Ashish Gandhi
-
ఆకట్టుకుంటున్న ‘కళింగరాజు’ ఫస్ట్ లుక్
నాటకం సినిమాతో హీరోగా ఆశిష్ గాంధీ, దర్శకుడిగా కళ్యాణ్ జీ గోగణకు మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఈ ఇద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్‌ను చేయడం విశేషం. ఆశిష్ గాంధీ, కళ్యాణ్ జీ గోగణ కాంబోలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ స్పెక్ట్రమ్ స్టూడియోస్, సుందరకాండ మోషన్ పిక్చర్స్, కళ్యాణ్ జీ కంటెంట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి ‘కళింగరాజు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్‌తో పాటుగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ మేరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఊరి వాతావరణం కనిపిస్తోంది. ఇక ఆశిష్ గాంధీ కుర్చీ మీద కూర్చున్న తీరు, రక్తంతో తడిచిన ఆ కత్తి, రక్తపు మరకలతో కూడిన ఆ పాల క్యాన్ ఇదంతా చూస్తుంటే సినిమా అంతా రా అండ్ రస్టిక్‌గా ఉండేలా కనిపిస్తోంది.ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. -
స్నేహానికి హద్దు లేదురా
ఆశిష్ గాంధీ, అశోక్, వర్ష, హ్రితిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హద్దు లేదురా..’. రాజశేఖర్ రావి దర్శకత్వంలో వీరేష్ గాజుల బళ్లారి నిర్మించారు. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ని దర్శకుడు క్రిష్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘హద్దు లేదురా..’ టైటిల్ బాగుంది. ఫస్ట్ లుక్, సినిమా థీమ్ వైవిధ్యంగా ఉన్నాయి. సినిమా హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘అలనాటి కృష్ణార్జునులు స్నేహితులు అయితే ఎలా ఉంటారో తెలిపే కథ, కథనంతో ‘హద్దు లేదురా..’ రూ΄పొందింది. ఫైట్స్, పాటలు, సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు రాజశేఖర్ రావి. ‘‘జనవరిలో మా సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు గాజుల వీరేశ్. ‘‘స్నేహం నేపథ్యంలో రూ΄పొందిన ‘హద్దు లేదురా..’ మా యూనిట్‌కి మంచి పేరు తీసుకొస్తుంది’’ అన్నారు ఆశిష్ గాంధీ. తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: రావి మోహన్ రావు. -
రుద్రంగి విజయంతో హ్యాపీ
‘‘రుద్రంగి’ కోసం ఏడాదిన్నర కష్టపడ్డాం. ఇప్పుడు సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తుండటం మాకెంతో హ్యాపీగా ఉంది’’ అని దర్శకుడు అజయ్ సామ్రాట్ అన్నారు. జగపతిబాబు, మమతా మోహన్‌దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధీ, నవీనా రెడ్డి ముఖ్య ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. ‘‘థియేటర్లోనే చూడాల్సిన సినిమా ఇది. ప్రేక్షకులు మాకు ఇంకా స΄ోర్ట్ చేస్తారని భావిస్తున్నాం’’ అని ఈ సినిమా సక్సెస్ మీట్లో ఆశిష్ గాంధీ అన్నారు. -
‘లెజెండ్’ సినిమాను గుర్తుచేసుకున్న జగపతిబాబు
'మూడేళ్లు సినిమాలు లేకుండా ఇంట్లో కూర్చున్నప్పుడు ‘లెజెండ్’ సినిమా అవకాశం వచ్చింది. అది నా సెకండ్ ఇన్నింగ్స్ అని అందరూ పేరు పెట్టారు. ‘రుద్రంగి’కి నా థర్డ్ ఇన్నింగ్స్ అని పేరు పెట్టుకుంటున్నాను. ఇందులోని నా పాత్రలో దమ్ము ఉంటుంది' అని నటుడు జగపతిబాబు అన్నారు. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో జగపతిబాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమలా రామన్, గానవి లక్ష్మణ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో జగపతిబాబు మాట్లాడుతూ– 'చిన్న సినిమా.. పెద్ద సినిమా.. పెద్ద బడ్జెట్ అనే పాయింట్ ఇవాళ దాటిపోయింది. డబ్బులు పెడితే సూపర్ హిట్ అనేది కాదు. రీసెంట్గా విడుదలైన ‘సామజ వరగమన’ మంచి హిట్ అయింది. ‘రుద్రంగి’ కథ కూడా కొత్తగా ఉంటుంది' అన్నారు. రసమయి బాలకిషన్ మాట్లాడుతూ– 'జగతిబాబుగారి ప్రోత్సాహమే మమ్మల్ని ముందుకు నడిపించింది. ప్రేమకు, వాంఛకు మధ్య జరిగిన వాస్తవ కథే ‘రుద్రంగి’. నేను ఎమ్మెల్యే కాకముందు కూడా సినిమా తీశా.. ఇప్పుడు ‘రుద్రంగి’ తీశా. అంతేగానీ ఎమ్మెల్యే అని ఈ సినిమా తీయలేదు. మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి' అన్నారు. -
'యమదొంగ తర్వాత ఆమెకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదన్నారు'
'యమదొంగ’ సినిమాలో మమతా మోహన్ దాస్‌గారి నటనంటే నాకు ఇష్టం. ఆమె క్యాన్సర్ నుంచి కోలుకోవడంతో ‘రుద్రంగి’లో నటించమని కోరాను. ‘పదేళ్ల నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు.. నన్ను సంప్రదించినందుకు థ్యాంక్స్’ అన్నారామె' అని డైరెక్టర్ అజయ్ సామ్రాట్ అన్నారు. జగపతిబాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమలా రామన్, గానవి లక్ష్మణ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో అజయ్ సామ్రాట్ మాట్లాడుతూ– 'బాహుబలి, రాజన్న’ సినిమాలకు డైలాగ్ రైటర్‌గా చేశాను. ఇక నా బాల్యంలో విన్న కథలు, చూసిన పరిస్థితులు, చదివిన చరిత్ర నుంచి ‘రుద్రంగి’ కథ రాసుకున్నాను. తెలంగాణలో దొరల అణ చివేతల మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ‘రుద్రంగి’ని పూర్తి భిన్నంగా ఫ్యామిలీ ఎమోషనల్, సోషల్ డ్రామాగా తీశాను. రసమయిగారికి సినిమా తీయాలనే తపన ఎక్కువగా ఉంది.. నిర్మాతగా ఆయన ఏం చేయగలడో అన్నీ చేశారు. సినిమా బాగుంటే జనాలు చూస్తారు. ‘కాంతారా’కి ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు. కానీ, జనాలు విపరీతంగా చూశారు. మా ‘రుద్రంగి’ కూడా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
యంగ్ హీరోకి వరుస ఆఫర్స్.. తగ్గేదే లే!
తొలి చిత్రం 'నాటకం'తో ప్రేక్షకుల మనసు దోచేసిన ఆశిష్ గాంధీ.. అప్పటి నుంచి విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకుంటూ పాపులారిటీ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తొలి చిత్రంతోనే తన నటనా ప్రతిభను బయటపెట్టిన ఆశిష్.. ఆ తర్వాత 'దర్శకుడు', 'ఉనికి' లాంటి డిఫరెంట్ సినిమాల్లో నటించారు. మరికొద్ది రోజుల్లో ఆశిష్ గాంధీ నటించిన 'రుద్రంగి' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. (ఇదీ చదవండి: 'గుడ్ నైట్' సినిమా రివ్యూ (ఓటీటీ)) తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్ సినిమాగా రాబోతున్న ఈ 'రుద్రంగి'లో మల్లేష్ అనే కీలకపాత్ర చేస్తున్నారు. ఈ రోల్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానుంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ ఆశిష్ గాంధీ రోల్‌పై ఆసక్తిని పెంచాయి. జులై 7న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. మలయాళ ప్రేక్షకులనూ తన నటనతో అలరించేందుకు రెడీ అవుతున్నారు హీరో ఆశిష్ గాంధీ. పికాసో (Picaso) అనే వైవిధ్యభరితమైన చిత్రంతో కేరళ ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేయబోతున్నారు. దీంతోపాటు మరికొన్ని సినిమాలను లైన్ లో పెట్టేసి సెట్స్‌పై బిజీ బిజీగా ఉంటున్నారు. ఆశిష్ గాంధీ చేస్తున్న తదుపరి సినిమా 'హద్దు లేదు రా'. ఇది ఆగస్టులో విడుదల కానుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో మరో చిత్రం చేసేందుకు రెడీ అయ్యారు. ఇది సెప్టెంబరు నుంచి షురూ కానుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు) -
‘గాడు బలవంతుడే రా.. కానీ నేను భగవంతుడు రా..’ ఆసక్తికరంగా టీజర్
‘మై నేమ్ ఈజ్ భీం రావ్ దేశ్‌ముఖ్..’ అనే జగపతిబాబు డైలాగ్‌తో ‘రుద్రంగి’ సినిమా టీజర్ విడుదలైంది. జగపతి బాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రుద్రంగి’. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ చిత్రాలకు రైటర్‌గా పనిచేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రసమయి ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మిస్తున్న ఈ మూవీ మే 26న విడుదలకానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ‘స్వాతంత్య్రం అన్నది బానిసలకు కాదు.. అది మా కోసం’, ‘గాడు బలవంతుడే రా.. కానీ నేను భగవంతుడు రా..’(జగపతి బాబు), ‘నీకు ఎదురు తిరిగిన మల్లేశ్గాడు ఖతం కావాలె(మమతా మోహన్ దాస్) వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. స్వాతంత్య్రం తర్వాత ఆనాటి తెలంగాణ సాంఘిక పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు టీజర్లో కనిపిస్తోంది. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ శనమోని, సంగీతం: నాఫల్ రాజా. -
మమ్ముట్టి చేతుల మీదుగా ‘పికాసో’ ఫస్ట్ లుక్ పోస్టర్
నాటకం సినిమాతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు హీరో ఆశిష్ గాంధీ. ఇప్పుడు ఆశిష్ తన కొత్త చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్నారు. రుద్రంగి అనే భారీ యాక్షన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే అదే సమయంలో ఆశిష్ గాంధీ మాలీవుడ్‌ను కూడా పలకరించబోతున్నారు. ఆశిష్ గాంధీ ఈసారి మలయాళ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పికాసో అనే చిత్రంతో కేరళ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. కేరళ మెగాస్టార్ మమ్ముట్టి చేతుల మీద ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక పోస్టర్ ఈ పోస్టర్లో ఆశిష్ గాంధీ ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. పోస్టర్ చూస్తుంటే డైరెక్టర్ సునిల్ కరియాట్టుకర దీన్ని భారీ యాక్షన్ జానర్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. ఈ సినిమాకు కేజీయఫ్ ఫేమ్ రవి బసూర్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. -
‘ర్యాంబో’గా వస్తున్న ‘ఉడుంబు’
Rambo Movie First Look: మలయాళ సూపర్ హిట్ మూవీ ‘ఉడుంబు’ తెలుగు రీమేక్ రైట్స్ ప్రముఖ నిర్మాత గంగపట్నం శ్రీధర్ సొంతం చేసుకోవడం తెలిసిందే.. టి.సి.ఎస్.రెడ్డి సమర్పణలో శ్రీవిఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి "ర్యాంబో" అనే టైటిల్ పెట్టారు. యువ కథానాయకుడు ఆశిష్ గాంధీ టైటిల్ పాత్ర పోషించనున్నాడు. దర్శకత్వ శాఖలో విశేష అనుభవం కలిగిన యువప్రతిభాశాలి "రత్నాకరం అనిల్ రాజు" ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. తమ తమ శాఖలలో నిష్ణాతులైన స్టార్ టెక్నిషియన్స్ "ర్యాంబో" చిత్రానికి పని చేస్తున్నారు. హోలీ పండుగను పురస్కరించుకుని "ర్యాంబో" ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మార్చి 28 నుంచి సెట్స్ కు వెళ్లనున్న ఈ క్రేజీ చిత్రానికి ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. -
మార్చి 18న భయపెట్టబోతున్న ‘డైరెక్టర్’
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు టాలీవుడ్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తెరకెక్కిస్తే ఈ జోనర్ సినిమాలు భారీ కలెక్షన్లను రాబడుతాయి. ఆ విధంగా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కి ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబవుతున్న చిత్రం ‘డైరెక్టర్’. నాటకం సినిమా తో నటుడిగా మంచి గుర్తింపు సాధించుకున్న ఆశిష్ గాంధీ హీరోగా ఐశ్వర్య రాజ్, మరీనా, ఆంత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజన్ సినిమాస్ బ్యానర్ పై డా.నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా లో నిర్మాత నాగం తిరుపతి రెడ్డి ఓ కీలక పాత్రలో కూడా కనిపించారు. దర్శక ద్వయం కిరణ్ పొన్నాడ-కార్తీక్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి, టీజర్ కి, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా పై కూడా అంచనాలను పెంచాయి. రాజా ది గ్రేట్, పటాస్, సుప్రీమ్ వంటి పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ సంగీతం సమకూర్చారు. బి.నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా ఆదిత్య వర్దిన్ ఛాయాగ్రాహకుడు గా పనిచేశారు. కాగా ఈ చిత్రాన్ని ఈ నెల 18 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో హీరో ఆశీష్ గాంధీ పెళ్లి.. ఫోటోలు వైరల్
'నాటకం' ఫేమ్ ఆశీష్ గాంధీ ఓ ఇంటివాడయ్యాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ నికితతో ఆశిష్ ఏడడుగులు వేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో వీరి వివాహం జరిగింది. కోవిడ్ నియమ నిబంధనల నేపథ్యంలో అతి కొద్ది మంది బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఆశిష్, నిఖిలత వివాహం జరిగింది. రెండు కుటుంబాల పెద్దల అంగీకారంతోనే అశిష్, నికితలు ఒక్కటైయ్యారు. తన పెళ్లి గురించి ఆశీష్ మాట్లాడుతూ.. ‘రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో నన్ను చూసి నిఖిత ఇష్టపడింది. అప్పట్నుంచి మా ఫ్యామిలీ ఫంక్షన్స్ జరిగిన ప్రతిసారి నన్ను గమనిస్తూనే ఉంది. ఫాలో చేస్తూనే ఉంది. అంటే తను అప్పట్నుంచే నన్ను ప్రేమిస్తుంది. ఈ విషయాలను నిఖిత నాతో చెబుతున్నప్పుడు నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది.నేను కోరుకున్న లక్షణాలు ఉన్న అమ్మాయి నా జీవితంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తను నా వ్యక్తితగతమైన విషయాలను బాగా అర్థం చేసుకుంటుంది. సాధారణంగా సినిమా లైఫ్ అంటే చాలా మందికి భిన్నమైన ఆలోచనలు ఉంటాయి. అందుకే తనతో నా వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను చర్చించాలనుకున్నాను. తను బాగా అర్థం చేసుకుంది. చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది’అంటూ భార్యపై ప్రేమను వ్యక్తం చేశాడు. -
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అశీష్ గాంధీ
'నాటకం' సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో అశిష్ గాంధీ. రగ్డ్ లుక్‌లో కనిపించి తొలి సినిమాతోనే మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో అయన తరువాతి చిత్రం మొదలైంది. 'నాటకం' చిత్ర దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. 'నాటకం' సినిమాతో తన ప్రతిభ చాటుకున్న కళ్యాణ్ జీ ఆ చిత్రంతో విమర్శకుల ప్రశంశలు పొందాడు. కాగా ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు అశీష్ గాంధీ. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3 గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. తిరుమల రెడ్డి సహా నిర్మాతగా ఉండగా, మణికాంత్ కూర్పుని అందిస్తున్నారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ రెండో వారంలో భారీ తారాగణంతో షూటింగ్‌కి వెళ్లబోతుంది. మొత్తంగా ఈ సినిమాలో మూడు డిఫరెంట్ పాత్రలు పోషిస్తుండగా.. తాజాగా పోలీస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.. ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ‘‘విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ఈ సినిమా తెరకెక్కుతుంది. దర్శకుడు చెప్పిన కథ చాలా బాగుంది. ఈ కథకి హీరోగా అశిష్ గాంధీ మాత్రమే సూట్ అవుతాడనిపించింది. ఇటీవలే జరిపిన ఫోటోషూట్ లో మూడు డిఫరెంట్ పాత్రలకు అశీష్ గాంధీ చాల బాగా సూట్ అయ్యాడు. మా బ్యానర్ నుండి రాబోతున్న ఈ సినిమా అందరికి మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఏప్రిల్ రెండో వారంలో షూటింగ్ వెళ్ళబోతున్నాం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు. -
‘ఉనికి’ కోసం తపన
‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్ర శుక్లా జంటగా రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉనికి’. బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి నిర్మాతలు. షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాకి ‘ఉనికి’ అనే టైటిల్‌ని ఖరారు చేసి, పోస్టర్ని విడుదల చేశారు. బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి మాట్లాడుతూ.. ‘‘ప్రతి మనిషి తన ఉనికి చాటుకోవడం కోసం తపిస్తాడు. ముఖ్యంగా అననుకూల పరిస్థితులు, అవరోధాలు ఎదురైనప్పుడు ఇంకా ఎక్కువగా ఉనికి కోసం తపిస్తాడు. ఓ మధ్య తరగతి యువతికి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తన ఉనికి నిలుపుకోవడం కోసం ఎలా పోరాడింది? అనేది ఈ చిత్రం ప్రధాన కథాంశం. రాజమండ్రి సబ్ కలెక్టర్ అంజలి అనుపమను చూసినప్పుడు కలిగిన ఆలోచనతో ఈ స్క్రిప్ట్ తయారు చేశాం. ఈ వేసవికి సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్), సహనిర్మాత: అడ్డాల రాజేశ్. -
థ్రిల్ చేస్తా!
‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్రా శుక్లా జంటగా రాజకుమార్ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతోంది. బాబీ ఏడిద క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. జనవరి మొదటివారంతో సినిమా పూర్తవుతుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇంతవరకు ఎవరూ షూటింగ్ చెయ్యని లొకేషన్స్‌లో చేస్తున్నాం. రాజమండ్రిలో పోలీస్ స్టేషన్ సెట్, కలెక్టర్ ఆఫీసు సెట్, ఇన్వెస్టిగేషన్ సెట్ వేశాం’’ అన్నారు. ఈ చిత్రానికి కథ: బాబీ ఏడిద, రచన: సరదా శ్యామ్, కెమెరా–కూర్పు: హరికృష్ణ, సంగీతం: పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్), సహనిర్మాత: అడ్డాల రాజేష్. -
సరికొత్త డీటీయస్
‘నాటకం’ మూవీ ఫేమ్ ఆశిష్ గాంధీ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘డీటీయస్’. పూజా జవేరి కథానాయిక. అభిరామ్ పిల్లాను దర్శకునిగా పరిచయం చేస్తూ గంగారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఆశిష్ గాంధీ మాట్లాడుతూ– ‘‘నాటకం’ తర్వాత కొత్త కథల కోసం ఎదురు చూస్తున్న సమయంలో అభిరామ్ చెప్పిన కథ నచ్చింది. గంగారెడ్డిగారికి కాన్సెప్ట్ నచ్చడంతో సినిమా ప్రారంభించారు’’ అన్నారు. ‘‘ఇప్పటి వరకూ తెలుగు తెరమీద చూడని సరికొత్త కథతో ఈ సినిమా ఉంటుంది. ఈ నెల చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు. ‘‘యంగ్ టీమ్ చేస్తోన్న చిత్రమిది. ఇలాంటి కథకు సంగీతం అందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు సాయి కార్తీక్. -
నమ్మకం నిజమైంది
ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘నాటకం’. కల్యాణ్ జీ గోగన దర్శకుడు. శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్లో చిత్రనిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ– ‘‘కథపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా కొన్నాను. మీరు (ప్రేక్షకులు) ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు, నా నమ్మకాన్ని నిజం చేసినందుకు చాలా థ్యాంక్స్. మా బ్యానర్లో ఫస్ట్ ఫిల్మ్ ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఉత్సాహంతో మరిన్ని సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాను’’ అన్నారు. హీరో ఆశిష్ గాంధీ మాట్లాడుతూ– ‘‘అందరూ ఫోన్ చేసి సినిమా చాలా బావుందని మన దేశం నుండే కాదు, యూకే నుండి కూడా మంచి టాక్ వచ్చిందని చెప్తున్నారు. సినిమాని వేరే ప్లేసెస్‌లో కూడా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. చిత్ర సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాలను మళ్లీ మళ్లీ ఆదరిస్తారని మరోసారి రుజువైంది. రివ్యూస్ బాగా వచ్చాయి. మౌత్ టాకే మా సినిమాకి మెయిన్ పబ్లిసిటీ’’ అన్నారు. -
ఆర్ఎక్స్100ని మించి...
‘‘నాటకం’ సినిమా కొంటున్నామని రిజ్వాన్‌గారు చెప్పారు. ఆ టైమ్‌లో వద్దన్నాను. కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక నేను చెప్పాల్సిన అవసరం లేదనిపించింది. ఆయన ఈ సినిమా కొన్నారంటేనే ఎంత కంటెంట్ ఉందో అర్థమవుతుంది. ఆశిష్ గాంధీ నటన, సాయి కార్తీక్ మ్యూజిక్ చాలా బాగుంది. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించిన ‘గరుడవేగ’ అంజిని ఇకపై ‘నాటకం’ అంజి అంటారు’’ అని హీరో సుధీర్‌బాబు అన్నారు. ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్ జంటగా కల్యాణ్‌జి గోగన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాటకం’. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ సాయిదీప్ చట్లా, రాధికా శ్రీనివాస్, ప్రవీణ్ గాంధీ, ఉమా కూచిపూడి నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కల్యాణ్‌జి గోగన మాట్లాడుతూ– ‘‘నాటకం’ సినిమాని ‘అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100’ చిత్రాలతో పోల్చడం గర్వంగా ఉంది. పదిహేను రోజుల్లో ఈ సినిమా కథ రాసుకున్నా. సింగిల్ సిట్టింగ్‌లో నిర్మాతలు ఓకే చేశారు. కథ చెప్పగానే సినిమా సూపర్ హిట్ అవుతుందని సాయి కార్తీక్‌గారు నమ్మారు’’ అన్నారు. ‘‘నాటకం’ సినిమాని ‘ఆర్ఎక్స్ 100’తో పోలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా మా సినిమాని మించిన హిట్ అవ్వాలి’’ అన్నారు హీరో కార్తికేయ. ‘‘ఈరోజు చాలా హ్యాపీగా ఉన్న వ్యక్తి మా నాన్నగారు. నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన ఆయనకు చాలా థ్యాంక్స్’’ అన్నారు ఆశిష్ గాంధీ. నిర్మాతలు రిజ్వాన్, ఖుషి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్, కెమెరామేన్ అంజి తదితరులు పాల్గొన్నారు. -
‘నాటకం’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
విలన్‌గా వచ్చి హీరోనయ్యా
ముషీరాబాద్: ఎలాంటి బాధ్యతలు లేని ఓ యువకుడు బాలకోటేశ్వరరావు. అనుకోకుండా పెద్ద లక్ష్యాన్ని భుజానకెత్తుకుంటాడు. దాన్ని ఎలా సాధించాడనేది తెరపై చూడాల్సిందేనంటున్నాడు ‘నాటకం’ సినిమా హీరో ఆశిష్ గాంధీ. రాంనగర్లో పుట్టిపెరిగి ఇక్కడే చదువుకున్న ఓ సామాన్య యువకుడు ఆశిష్. సినిమాపై ఉన్న ఆసక్తితో మొదట మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని తర్వాత మోడలింగ్ చేశాడు. తన మనసు సినిమాల వైపే లాగుతుండడంతో కొన్ని షార్ట్ ఫిల్మŠస్ సైతం తీశాడు. ఆపై ‘పటాస్, డీజే, లై, ఉన్నది ఒకటే జిందగీ, విన్నర్’ వంటి పలు చిత్రాల్లో నెగిటివ్ (విలన్) పాత్రలు చేసే అవకాశం దక్కించుకున్నాడు. అప్పటి విలన్ ఇప్పుడు ‘నాటకం’ సినిమా ద్వారా హీరోగా వెండి తెరకు పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం ఈనెల 28న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆశిష్ గాంధీ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆ వివరాలు ఆశిష్ మాటల్లోనే.. ‘‘ఈ చిత్రానికి కళ్యాణ్‌జీ గోగణ దర్శకత్వం వహించాడు. శ్రీసాయిదీప్ చాట్ల, రాధిక శ్రీనివాస్, ప్రవీణ్ గాంధీ, ఉమా కూచిపూడి నిర్మాతలు. హీరోగా నా తొలి చిత్రమిది. బాలకోటేశ్వరరావు, పార్వతి అనే జంట స్వచ్ఛమైన ప్రేమ కథ ఇందులోని స్టోరీ. పూర్తి పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. కథానుగుణంగానే బోల్డ్‌గా, రియలిస్టిక్‌గా సినిమాను చిత్రీకరించాం. ప్రేమ, యాక్షన్, రొమాన్స్ హంగుల సమ్మిళితంగా దర్శకుడు కళ్యాణ్ సినిమాను తీర్చిదిద్దారు. ఏడేళ్లుగా సినిమాల్లో నిలదొక్కుకోవడానికి నేను పడుతున్న కష్టాలు చూసి నటుడిగా నాకో మంచి జీవితాన్ని ఇవ్వడానికే మా అన్నయ్య ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించారు. సిటీలో పెరగడంతో పల్లెటూరి పాత్ర కోసం మూడు నెలల పాటు హోమ్‌వర్క్ చేశాను. రంగస్థలం, ఆర్ఎక్స్ 100 కథలతో ఈ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదు. రోటీన్‌కు భిన్నమైన కథను ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నంతో చేసిన సినిమా ఇది. మా నాన్న గాంధీ అప్పట్లో సినిమాల్లో అవకాశాల కోసం బాంబే వరకు వెళ్లారు. కానీ నటుడు కాలేకపోయారు. మా నాన్న కోరికను తీర్చాలనే లక్ష్యంతో నేనీప్రయత్నానికి పూనుకున్నాను. దానికి తగ్గట్టూగానే విలన్‌తో పాటు, హీరోగా అవకాశాలు రావడం అదృష్టంగా భావిస్తున్నా’ అంటూ ముగించాడు. -
లక్ష్యం కోసం...
‘‘నాది హైదరాబాద్. సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే చదువు మధ్యలోనే ఆపేశా. మోడలింగ్‌తో పాటు కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌లో నటించా. వాటిద్వారా వచ్చిన గుర్తింపే ‘పటాస్, ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాల్లో చాన్స్ తెచ్చిపెట్టింది. హీరోగా ‘నాటకం’ నా తొలి సినిమా’’ అని ఆశిష్ గాంధీ అన్నారు. ఆయన హీరోగా ఆషిమా కథానాయికగా కల్యాణ్ జి.గోగణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాటకం’. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సమర్పణలో శ్రీ సాయిదీప్ చాట్ల, రాధిక శ్రీనివాస్, ప్రవీణ్ గాంధీ, ఉమ కూచిపూడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. ఆశిష్ మాట్లాడుతూ– ‘‘సినిమాల్లో నిలదొక్కుకోవడానికి ఏడేళ్లుగా నేను పడుతున్న కష్టాలు చూసి, నటుడిగా నాకు మంచి జీవితాన్ని ఇవ్వాలని మా అన్నయ్య ‘నాటకం’ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో బాలకోటేశ్వరరావు అనే యువకుడి పాత్ర చేశా. బరువు బాధ్యతలు లేకుండా తిరిగే ఆ యువకుడు అనుకోకుండా ఓ లక్ష్యాన్ని ఎంచుకుంటాడు. ఆ లక్ష్యం ఏంటి? దాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది ఆసక్తికరం. కథానుగుణంగానే రియలిస్టిక్‌గా, బోల్డ్‌గా తెరకెక్కించాం. లవ్‌స్టోరీ కూడా ఉంది. బాలకోటేశ్వరరావు, పార్వతిల స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం నిదర్శనం’’ అన్నారు. -
కొత్త కథలను ఆదరిస్తున్నారు
‘‘సంగీత దర్శకుడు సాయికార్తీక్‌కు ‘నాటకం’ కథ, సినిమా బాగా నచ్చింది. అందుకే ఎక్కడికి వెళ్లినా ఈ సినిమా గురించి.. ఇందులో పనిచేసిన వారి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు. కొత్త కథా చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు’’ అని నిర్మాత అనీల్ సుంకర అన్నారు. ఆశిష్ గాంధీ, ఆషిమా జంటగా కల్యాణ్ జి.గోగణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాటకం’. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సమర్పణలో శ్రీసాయిదీప్ చాట్ల, రాధిక శ్రీనివాస్, ప్రవీణ్ గాంధీ, ఉమ కూచిపూడి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు గోపీచంద్ మలినేని, హీరో శ్రీవిష్ణు విడుదల చేశారు. కల్యాణ్ జి.గోగణ మాట్లాడుతూ –‘‘ఈ చిత్రాన్ని ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో తీశా. కథలోని 5 శాతం మాత్రమే టీజర్లో చూపించాం. 95 శాతం కంటెంట్ సినిమాలో చూడాల్సిందే. కథ విన్న సాయికార్తీక్‌గారు మ్యూజిక్ చేయడానికి అంగీకరించడంతో పాటు సినిమాటోగ్రఫీ చేయడానికి అంజిగారిని ఒప్పించారు’’ అన్నారు. ‘‘మా సినిమా టీజర్ చూసి ‘ఆర్ఎక్స్ 100, అర్జున్‌రెడ్డి’ చిత్రాల్లా ఉంటుందనుకోవద్దు. ఇది వైవిధ్యమైన సినిమా’’ అన్నారు ఆశిష్ గాంధీ. ‘‘త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు చిత్ర నిర్మాతలు. మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్, సినిమాటోగ్రాఫర్ అంజి, నిర్మాత రిజ్వాన్, శివ సెల్యూలాయిడ్ సురేశ్ పాల్గొన్నారు. -
పెద్ద విలన్ అవుతావన్నారు!
‘‘చిన్నతనం నుంచి సినిమాలంటే ఇష్టం. ఎప్పటికైనా ఆర్టిస్ట్ అవ్వాలనే పట్టుదలతోనే ట్రైనింగ్ తీసుకున్నాను’’ అని ఆశిష్ గాంధీ అన్నారు. ‘ఓ స్త్రీ రేపు రా’ చిత్రం ద్వారా నటుడిగా పరిచయయ్యారు. ఇటీవల విడుదలైన ‘శ్రీ శ్రీ’ చేస్తున్నప్పుడు భవిష్యత్తులో చాలా పెద్ద విలన్ అవుతావని కృష్ణగారు అభినందించారని ఆశిష్ చెబుతూ - ‘‘ముంబైలోని రోషన్ తనేజా ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ పొందా. మోడలింగ్ చేస్తుండగానే లఘు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. వాటిని అనిల్ రావిపూడిగారికి చూపిస్తే, ‘పటాస్’లో చాన్స్ ఇచ్చారు. ప్రస్తుతం తమిళంలో ఓ అగ్ర హీరోతో తెరకెక్కుతున్న చిత్రంలో చేస్తున్నా. విలన్‌గానే కొనసాగాలనుకుంటున్నా’’ అన్నారు. -
ఓ స్త్రీ కథ!
ఇంటికి దెయ్యం వస్తుందేమో అన్న భయంతో గోడల మీద ‘ఓ స్త్రీ రేపురా’ అని చాలా గ్రామాల్లో రాసి ఉంటుంది. ఈ అంశంతో రూపొందిన చిత్రం ‘ఓ స్త్రీ రేపు రా’. ఆశిష్ గాంధీ, వంశీకృష్ణ కొండూరి, దీక్షా పంత్, శృతీ మోల్ ముఖ్యతారలుగా స్వీయదర్శకత్వంలో అశోక్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని అశోక్ రెడ్డి చెప్పారు.