కవిత్వమూ రాశాడు!
సందర్భం- నేడు పికాసో వర్ధంతి
పికాసో మధ్యతరగతి కుటుంబంలో స్పెయిన్‌లోని మలగలో జన్మించాడు.
పికాసో పూర్తి పేరు చాంతాడంత పొడుగ్గా ఉంటుంది. అందులో మొత్తం 23 పదాలు ఉంటాయి!
పికాసో పలికిన తొలి పదం ‘లపిజ్’. ఈ స్పానిష్ పదానికి ‘పెన్సిల్’ అని అర్థం.
పికాసో వాళ్ల నాన్న జోస్ బ్లస్కో...ఆర్టిస్ట్, ఆర్ట్ ప్రొఫెసర్, మ్యూజియం క్యురేటర్.
పికాసోకు ఏడు సంవత్సరాల వయసు ఉన్నప్పటినుంచి చిత్రకళ గురించి చెప్పడం మొదలుపెట్టాడు బ్లస్కో.
తొమ్మిది సంవత్సరాల వయసులో ‘లె పికడర్’ పేరుతో తొలి పెయింటింగ్ వేశాడు పికాసో.
గమ్మత్తేమిటంటే పికాసో చదువులో ఉత్తమ విద్యార్థి కాదు.
వర్ణచిత్రకారునిగా, శిల్పిగా, రంగస్థల రూపశిల్పిగా, ప్రింట్ మేకర్‌గా 20వ శతాబ్దానికి చెందిన ప్రభావశీలమైన కళాకారునిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
పికాసోలో కవి కూడా ఉన్నాడు. 300 కవితలు రాశాడు.
రెండుసార్లు పెళ్లి చేసుకున్నాడు.
8 ఏప్రిల్, 1973లో ఫ్రాన్స్‌లోని మౌగిన్స్‌లో చనిపోయాడు.
పికాసో చివరి వాక్యాలు: ‘డ్రింక్ టు మీ, డ్రింక్ టు మై హెల్త్, యూ నో ఐ కాన్ట్ డ్రింక్ ఎనీ మోర్’.