న్యూఢిల్లీ: యూరోపియన్ యూనియన్–ఇండియా ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ అంగీకారం తెలిపారు. భారత్‌లో పర్యటిస్తున్న ఉర్సులా సోమవారం మోదీతో భేటీ అయ్యారు. వాణిజ్యం, టెక్నాలజీ, భద్రత వంటి అంశాల్లో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించుకొనేందుకు ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసుకోవాలని వారు నిర్ణయించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కూడా ఉర్సులా భేటీ అయ్యారు. భారత్, ఈయూ సంబంధాలు మరింత బలపడాలని రాష్ట్రపతి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తర్వాత రైసినా డైలాగ్ కార్యక్రమంలో ఉర్సులా మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వ్యూహాత్మక వైఫల్యంగా మారుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment