ముప్ఫై వేల ఫోన్‌.. 65 లక్షలకు అమ్మేశాడు!! | UK Engineer builds iPhone With USB C Support Sold for Huge Price | Sakshi
Sakshi News home page

‘హైబ్రిడ్‌ ఫోన్‌.. ఒక్కటే పీస్‌’ దిమ్మతిరిగే రేటు! ఎందుకంటే..

Published Sat, Nov 13 2021 8:42 AM | Last Updated on Sat, Nov 13 2021 8:44 AM

UK Engineer builds iPhone With USB C Support Sold for Huge Price - Sakshi

ఇందులో ఎలాంటి జిమ్మిక్కు లేదు.  పైగా మోసానికి పాల్పడలేదు. ఫోన్‌ను పద్ధతిగానే.. అదీ ఆన్‌లైన్‌లో అమ్మేశాడు. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రపంచంలో మొట్టమొదటి సీ టైప్‌ ఛార్జ్‌ సపోర్ట్‌ ఉన్న యాపిల్‌ ఫోన్‌ ఇదే కాబట్టి. కానీ, ఇది యాపిల్‌ కంపెనీ రూపొందించింది కాదు.  ఓ యంగ్‌ స్టూడెంట్‌ డెవలప్‌ చేశాడు. 


యూకేకి చెందిన రోబోటిక్స్‌ ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌ కెన్‌ పిల్లోనెల్‌ ‘ఐఫోన్‌ X’(64జీబీ, 3జీబీ ర్యామ్‌) ఫోన్‌ను చాలా శ్రమించి సీ టైప్‌ ఛార్జర్‌ పోర్ట్‌కు మార్చేశాడు.  ఈ-బేలో ఈ ఫోన్‌ ఒరిజినల్‌ ధర 299 పౌండ్లు (401 యూఎస్‌ డాలర్లు.. మన కరెన్సీలో దాదాపు 30 వేల రూపాయలు). కానీ, కెన్‌ తాను మోడిఫై చేసిన ఐఫోన్‌ను ఏకంగా 86 వేల యూఎస్‌ డాలర్లకు అమ్మకానికి పెట్టగా.. అది అమ్ముడుపోయింది. అంటే కొన్ని పదుల రేట్లకు హాట్‌ కేక్‌లా పోయింది అది. మన కరెన్సీలో అది 65 లక్షల రూపాయలు అన్నమాట. అంతేకాదు కెన్‌ ఇప్పుడు వాటర్‌ ప్రూఫ్‌తో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేసే యూఎస్‌బీ-సీ ఐఫోన్‌ను మోడిఫై చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

యాపిల్‌కు తప్పని పరిస్థితి
సాధారణంగా యాపిల్‌ ఐఫోన్లకు లైట్నింగ్‌ కనెక్టర్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంటుంది. అయితే యూనివర్సల్‌ ఛార్జింగ్‌ సొల్యూషన్‌ కోసం ఆమధ్య యూరోపియన్‌ కమిషన్‌ కొత్త చట్టాన్ని రూపొందించింది.  దీని ప్రకారం.. యాపిల్‌తో సహా ఏ మొబైల్‌ తయారీ కంపెనీ అయినా సరే యూఎస్‌బీ-సీ టైప్‌ పోర్టల్‌,  టైప్‌ సీ ఛార్జర్లనే మార్కెట్‌లోకి తేవాలి. ఈ లెక్కన కొత్త ఫోన్‌గానీ, డివైజ్‌గానీ కొన్నప్పుడు మళ్లీ ఛార్జర్‌ ఇవ్వరు. వినియోగదారులు పాతదే వినియోగించుకోవాలి. ఒకవేళ పాడైతే మాత్రం అప్పుడు కొత్తది కొనుక్కునేందుకు వీలు కల్పిస్తారు. ఈ ఆదేశాలతో వచ్చే ఏడాది నుంచి సీ టైప్‌ పోర్ట్‌ సపోర్ట్‌ చేసేలా ఫోన్లను రీ డిజైన్‌ చేయబోతోంది యాపిల్‌.

ఇక యూనివర్సల్‌ ఛార్జర్‌ల ద్వారా రీయూజింగ్‌ ద్వారా వేస్టేజ్‌ తగ్గించాలన్నది ఈయూ ముఖ్యోద్దేశం.  పాత, ఉపయోగించని ఛార్జర్ల కారణంగా ప్రతీ ఏటా పదకొండు వేల టన్నుల కంటే ఎక్కువ చెత్త పేరుకుపోతోంది ఈయూలో!!. కిందటి ఏడాది 420 మిలియన్‌ మొబైల్‌ ఫోన్స్‌, ఇతరత్ర పోర్టబుల్‌ డివైజ్‌లు అమ్ముడు పోయాయి. ఈ లెక్కల ప్రకారం.. సగటున ప్రతీ యూజర్‌ దగ్గర మూడు ఛార్జర్లు ఉండగా.. వాటిలో రెండింటిని నిత్యం ఉపయోగిస్తున్నారు. యూరోపియన్‌ కమిషన్‌ నిర్ణయం వల్ల మొబైల్‌ యూజర్లు, ఛార్జర్‌ల మీద ఒక ఏడాదికి 250 మిలియన్ల యూరోలు(రెండు వేల కోట్ల రూపాయలపైనే) ఖర్చు గణనీయంగా తగ్గనుంది.

చదవండి: ఇక కొత్త ఫోన్లకు ఛార్జర్లు ఇవ్వరంట!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement