
నాటకం సినిమాతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు హీరో ఆశిష్ గాంధీ. ఇప్పుడు ఆశిష్ తన కొత్త చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్నారు. రుద్రంగి అనే భారీ యాక్షన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే అదే సమయంలో ఆశిష్ గాంధీ మాలీవుడ్‌ను కూడా పలకరించబోతున్నారు.
ఆశిష్ గాంధీ ఈసారి మలయాళ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పికాసో అనే చిత్రంతో కేరళ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. కేరళ మెగాస్టార్ మమ్ముట్టి చేతుల మీద ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక పోస్టర్ ఈ పోస్టర్‌లో ఆశిష్ గాంధీ ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. పోస్టర్ చూస్తుంటే డైరెక్టర్ సునిల్ కరియాట్టుకర దీన్ని భారీ యాక్షన్ జానర్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. ఈ సినిమాకు కేజీయఫ్ ఫేమ్ రవి బసూర్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment