పదహారేళ్ల తర్వాత... | Mohanlal and Mammootty reunite with actor Kunchacko Boban | Sakshi
Sakshi News home page

పదహారేళ్ల తర్వాత...

Published Wed, Nov 20 2024 12:21 AM | Last Updated on Wed, Nov 20 2024 12:21 AM

Mohanlal and Mammootty reunite with actor Kunchacko Boban

మోహన్‌లాల్, మమ్ముట్టి కాంబినేషన్‌లో దాదాపు యాభైకి పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే 2008లో రిలీజైన ‘ట్వంటీ 20’ చిత్రం తర్వాత మోహన్‌లాల్, మమ్ముట్టి కలిసి ఓ పుల్‌ లెంగ్త్‌ సినిమా చేయలేదు. పదహారేళ్ల తర్వాత మోహన్‌లాల్, మమ్ముట్టి ఓ సినిమాలో నటిస్తున్నారు. మలయాళంలో ‘మాలిక్, టేకాఫ్, సీ యూ సూన్‌’ వంటి సినిమాలతో దర్శకుడిగా పేరు సంపాదించుకున్న మహేశ్‌ నారాయణన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కుంచాకో బోబన్‌ ఓ కీలకపాత్రలో నటిస్తుండగా, మరో కీలకపాత్రలో ఫాహద్‌ ఫాజిల్‌ నటించనున్నట్లు సమాచారం. 

ఈ సినిమా చిత్రీకరణ శ్రీలంకలో మొదలైంది. మమ్ముట్టి, మోహన్‌లాల్, కుంచాకోల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... మమ్ముట్టి హీరోగా నటించిన ‘కాదల్‌ కదన్ను ఒరు మాతుకుట్టి’ (2013) చిత్రంలో మోహన్‌లాల్‌ నటించారు. కానీ ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ది అతిథిపాత్ర. ఈ ఇద్దరు స్టార్స్‌ కలిసి చాలా గ్యాప్‌ తర్వాత చేస్తున్న తాజా ఫుల్‌ లెంగ్త్‌ చిత్రంపై అంచనాలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement