e bay
-
బ్రిటన్ రాణి వాడిపడేసిన టీబ్యాగ్ ఎంతకు అమ్ముడుపోయిందంటే....
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 బల్మరల్ కోటలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర కథనాలు ఆమె మరణాంతరం వెలుగులోకి వస్తున్నాయి. అందులో భాగంగానే బ్రిటన్ రాణి వాడిపడేసి ఒక టీబ్యాగ్ గురించి ఒక కథనం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి రాజ కుటుంబికులుకు సంబంధించిన వస్తువులు బయటకు రావడం అనేది అసాథ్యం. అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ వారు ఉపయోగించే వస్తువులు గురించి బయట వ్యక్తులకు తెలిసి ఉండే అవకాశమే అరుదు. అలాంటిది ఆమె వాడిపడేసి టీ బ్యాగ్ ఏంటీ? అది నిజంగా ఆమె ఉపయోగించినదేనా అనే సందేహాలు రావడం సహజమే. కానీ ఔను! ఇది నిజం అని చెప్పే ఆధారాలను కూడా పొందుపరిచారు. అసలేం జరిగిందంటే....70 ఏళ్లు సుదీర్ఘ పాలనతో రికార్డు సృష్టించిన క్విన్ ఎలిజబెత్ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక బ్రిటన్ ప్రజలు ఆమె పాలనను గుర్తు చేసుకుంటూ ఆమె ఉపయోగించని వస్తువులను విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ టీ బ్యాగ్ గురించి ఒక కథనం బయటపడింది. 1998లో విండ్సర్ కాజిల్ అనే వ్యక్తి దీన్ని అక్రమంగా బయటకు తరలించినట్లు సమాచారం. ఇది దివగంత క్వీన్ ఎలిజబెత్ 2 ఉపయోగించిన రెజీనా బ్రిటానియా టీ బ్యాగ్‌గా నివేదిక పేర్కొంది. ఇది ఇప్పుడు 'ఈబే' అనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆన్లైన్ విక్రయాల జాబితాలో ఉంచింది. ప్రస్తుతం ఈ వస్తువు ఆన్లైన్లో సుమారు రూ. 9 లక్షలకు విక్రయించబడింది. ఈ టీ బ్యాగ్‌ని యూఎస్‌కి చెందిన జార్జియా కొనుగోలు చేశారు. ఈ టీబ్యాగ్కి 'రాయల్ ఆర్ట్ఫాక్ట్'తో పాటు 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సర్టిఫికేట్స్ ఆఫ్ అథెంటిసిటీ' జారీ చేసిన సర్టిఫికేట్ ఆఫ్ అథెంటిసిటీ ఉందని చెప్పారు. ఇది నిస్సందేహంగా బ్రిటన్ రాణి వినియోగించిన టీ బ్యాగేనని జార్జియా చెబుతున్నారు. అలానే గతంలో 1985లో గ్రేట్ వెస్ట్రన్ రైల్వే 150వ వార్షికోత్సవం సందర్భంగా క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్ సంతకాలతో కూడిన ఒక పుస్తకం దాదాపు రూ. 19 లక్షలకు విక్రయించబడినట్లు ఈబే కామర్స్ సంస్థ పేర్కొంది. (చదవండి: ఎలిజబెత్ 2 వివాహానికి ఖరీదైన్ డైమెండ్ నెక్లెస్‌ని గిఫ్ట్‌గా ఇచ్చిన నిజాం నవాబు) -
ముప్ఫై వేల ఫోన్.. 65 లక్షలకు అమ్మేశాడు!!
ఇందులో ఎలాంటి జిమ్మిక్కు లేదు. పైగా మోసానికి పాల్పడలేదు. ఫోన్‌ను పద్ధతిగానే.. అదీ ఆన్లైన్లో అమ్మేశాడు. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రపంచంలో మొట్టమొదటి సీ టైప్ ఛార్జ్ సపోర్ట్ ఉన్న యాపిల్ ఫోన్ ఇదే కాబట్టి. కానీ, ఇది యాపిల్ కంపెనీ రూపొందించింది కాదు. ఓ యంగ్ స్టూడెంట్ డెవలప్ చేశాడు. యూకేకి చెందిన రోబోటిక్స్ ఇంజినీరింగ్ స్టూడెంట్ కెన్ పిల్లోనెల్ ‘ఐఫోన్ X’(64జీబీ, 3జీబీ ర్యామ్) ఫోన్‌ను చాలా శ్రమించి సీ టైప్ ఛార్జర్ పోర్ట్‌కు మార్చేశాడు. ఈ-బేలో ఈ ఫోన్ ఒరిజినల్ ధర 299 పౌండ్లు (401 యూఎస్ డాలర్లు.. మన కరెన్సీలో దాదాపు 30 వేల రూపాయలు). కానీ, కెన్ తాను మోడిఫై చేసిన ఐఫోన్‌ను ఏకంగా 86 వేల యూఎస్ డాలర్లకు అమ్మకానికి పెట్టగా.. అది అమ్ముడుపోయింది. అంటే కొన్ని పదుల రేట్లకు హాట్ కేక్‌లా పోయింది అది. మన కరెన్సీలో అది 65 లక్షల రూపాయలు అన్నమాట. అంతేకాదు కెన్ ఇప్పుడు వాటర్ ప్రూఫ్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే యూఎస్బీ-సీ ఐఫోన్‌ను మోడిఫై చేసే పనిలో బిజీగా ఉన్నాడు. యాపిల్‌కు తప్పని పరిస్థితి సాధారణంగా యాపిల్ ఐఫోన్లకు లైట్నింగ్ కనెక్టర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అయితే యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్ కోసం ఆమధ్య యూరోపియన్ కమిషన్ కొత్త చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం.. యాపిల్‌తో సహా ఏ మొబైల్ తయారీ కంపెనీ అయినా సరే యూఎస్బీ-సీ టైప్ పోర్టల్, టైప్ సీ ఛార్జర్లనే మార్కెట్లోకి తేవాలి. ఈ లెక్కన కొత్త ఫోన్‌గానీ, డివైజ్‌గానీ కొన్నప్పుడు మళ్లీ ఛార్జర్ ఇవ్వరు. వినియోగదారులు పాతదే వినియోగించుకోవాలి. ఒకవేళ పాడైతే మాత్రం అప్పుడు కొత్తది కొనుక్కునేందుకు వీలు కల్పిస్తారు. ఈ ఆదేశాలతో వచ్చే ఏడాది నుంచి సీ టైప్ పోర్ట్ సపోర్ట్ చేసేలా ఫోన్లను రీ డిజైన్ చేయబోతోంది యాపిల్. ఇక యూనివర్సల్ ఛార్జర్ల ద్వారా రీయూజింగ్ ద్వారా వేస్టేజ్ తగ్గించాలన్నది ఈయూ ముఖ్యోద్దేశం. పాత, ఉపయోగించని ఛార్జర్ల కారణంగా ప్రతీ ఏటా పదకొండు వేల టన్నుల కంటే ఎక్కువ చెత్త పేరుకుపోతోంది ఈయూలో!!. కిందటి ఏడాది 420 మిలియన్ మొబైల్ ఫోన్స్, ఇతరత్ర పోర్టబుల్ డివైజ్‌లు అమ్ముడు పోయాయి. ఈ లెక్కల ప్రకారం.. సగటున ప్రతీ యూజర్ దగ్గర మూడు ఛార్జర్లు ఉండగా.. వాటిలో రెండింటిని నిత్యం ఉపయోగిస్తున్నారు. యూరోపియన్ కమిషన్ నిర్ణయం వల్ల మొబైల్ యూజర్లు, ఛార్జర్ల మీద ఒక ఏడాదికి 250 మిలియన్ల యూరోలు(రెండు వేల కోట్ల రూపాయలపైనే) ఖర్చు గణనీయంగా తగ్గనుంది. చదవండి: ఇక కొత్త ఫోన్లకు ఛార్జర్లు ఇవ్వరంట! -
పన్ను చెల్లించలేదని కుక్కను వేలం వేశాడు
బెర్లిన్ : అప్పు చెల్లించకపోతే ఆస్తులను వేలం వేస్తారని తెలుసు కదా. ఇదే పద్దతిని ఫాలో అయ్యాడు ఓ పన్ను వసూలు అధికారి. అయితే ఇక్కడ అతడు వేలం వేసింది భూముల్ని, విలువైన ఆస్తుల్ని కాదు.. కుక్కను. అవును పెంపుడు కుక్కను వేలం వేసి వచ్చిన సొమ్మును పన్ను బకాయి కింద జమ చేసుకున్నాడు. ఈ విచిత్ర సంఘటన జర్మనీలో చోటు చేసుకుంది. అయితే బాధిత కుటుంబం గురించి పూర్తి వివరాలు తెలియలేదు. పన్ను బకాయి పడ్డ సదరు యజమాని గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విధులకు కూడా హాజరు కాలేదట. ఈ క్రమంలో అతడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్‌ను సకాలంలో కట్టలేకపోయాడు. కుక్క పన్నుతో సహా పలు ఇతర పన్నులు బకాయిపడ్డాడు. ఈ నేపథ్యంలో పన్ను వసూలు అధికారి ఆ కుటుంబానికి చెందిన పలు విలువైన ఆస్తులతో పాటు వారికి బహుమతిగా లభించిన పెంపుడు కుక్కను కూడా వేలం వేశాడు. ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన కుక్క కాస్తా దాదాపు రూ. 60 వేలకు అమ్ముడయ్యింది. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. సదరు అధికారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జంతు ప్రేమికులు. ‘బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం తగదు.. అతడు నిబంధనలను అతిక్రమించి మూగ జీవి పట్ల క్రూరంగా వ్యవహరించాడు. అతని మీద చర్యలు తీసుకోవాల’ని డిమాండ్ చేస్తున్నారు. పన్ను వసూలు కోసం కుక్కను అమ్మాడంటే.. మనుషుల్ని కూడా అమ్ముతాడనడంలో సందేహం లేదని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. -
రిలీజ్ కు ముందే.. ఆన్లైన్లో నోకియా 6!
పునరాగమనానికి నోకియా భారీ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ ఏడాదిలో తన ఫ్లాగ్ షిప్ ఫోన్ ను స్మార్ట్ ఫోన్ల మార్కెట్లోకి నోకియా ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. కాగా, గత కొంతకాలంగా నోకియా ప్రవేశపెడుతున్న నోకియా 6 ఫోన్‌కు సంబంధించిన లీక్‌లు నెట్టింట్లో హల్ చల్ చేశాయి. తాజాగా ఈ-కామర్స్ సైట్ ఈబే నోకియా 6 ఫోన్ ఆన్లైన్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. కాగా, నోకియా6ను నోకియా భారత్‌లో అధికారికంగా విడుదల చేయలేదు. భారత్‌లో నోకియా ఫోన్ల అమ్మకందారు హెచ్ఎండీ గ్లోబల్ కూడా మార్కెట్లో నోకియా 6ను విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేయలేదు. ప్రస్తుతం చైనాలో మాత్రమే నోకియా6 అధికారికంగా అందుబాటులో ఉంది. ఈబే సైట్లో నోకియా 6 పేరిట అందుబాటులో ఉన్న ఫోన్ ధరను రూ.32,440గా పేర్కొంది. కాగా, చైనాలో ఈ ఫోన్ ధర రూ.17 వేలు మాత్రమే. ఇదిలావుండగా ఈ నెలాఖరులో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్(ఎండబ్ల్యూసీ)లో నోకియాకు సంబంధించిన రైట్స్‌ను ఫిన్నిష్ కంపెనీ దక్కించుకుంది. (చదవండి: నోకియా 6జీబీ ర్యామ్ మొబైల్: ధర ఎంతో తెలుసా?) -
భార్యను 'ఈబే'లో అమ్మకానికి పెట్టాడు
లండన్: తన భార్యకు జాలి, దయ లాంటివి ఏవీ లేవంటూ.. ఓ వ్యక్తి ఆమెను ఈబే లో అమ్మకానికి పెట్టాడు. యూకేలోని యార్క్ షైర్ కు చెందిన సిమన్ ఓ కేన్, లియాండ్రా భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వృత్తిపరంగా టెలికాం ఇంజనీర్ గా పనిచేసే సిమన్ అలసిపోయి ఇంటికి వస్తుంటాడు. ఆ సమయంలో తన భార్య కనీసం తనపై జాలి కూడా చూపడం లేదని అమ్మకానికి ఉంచిన పోస్టులో వాపోయాడు. జాలి, దయ, కరుణ లేని భార్య తనకు వద్దని, అందుకే ఆమెను అమ్మకానికి పెడుతున్నట్లు ఈబేలో పోస్టు పెట్టాడు. తన భార్య చాలా అందంగా ఉంటుందని, వంట కూడా బాగా చేస్తుందని పోస్టులో పేర్కొన్నాడు. కానీ వంట సరిగ్గా కుదరనప్పుడు ఆసుపత్రికి వెళ్లాల్సివస్తుందని చెప్పాడు. సిమన్ చేసిన పోస్టుకు 68,880పౌండ్లకు లియాండ్రాను కొనడానికి సిద్ధమని ఓ వ్యక్తి బిడ్ చేశాడు. పోస్టు గురించి తర్వాతి రోజు లియాండ్రాకు తెలియడంతో ఆమె తనను చంపాలని చూస్తోందని సిమన్ చెప్పాడు. -
వాచీల కొనుగోళ్లలో వరంగల్ టాప్
అంతర్జాతీయ బ్రాండ్ల వాటా 65% ఈ-బే రిటైల్ ఎక్స్పోర్ట్ బిజినెస్ హెడ్ నవీన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఆన్లైన్లో వాచీలను కొనుగోలు చేయడంలో చిన్న నగరాల హవా నడుస్తోంది. ఈ-కామర్స్ కంపెనీ ఈ-బే వాచీల అమ్మకాల్లో టాప్-5 రాష్ట్రాల్లో మెట్రో నగరం ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. రాష్ట్రాలవారీగా చూస్తే కర్ణాటకలో హసన్, గుల్బర్గా, రాయిచూర్, మహారాష్ట్రలో లాతూర్, కరద్, సాంగ్లి, ఢిల్లీలో నోయిడా, గుర్గావ్, ఫరీదాబాద్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్, కాకినాడ, నర్సాపూర్, తమిళనాడులో నాగర్‌కోయిల్, సెంబాకం, దిండిగల్లు ముందు వరుసలో ఉన్నాయి. ఈ-బే మొత్తం వాచీల అమ్మకాల్లో వీటి వాటా 60 శాతంగా ఉందని కంపెనీ రిటైల్ ఎక్స్‌పోర్ట్స్, లైఫ్‌స్టైల్ విభాగం హెడ్ నవీన్ మిస్ట్రీ తెలిపారు. ఆన్లైన్లో అతిపెద్ద వాచ్మాల్ను ప్రారంభించిన సందర్భంగా గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. టాప్‌లో అర్మానీ.. కంపెనీ విక్రయిస్తున్న వాచీల్లో అంతర్జాతీయ బ్రాండ్లు 65 శాతం కైవసం చేసుకున్నాయి. టాప్-5 బ్రాండ్లలో అర్మానీ, ఫాసిల్, గెస్, టైటాన్, ఫాస్ట్ట్రాక్లు ఉన్నాయి. వాచ్ పరిశ్రమ భారత్‌లో 10 శాతం వార్షిక వృద్ధి రేటుతో రూ.5,250 కోట్లుంది. ఇందులో ఆన్లైన్ వాటా 35 శాతం వృద్ధితో రూ.200 కోట్లుంది. ఈ-బే 21 శాతం వాటాను దక్కించుకుందని కంపెనీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ గిరీష్ హురియా తెలిపారు. ‘ఈ-బే సైట్లో వాచీలకు పురుషులు సగటున రూ.6,300, మహిళా కస్టమర్లు రూ.3,150 ఖర్చు చేస్తున్నారు. 44 శాతం కస్టమర్లు మొబైల్ ద్వారా ఆర్డర్లు ఇస్తున్నారు. కనీసం 30 శాతం డిస్కౌంట్‌తో 200 బ్రాండ్లలో 65 వేలకుపైగా మోడళ్లను వాచ్మాల్లో అందుబాటులోకి తెచ్చాం’ అని తెలిపారు. ఈ-బే మొత్తం ఆన్లైన్ కస్టమర్లలో 43 శాతం మంది మహిళలు ఉంటున్నారని చెప్పారు.