ఇండస్ట్రీ అంతా ఒక్క వెబ్ సిరీస్‪‌‌లో... ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Manorathangal Series Trailer OTT Streaming Details | Sakshi
Sakshi News home page

Manorathangal: ఇండస్ట్రీ అంతా ఒకే వెబ్ సిరీస్‌లో నటిస్తే.. ఇది అదే

Jul 16 2024 9:04 AM | Updated on Jul 16 2024 9:46 AM

Manorathangal Series Trailer OTT Streaming Details

ఓటీటీలో క్రేజీ అంటే క్రేజీ వెబ్ సిరీస్ రిలీజ్‌కి రెడీ అయిపోయింది. ఇది ఎందుకు అంతలా స్పెషల్ అంటే.. ఏదైనా సినిమాలో గానీ సిరీస్‌లో మహా అయితే ఒకరిద్దరు స్టార్స్ నటిస్తారు. కానీ దీని కోసం మాత్రం దాదాపుగా ఇండస్ట్రీనే కదిలొచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సిరీస్‌లో అంతమంది స్టార్స్ ఉన్నారు. అసలు దీని సంగతేంటి? తాజాగా రిలీజైన ట్రైలర్ ఎలా ఉంది?

(ఇదీ చదవండి: మ్యూజీషియన్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)

ఈ ఏడాది ఏ ఇండస్ట్రీకి లేనంత సక్సెస్ రేట్ మలయాళ చిత్రపరిశ్రమ దక్కించుకుంది. మంజుమ్మల్ బాయ్స్, ఆవేశం, భ్రమయుగం, ప్రేమలు.. ఇలా వరసపెట్టి సినిమాలు హిట్ కొట్టాయి. వందల కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్నాయి. స్వతహాగా మలయాళ సినిమాల్ని ప్రేక్షకులు బాగా ఇష్టపడుతుంటారు. ఇప్పుడు ఈ భాషలోని స్టార్ హీరోలైన మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ పాజిల్.. ఇలా టాప్ సెలబ్రిటీలు చాలామంది 'మనోరథంగల్' అనే వెబ్ సిరీస్ చేశారు.

రెండేళ్లుగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సిరీస్.. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆగస్టు 15 నుంచి జీ5 ఓటీటీలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళ స్టార్ రైటర్ ఎమ్‌టీ వాసుదేవర్ నాయర్ రాసిన స్టోరీతో ఈ సిరీస్ తీశారు. 9 భాగాల అంథాలజీని 8 మంది డైరెక్టర్స్ తెరకెక్కించారు. ఇందులో మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, కమల్ హాసన్, బిజు మేనన్, పార్వతి తిరువత్తు, అపర్ణ బాలమురళి, అసిఫ్ అలీ, సిద్ధిఖీ.. ఇలా దాదాపు టాప్ సెలబ్రిటీలు అందరూ నటించడం విశేషం.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement