రిలీజ్ కు ముందే.. ఆన్‌లైన్‌లో నోకియా 6!
రిలీజ్ కు ముందే.. ఆన్‌లైన్‌లో నోకియా 6!
Published Wed, Feb 15 2017 11:19 AM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM
పునరాగమనానికి నోకియా భారీ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ ఏడాదిలో తన ఫ్లాగ్ షిప్ ఫోన్ ను స్మార్ట్ ఫోన్ల మార్కెట్లోకి నోకియా ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. కాగా, గత కొంతకాలంగా నోకియా ప్రవేశపెడుతున్న నోకియా 6 ఫోన్‌కు సంబంధించిన లీక్‌లు నెట్టింట్లో హల్ చల్ చేశాయి. తాజాగా ఈ-కామర్స్ సైట్ ఈబే నోకియా 6 ఫోన్ ఆన్‌లైన్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. కాగా, నోకియా6ను నోకియా భారత్‌లో అధికారికంగా విడుదల చేయలేదు.
భారత్‌లో నోకియా ఫోన్ల అమ్మకందారు హెచ్‌ఎండీ గ్లోబల్ కూడా మార్కెట్లో నోకియా 6ను విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేయలేదు. ప్రస్తుతం చైనాలో మాత్రమే నోకియా6 అధికారికంగా అందుబాటులో ఉంది. ఈబే సైట్‌లో నోకియా 6 పేరిట అందుబాటులో ఉన్న ఫోన్ ధరను రూ.32,440గా పేర్కొంది. కాగా, చైనాలో ఈ ఫోన్ ధర రూ.17 వేలు మాత్రమే. ఇదిలావుండగా ఈ నెలాఖరులో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్(ఎండబ్ల్యూసీ)లో నోకియాకు సంబంధించిన రైట్స్‌ను ఫిన్నిష్ కంపెనీ దక్కించుకుంది. (చదవండి: నోకియా 6జీబీ ర్యామ్ మొబైల్: ధర ఎంతో తెలుసా?)
Advertisement
Advertisement