చిట్టి పికాసో: చిట్టి చేతులు అద్భుతం చేస్తున్నాయి! | Painting Of 2 Year Old Dubbed Mini Picasso | Sakshi
Sakshi News home page

చిట్టి పికాసో: రెండేళ్ల వయసులో పెయింటింగ్‌..ఎంతకు అమ్ముడయ్యాయంటే..

Published Thu, May 30 2024 4:36 PM | Last Updated on Thu, May 30 2024 4:57 PM

Painting Of 2 Year Old Dubbed Mini Picasso

పట్టుమని రెండేళ్లు కూడా నిండలేదు కుంచె పట్టకుని పెయింటింగ్‌ల గీసేస్తున్నాడ. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఈ చిట్టి చేతులు అద్భుతమైన చిత్రాలు చిత్రీస్తున్నాయి. పైగా అవి ఎంత ధర పలుకుతున్నాయో వింటే ఆశ్చర్యపోతారు. ఎవరా చిన్నారి? అంటే..?

జర్మనీకి చెందిన రెండేళ్ల లారెండ్‌ స్క్వార్ట్‌ అనే చిన్నారి అద్భుతమైన చిత్రాలను సృష్టిస్తున్నాడు. వాటిలో పలు రకాల జంతువులపాలు కనిపిస్తాయి. ఆ చిన్నారి ఆర్ట్‌ ప్రయాణం గతేడాది సెలవులు నుంచి ప్రారంభమయ్యిందని తల్లి లిసా చెబుతోంది. తన కొడుకుకి రంగుల ప్రపంచం అంటే ఇష్టమని, ఆ అభిరుచి ఇలా కళాత్మక చిత్రాలను గీసేలా చేయించిందని అంటోంది ఆ చిన్నారి తల్లి. కొడుకు లారెంట్‌ పెయింటింగ్స్‌లో ఏనగులు, డైనోసార్‌లు, గుర్రాలు, వంటి గుర్తించదగిన జంతు బొమ్మల నైరూప్య రూపాల సమ్మేళ్లనం కనిపిస్తోందని చెబుతోంది. 

తన కొడుకు ప్రతిభకు ఫిదా అ‍య్యి.. అతడి పేరు మీదుగా పేయింటింగ్‌లను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేయడం మొదలు పెట్టింది లిసా. ఈ వీడియోలకు విపరీతమైన జనాధరణ ఉండటమే గాక ఏకంగా రెండు లక్షలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. అంతేగాదు వాటిని ఆన్‌లైన్‌లో విక్రయించడం మొదలు పెట్టింది ఆ చిన్నారి తల్లి లిసా. ఏప్రిల్‌లో జర్మనీలోని మ్యూనిచ్‌లో అతిపెద్ద ఆర్ట్‌ ఫెయిర్‌లో అరంగేట్రం చేసిన తర్వాత నుంచి తన కొడుకు పేయింటింగ్‌ కలెక్షన్‌లతో తమ ఇల్లు నిండిపోయింది అంటోంది. 

అంతేగాదు లారెంట్‌ ఎప్పుడెప్పుడు రెస్‌ తీసుకుంటాడు, ఏ సమయాల్లో చిత్రాలు గీస్తాడు వంటి వాటి గరించి కూడా సోషల్‌ మీడియలో షేర్‌ చేస్తుంది. అయితే లారెంట్‌.. ఆ ఆర్ట్‌ ఫెయిర్‌లో తను వేసిన పేయింటింగ్‌లను గుర్తుపట్టడం తమకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందని ఆ చిన్నారి తల్లి ఆనందంగా చెబుతోంది. ఇంతకీ ఈ చిట్టి బుడతడు లారెంట్‌ వేసిన పేయింటింగ్స్‌ ఎంతకీ అమ్ముడయ్యిందో వింటే షాకవ్వుతారు. సుమారు రూ. 5 లక్షలు పైనే పలుకుతాయట. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. 

 

(చదవండి: 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement