![Mohanlal Turns As Director For Barozz Movie - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/25/mohanlal%2C%20mammotty.jpg.webp?itok=wFX2zCyt)
యాక్టర్ మోహన్ లాల్ మెగాఫోన్ పట్టి డైరెక్టర్‌గా మారారు. మోహన్ లాల్ దర్శకత్వం వహిస్తున్న ‘బరోజ్: గార్డియన్ ఆఫ్ డీ గామా ట్రెజర్’ సినిమా ప్రారంభోత్సవం కొచ్చిలో జరిగింది. మలయాళ దర్శకుడు, నటుడు జిజో పున్నూస్ రచించిన ‘బరోజ్: గార్డియన్ ఆఫ్ డీ గామా ట్రెజర్’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో మోహన్ లాల్, పృథ్వీరాజ్, స్పానిష్ యాక్టర్లు పాజ్ వేగా, రాఫెల్ అమర్గో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘‘జీవితం నన్ను నటుడిని చేసింది. ఈ ప్రయాణంలో సినిమాయే నా జీవితం.. నా జీవనాధారం అని అర్థమైంది. నటుడిగా అద్భుతమైన ప్రయాణం చేసిన నేను ఇప్పుడు దర్శకుడిగా మరో ప్రయాణాన్ని మొదలుపెట్టాను’’ అని పేర్కొన్నారు మోహన్ లాల్. ఈ సినిమా ప్రారంభోత్సవంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment