ashish gandhi and chitra shukla uniki movie poster released - Sakshi
Sakshi News home page

‘ఉనికి’ కోసం తపన

Published Wed, Feb 3 2021 9:04 AM | Last Updated on Wed, Feb 3 2021 1:36 PM

Ashish Gandhi And Chitra Shukla Uniki Movie Poster Released - Sakshi

‘నాటకం’ ఫేమ్‌ ఆశిష్‌ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్‌ చిత్ర శుక్లా జంటగా రాజ్‌కుమార్‌ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉనికి’. బాబీ ఏడిద, రాజేష్‌ బొబ్బూరి నిర్మాతలు. షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమాకి ‘ఉనికి’ అనే టైటిల్‌ని ఖరారు చేసి, పోస్టర్‌ని విడుదల చేశారు.

బాబీ ఏడిద, రాజేష్‌ బొబ్బూరి మాట్లాడుతూ.. ‘‘ప్రతి మనిషి తన ఉనికి చాటుకోవడం కోసం తపిస్తాడు. ముఖ్యంగా అననుకూల పరిస్థితులు, అవరోధాలు ఎదురైనప్పుడు ఇంకా ఎక్కువగా ఉనికి కోసం తపిస్తాడు. ఓ మధ్య తరగతి యువతికి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తన ఉనికి నిలుపుకోవడం కోసం ఎలా పోరాడింది? అనేది ఈ చిత్రం ప్రధాన కథాంశం. రాజమండ్రి సబ్‌ కలెక్టర్‌ అంజలి అనుపమను చూసినప్పుడు కలిగిన ఆలోచనతో ఈ స్క్రిప్ట్‌ తయారు చేశాం. ఈ వేసవికి సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పి.ఆర్‌ (పెద్దపల్లి రోహిత్‌), సహనిర్మాత: అడ్డాల రాజేశ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement