బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 బల్మరల్ కోటలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర కథనాలు ఆమె మరణాంతరం వెలుగులోకి వస్తున్నాయి. అందులో భాగంగానే బ్రిటన్ రాణి వాడిపడేసి ఒక టీబ్యాగ్ గురించి ఒక కథనం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి రాజ కుటుంబికులుకు సంబంధించిన వస్తువులు బయటకు రావడం అనేది అసాథ్యం. అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ వారు ఉపయోగించే వస్తువులు గురించి బయట వ్యక్తులకు తెలిసి ఉండే అవకాశమే అరుదు. అలాంటిది ఆమె వాడిపడేసి టీ బ్యాగ్ ఏంటీ? అది నిజంగా ఆమె ఉపయోగించినదేనా అనే సందేహాలు రావడం సహజమే. కానీ ఔను! ఇది నిజం అని చెప్పే ఆధారాలను కూడా పొందుపరిచారు.
అసలేం జరిగిందంటే....70 ఏళ్లు సుదీర్ఘ పాలనతో రికార్డు సృష్టించిన క్విన్ ఎలిజబెత్ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక బ్రిటన్ ప్రజలు ఆమె పాలనను గుర్తు చేసుకుంటూ ఆమె ఉపయోగించని వస్తువులను విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ టీ బ్యాగ్ గురించి ఒక కథనం బయటపడింది.
1998లో విండ్సర్ కాజిల్ అనే వ్యక్తి దీన్ని అక్రమంగా బయటకు తరలించినట్లు సమాచారం. ఇది దివగంత క్వీన్ ఎలిజబెత్ 2 ఉపయోగించిన రెజీనా బ్రిటానియా టీ బ్యాగ్‌గా నివేదిక పేర్కొంది. ఇది ఇప్పుడు 'ఈబే' అనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆన్‌లైన్ విక్రయాల జాబితాలో ఉంచింది. ప్రస్తుతం ఈ వస్తువు ఆన్‌లైన్‌లో సుమారు రూ. 9 లక్షలకు విక్రయించబడింది.
ఈ టీ బ్యాగ్‌ని యూఎస్‌కి చెందిన జార్జియా కొనుగోలు చేశారు. ఈ టీబ్యాగ్‌కి 'రాయల్ ఆర్ట్‌ఫాక్ట్'తో పాటు 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సర్టిఫికేట్స్ ఆఫ్ అథెంటిసిటీ' జారీ చేసిన సర్టిఫికేట్ ఆఫ్ అథెంటిసిటీ ఉందని చెప్పారు. ఇది నిస్సందేహంగా బ్రిటన్ రాణి వినియోగించిన టీ బ్యాగేనని జార్జియా చెబుతున్నారు.
అలానే గతంలో 1985లో గ్రేట్ వెస్ట్రన్ రైల్వే 150వ వార్షికోత్సవం సందర్భంగా క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్ సంతకాలతో కూడిన ఒక పుస్తకం దాదాపు రూ. 19 లక్షలకు విక్రయించబడినట్లు ఈబే కామర్స్ సంస్థ పేర్కొంది.
(చదవండి: ఎలిజబెత్ 2 వివాహానికి ఖరీదైన్ డైమెండ్ నెక్లెస్‌ని గిఫ్ట్‌గా ఇచ్చిన నిజాం నవాబు)
Comments
Please login to add a commentAdd a comment