Udumbu Movie Telugu Remake Title As Rambo Deets Here - Sakshi
Sakshi News home page

‘ర్యాంబో’గా వస్తున్న ‘ఉడుంబు’

Published Fri, Mar 18 2022 2:30 PM | Last Updated on Fri, Mar 18 2022 4:17 PM

Udumbu Movie Telugu Remake Title As Rambo - Sakshi

Rambo Movie First Look: మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ ‘ఉడుంబు’ తెలుగు రీమేక్ రైట్స్ ప్రముఖ నిర్మాత గంగపట్నం శ్రీధర్ సొంతం చేసుకోవడం తెలిసిందే.. టి.సి.ఎస్.రెడ్డి సమర్పణలో శ్రీవిఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి "ర్యాంబో" అనే టైటిల్ పెట్టారు. యువ కథానాయకుడు ఆశిష్ గాంధీ టైటిల్ పాత్ర పోషించనున్నాడు.

దర్శకత్వ శాఖలో విశేష అనుభవం కలిగిన యువప్రతిభాశాలి "రత్నాకరం అనిల్ రాజు" ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. తమ తమ శాఖలలో నిష్ణాతులైన స్టార్ టెక్నిషియన్స్ "ర్యాంబో" చిత్రానికి పని చేస్తున్నారు.  హోలీ పండుగను పురస్కరించుకుని "ర్యాంబో" ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మార్చి 28 నుంచి సెట్స్ కు వెళ్లనున్న ఈ క్రేజీ చిత్రానికి ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement