Picasso
-
చిట్టి పికాసో: చిట్టి చేతులు అద్భుతం చేస్తున్నాయి!
పట్టుమని రెండేళ్లు కూడా నిండలేదు కుంచె పట్టకుని పెయింటింగ్‌ల గీసేస్తున్నాడ. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఈ చిట్టి చేతులు అద్భుతమైన చిత్రాలు చిత్రీస్తున్నాయి. పైగా అవి ఎంత ధర పలుకుతున్నాయో వింటే ఆశ్చర్యపోతారు. ఎవరా చిన్నారి? అంటే..?జర్మనీకి చెందిన రెండేళ్ల లారెండ్ స్క్వార్ట్ అనే చిన్నారి అద్భుతమైన చిత్రాలను సృష్టిస్తున్నాడు. వాటిలో పలు రకాల జంతువులపాలు కనిపిస్తాయి. ఆ చిన్నారి ఆర్ట్ ప్రయాణం గతేడాది సెలవులు నుంచి ప్రారంభమయ్యిందని తల్లి లిసా చెబుతోంది. తన కొడుకుకి రంగుల ప్రపంచం అంటే ఇష్టమని, ఆ అభిరుచి ఇలా కళాత్మక చిత్రాలను గీసేలా చేయించిందని అంటోంది ఆ చిన్నారి తల్లి. కొడుకు లారెంట్ పెయింటింగ్స్‌లో ఏనగులు, డైనోసార్లు, గుర్రాలు, వంటి గుర్తించదగిన జంతు బొమ్మల నైరూప్య రూపాల సమ్మేళ్లనం కనిపిస్తోందని చెబుతోంది. తన కొడుకు ప్రతిభకు ఫిదా అయ్యి.. అతడి పేరు మీదుగా పేయింటింగ్లను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయడం మొదలు పెట్టింది లిసా. ఈ వీడియోలకు విపరీతమైన జనాధరణ ఉండటమే గాక ఏకంగా రెండు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంతేగాదు వాటిని ఆన్లైన్లో విక్రయించడం మొదలు పెట్టింది ఆ చిన్నారి తల్లి లిసా. ఏప్రిల్‌లో జర్మనీలోని మ్యూనిచ్‌లో అతిపెద్ద ఆర్ట్ ఫెయిర్‌లో అరంగేట్రం చేసిన తర్వాత నుంచి తన కొడుకు పేయింటింగ్ కలెక్షన్లతో తమ ఇల్లు నిండిపోయింది అంటోంది. అంతేగాదు లారెంట్ ఎప్పుడెప్పుడు రెస్ తీసుకుంటాడు, ఏ సమయాల్లో చిత్రాలు గీస్తాడు వంటి వాటి గరించి కూడా సోషల్ మీడియలో షేర్ చేస్తుంది. అయితే లారెంట్.. ఆ ఆర్ట్ ఫెయిర్‌లో తను వేసిన పేయింటింగ్లను గుర్తుపట్టడం తమకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందని ఆ చిన్నారి తల్లి ఆనందంగా చెబుతోంది. ఇంతకీ ఈ చిట్టి బుడతడు లారెంట్ వేసిన పేయింటింగ్స్ ఎంతకీ అమ్ముడయ్యిందో వింటే షాకవ్వుతారు. సుమారు రూ. 5 లక్షలు పైనే పలుకుతాయట. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Laurent Schwarz (@laurents.art) (చదవండి: -
మమ్ముట్టి చేతుల మీదుగా ‘పికాసో’ ఫస్ట్ లుక్ పోస్టర్
నాటకం సినిమాతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు హీరో ఆశిష్ గాంధీ. ఇప్పుడు ఆశిష్ తన కొత్త చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్నారు. రుద్రంగి అనే భారీ యాక్షన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే అదే సమయంలో ఆశిష్ గాంధీ మాలీవుడ్‌ను కూడా పలకరించబోతున్నారు. ఆశిష్ గాంధీ ఈసారి మలయాళ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పికాసో అనే చిత్రంతో కేరళ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. కేరళ మెగాస్టార్ మమ్ముట్టి చేతుల మీద ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక పోస్టర్ ఈ పోస్టర్లో ఆశిష్ గాంధీ ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. పోస్టర్ చూస్తుంటే డైరెక్టర్ సునిల్ కరియాట్టుకర దీన్ని భారీ యాక్షన్ జానర్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. ఈ సినిమాకు కేజీయఫ్ ఫేమ్ రవి బసూర్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. -
పికాసో ఉంగరం విలువ ఎంతో తెలుసా..
లండన్: ప్రపంచ ప్రఖ్యాతి పొందిన చిత్రకారుడు పాబ్లో పికాసో తన స్ఫూర్తిదాత, ప్రేయసి, పెయింటర్, కవయిత్రి డోరా మార్కు ఆమె చిత్తరువుతో స్వయంగా చేసి ఇచ్చిన ఉంగరం వేలానికి వచ్చింది. మీరా ఎస్టేట్‌తో పాటు పికాసో ఉంగరాన్ని ఈ నెల 21న వేలం వేయనున్నట్లు సోత్‌బై వేలం సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ ఒక్క ఉంగరానికే ఐదు కోట్ల రూపాయలు వేలం పలుకుతుందని వారు అంచనా వేస్తున్నారు. 1930లో డోరా మార్ ఓ రూబీ ఉంగరాన్ని ధరించడం చూసి పికాసోకు కోపం వచ్చింది. రూబీ కోసం పెయింటింగ్‌ను అమ్మేశావా..? అంటూ పికాసో ప్రశ్నించడం ఆమెకు కోపం తెప్పించింది. వెంటనే ఆమె తన చేతికున్న ఉంగరాన్ని తీసి పక్కనే ఉన్న నదిలో పడేసింది. తప్పు చేశాననుకున్న పికాసో ఆమె చిత్తరువు ఉండేలా ఓ కళాత్మకమైన ఉంగరాన్ని తయారుచేసి ఆమెకు బహూకరించారు. ఆ ఉంగరం ఆమె చనిపోయే వరకు (1977) ఆమె వేలికే ఉంది. పికాసో అప్పటి సమకాలీన ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఈ ఉంగరాన్ని తయారు చేశారని సోత్‌బై వేలం సంస్థ నిర్వాహకులు అంటున్నారు. -
ఆ నేడు 10 సెప్టెంబర్, 1981
కళా శక్తి పికాసో గీసిన ‘గుయెర్నికా’ కేవలం పెయింటింగ్ అనడానికి మనసు రాదు. కళ అనేది విడిగా ఏకాంత దీవిలో ఉండదని, సమాజంతో పాటు నడుస్తుందని, సామాజిక చలనాలకు స్పందిస్తుందని నిరూపించిన చారిత్రక చిత్రరాజం... గుయెర్నికా. బూడిద, నలుపు, తెలుపు రంగుల్లోని ‘గుయెర్నికా’ యుద్ధవ్యతిరేక పెయింటింగ్‌గా చరిత్రలో నిలిచిపోయింది. స్పెయిన్‌లోని గుయెర్నికా పట్టణంపై 1937లో జర్మన్, ఇటలీ యుద్ధ విమానాలు జరిపిన బాంబు దాడికి నిరసనగా పికాసో గీసిన చిత్రం ఇది. ప్రపంచ యాత్ర చేసిన ‘గుయెర్నికా’ ఎంతో మందిని ఉత్తేజితులను చేసింది. యుద్ధ విధ్వంసాన్ని శక్తిమంతంగా ప్రతిబింబించింది. సుదీర్ఘకాలం ప్రవాసంలో ఉన్న ‘గుయెర్నికా’ 10 సెప్టెంబర్, 1981లో స్పెయిన్‌కు చేరుకుంది. -
ఈ వింత సౌందర్యం ఎక్కడిదో!
పికాసో అనే సుప్రసిద్ధ చిత్రకారుడు సముద్రతీరాన నుంచొని తైలవర్ణ చిత్రం తయారు చేస్తున్నాడు.సముద్రతీరానికి వాహ్యాళికై వచ్చే ప్రేమికులకు రోజా పుష్పాలమ్ముకునే ఒక తోటమాలి, పికాసో వేస్తున్న చిత్రాన్ని తిలకిస్తున్నాడు. కానీ ఆ చిత్రం అంతరార్థం ఏమిటో అతడికి అంతుబట్టలేదు. పికాసో తన చిత్రాన్ని పూర్తి చేసి దానికి తుది మెరుగులు దిద్దుతూ, యథాలాపంగా దాన్నొకసారి, ఒక్క అడుగు ఇవతలికి వేసి చూశాడు. ఇది తాను వేసిన చిత్రమేనా? అని ఎందుకో అనుమానం కలిగి ఆ చిత్రాన్ని మరింత పరీక్షగా చూశాడు అతడికే ఓ రకమైన సంభ్రమానందాలు కలిగినై. మరెవరో వేశారన్నట్టుంది కానీ, తాను వేసినట్లు కనిపించలేదు. నిజమైన కళాకారుడు, కవి ఇలాంటి అనుభూతినే పొందుతారు. చిత్రాన్ని ఎవరో తన చేతులతో గీయించినట్లు కనిపిస్తుందే కానీ, తానే స్వయంగా చిత్రించినట్లు కనిపించదు.తోటమాలి పికాసోను సమీపించి - ‘‘అయ్యా! దీనిని మీరు చిత్రిస్తున్నప్పుడు చూస్తూ ఉండిపోయాను. మీరు మీ పనిలో పూర్తిగా లీనమై ఉన్న సమయంలో మిమ్మల్ని పలకరించడం ఇష్టం లేక ఊరుకున్నాను. నేను అడుగుదామనుకున్న ప్రశ్న ఏమిటంటే ఈ తైలవర్ణ చిత్రం అంతరార్థమేమిటి?’’ అన్నాడు. పికాసో అతడి వంకకు తిరిగి ‘‘నా చిత్రానికి అర్థమేమిటని అడుగుతున్నావు. మరి నిన్ను, నీ బుట్టలోని ఆ చక్కని రోజా పుష్పాలకు అర్థమేమిటని అడిగితే నువ్వేమి చెప్తావు?’’ అన్నాడు పికాసో. ‘‘ఈ సౌందర్యమెక్కడిదో, ఏ లోకం నుండి దిగి వచ్చిందోనని ఆశ్చర్యపోతుంటాను. ఏళ్ల తరబడి ఈ ప్రశ్న నన్ను నేను వేసుకుంటూనే ఉన్నాను. వీటి సౌందర్యం వర్ణనాతీతమని నాకు తెలుసు. కానీ ఇది ఏమిటో, ఎక్కడిదో నాకు తెలియదు’’ అని గద్గద స్వరంతో అన్నాడు తోటమాలి. ‘‘నా పరిస్థితి కూడా అంతే బాబూ’’ అన్నాడు పికాసో. - నీలంరాజు లక్ష్మీప్రసాద్ ‘చరిత్రలో ఈ పేరు మిగిలేనా’ పుస్తకం నుంచి. -
పికాసో గారి దెయ్యం
మిస్టరీ పికాసో ప్రసిద్ధ చిత్రం ‘బాతింగ్ వుమన్ ఇన్ బ్లూరూమ్’లోని సౌందర్యం గురించి మాత్రమే మనకు తెలుసు. తాజా విశేషం ఏమిటంటే, అందులో ఒక ‘రహస్యం’ కూడా దాగి ఉంది. ఆ చిత్రంలో ఒక అపరిచితుడు దాగి ఉన్నాడు! ఇదేమి విచిత్రం... చిత్రంలో చిత్రమేమిటంటారా? అయితే అసలు విషయంలోకి వచ్చేద్దాం. ప్యారిస్‌లో 1901లో ‘బాతింగ్ ఉమన్...’ చిత్రాన్ని చిత్రించాడు పికాసో. ఇది ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. కట్ చేస్తే... వాషింగ్టన్ డి.సీలోని ‘ది ఫిలిప్స్ కలెక్షన్’ గ్యాలరీ సంరక్షకురాలు పెట్రికా ఫవెరో ‘బాతింగ్ వుమన్...’ చిత్రాన్ని లోతుగా పరిశీలించారు. సైనికులు ఉపయోగించే నైట్ విజన్, రిమోట్ సెన్సింగ్ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ప్రత్యేకమైన కెమెరాతో సూక్ష్మ పరిశీలన చేశారు. (మామూలు కంటికి కనిపించని దృశ్యాలను దీని ద్వారా చూడడం వీలవుతుంది) ఈ క్రమంలోనే... చిత్రం వెనుక ‘చిత్రం’ కనిపించి ఆమెను ఆశ్చర్యానికి గురి చేసింది. చేతికి ఉంగరాలు, గెడ్డంతో ‘అంతర్గత చిత్రం’లో ఉన్న వ్యక్తి ఎవరు? అది పికాసో సెల్ఫ్పోర్ట్రయిట్ అనేది కొందరి అంచనా. పికాసోకు సన్నిహితుడైన ఆర్ట్ డీలర్దని మరి కొందరి అంచనా... ఈ చర్చ నేపథ్యంలోనే కొందరు వింత వాదన ఒకటి వినిపించారు. అంతర్ చిత్రంలో కనిపించేది పికాసో దెయ్యమని, తాను ప్రేమించిన ప్రతి చిత్రంలోనూ ఇలా పికాసో దెయ్యమై కొలువుంటాడని! ఒక పోర్ట్రయిట్ వేయడం, ఒకవేళ అది నచ్చకపోతే దాని మీదే మరో పోర్ట్రయిట్ వేసి రీవర్క్ చేయడం అనేది పికాసో అలవాటు అని, పికాసో గీసిన ‘ఉమెన్ ఐరెనింగ్’ పెయింటింగ్‌లోనూ ‘హిడెన్ ఇమేజ్’ కనిపిస్తుందని కళాచరిత్రకారులు కాస్త గట్టిగా చెప్పేసరికి దెయ్యం కథలు తగ్గుముఖం పట్టాయి. -
కవిత్వమూ రాశాడు!
సందర్భం- నేడు పికాసో వర్ధంతి పికాసో మధ్యతరగతి కుటుంబంలో స్పెయిన్‌లోని మలగలో జన్మించాడు. పికాసో పూర్తి పేరు చాంతాడంత పొడుగ్గా ఉంటుంది. అందులో మొత్తం 23 పదాలు ఉంటాయి! పికాసో పలికిన తొలి పదం ‘లపిజ్’. ఈ స్పానిష్ పదానికి ‘పెన్సిల్’ అని అర్థం. పికాసో వాళ్ల నాన్న జోస్ బ్లస్కో...ఆర్టిస్ట్, ఆర్ట్ ప్రొఫెసర్, మ్యూజియం క్యురేటర్. పికాసోకు ఏడు సంవత్సరాల వయసు ఉన్నప్పటినుంచి చిత్రకళ గురించి చెప్పడం మొదలుపెట్టాడు బ్లస్కో. తొమ్మిది సంవత్సరాల వయసులో ‘లె పికడర్’ పేరుతో తొలి పెయింటింగ్ వేశాడు పికాసో. గమ్మత్తేమిటంటే పికాసో చదువులో ఉత్తమ విద్యార్థి కాదు. వర్ణచిత్రకారునిగా, శిల్పిగా, రంగస్థల రూపశిల్పిగా, ప్రింట్ మేకర్‌గా 20వ శతాబ్దానికి చెందిన ప్రభావశీలమైన కళాకారునిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పికాసోలో కవి కూడా ఉన్నాడు. 300 కవితలు రాశాడు. రెండుసార్లు పెళ్లి చేసుకున్నాడు. 8 ఏప్రిల్, 1973లో ఫ్రాన్స్‌లోని మౌగిన్స్లో చనిపోయాడు. పికాసో చివరి వాక్యాలు: ‘డ్రింక్ టు మీ, డ్రింక్ టు మై హెల్త్, యూ నో ఐ కాన్ట్ డ్రింక్ ఎనీ మోర్’.