Natakam Movie Fame Ashish Gandhi Signed Another New Movie - Sakshi
Sakshi News home page

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాటకం ఫేమ్‌ అశీష్ గాంధీ

Mar 10 2021 6:20 PM | Updated on Mar 10 2021 6:37 PM

Natakam Fame Ashish Gandhi Signs Another Movie - Sakshi

'నాటకం' సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో అశిష్ గాంధీ. రగ్డ్ లుక్‌లో కనిపించి తొలి సినిమాతోనే మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో అయన తరువాతి చిత్రం మొదలైంది. 'నాటకం' చిత్ర దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. 'నాటకం' సినిమాతో తన ప్రతిభ చాటుకున్న కళ్యాణ్ జీ ఆ చిత్రంతో విమర్శకుల ప్రశంశలు పొందాడు. కాగా ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు అశీష్ గాంధీ.

విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3 గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. తిరుమల రెడ్డి సహా నిర్మాతగా ఉండగా, మణికాంత్ కూర్పుని అందిస్తున్నారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ రెండో వారంలో భారీ తారాగణంతో షూటింగ్‌కి వెళ్లబోతుంది. మొత్తంగా ఈ సినిమాలో మూడు డిఫరెంట్ పాత్రలు పోషిస్తుండగా.. తాజాగా పోలీస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది..  

ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి  మాట్లాడుతూ ‘‘విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ఈ సినిమా తెరకెక్కుతుంది. దర్శకుడు చెప్పిన కథ చాలా బాగుంది. ఈ కథకి హీరోగా అశిష్ గాంధీ మాత్రమే సూట్ అవుతాడనిపించింది. ఇటీవలే జరిపిన ఫోటోషూట్ లో మూడు డిఫరెంట్ పాత్రలకు అశీష్ గాంధీ చాల బాగా సూట్ అయ్యాడు. మా బ్యానర్ నుండి రాబోతున్న ఈ సినిమా అందరికి మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.  ఏప్రిల్ రెండో వారంలో షూటింగ్ వెళ్ళబోతున్నాం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement