చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించలేదు ఉపేంద్ర. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత ఉపేంద్ర ఓ తెలుగు సినిమాలో నటించనున్నారని సమాచారం. మహేశ్‌బాబు హీరోగా ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రకు ఉపేంద్రను సంప్రదించారట చిత్రబృందం. మరి... పరుశురామ్ కథకు ఉపేంద్ర ఊ అంటారా? వెయిట్ అండ్ సీ. -
కాంబినేషన్ సై?
స్టయిలిష్ ఎంటర్టైనర్లను తెరకెక్కించడంలో సురేందర్ రెడ్డి స్పెషలిస్ట్. ఇటీవలే ‘సైరా’తో చారిత్రాత్మక సినిమాతోనూ హిట్ సాధించి తన సత్తా చాటారు. మరి సురేందర్ రెడ్డి నెక్ట్స్ ఏంటి? అంటే ప్రభాస్‌తో సినిమా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రభాస్‌కు సరిపోయే పాయింట్ సురేందర్‌రెడ్డి వద్ద ఉందని, త్వరలోనే కథకు సంబంధించిన చర్చలు కూడా జరగనున్నాయని వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ కుదిరితే మాత్రం మంచి స్టయిలిష్ సినిమాని ఊహించవచ్చని ఫిల్మ్‌నగర్ టాక్. మరి.. సురేందర్ రెడ్డి చెప్పనున్న కథ నచ్చి ప్రభాస్ ‘సై’ అంటే... ఈ కొత్త కాంబినేషన్ షురూ అయినట్లే. -
నవంబర్ నుంచి షురూ
ప్రస్తుతం ‘వెంకీ మామ’ సినిమాలో సందడి సందడి చేస్తున్నారు వెంకటేశ్. ఈ సినిమా దాదాపు పూర్తి కావొస్తోంది. ‘వెంకీ మామ’ తర్వాత వెంకీ ఏం చేయబోతున్నారు? అంటే.. ‘సినిమా చూపిస్త మామ’ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని తెలిసింది. ఈ సినిమాను నవంబర్‌లో సెట్స్ మీదకు తీసుకెళ్తారని సమాచారం. నాన్‌స్టాప్ సింగిల్ షెడ్యూల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నారు. వెంకటేశ్ ప్రస్తుతం చేస్తున్న ‘వెంకీ మామ’ అక్టోబర్ నెలలో రిలీజ్ కానుంది. ఇందులో వెంకటేశ్, నాగచైతన్య మామా అల్లుళ్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.