Chitra Shukla
-
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ చిత్ర శుక్ల.. ఈమె ఎవరంటే? (ఫోటోలు)
-
బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్
తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన చిత్రా శుక్లా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. నాలుగు రోజుల క్రితం అంటే సెప్టెంబరు 30న రాత్రి 9:31 నిమిషాలకు బిడ్డ పుట్టాడని చెప్పారు. ఇదే ముహూర్తానికి తమకు పెళ్లి జరిగిందని, ఇప్పుడు బాబు పుట్టడం మరింత స్పెషల్ అని తన సంతోషాన్ని వ్యక్తపరిచింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)ఇండోర్‌కి చెందిన చిత్రా శుక్లా.. 2014 నుంచి సినిమాలు చేస్తోంది. బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్‌గా ఈమె కెరీర్ మొదలైంది. 2017లో 'మా అబ్బాయి' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయింది. అలా రంగుల రాట్నం, సిల్లీ ఫెలోస్, తెల్లవారితే గురువారం, పక్కా కమర్షియల్, ఉనికి, హంట్, మస్తే షేడ్స్ ఉన్నాయిరా, కలియుగ పట్టణంలో అనే చిత్రాల్లో యాక్ట్ చేసింది.వ్యక్తిగత విషయానికొస్తే గతేడాది డిసెంబరులో వైభవ్ ఉపాధ్యాయ అనే పోలీస్ అధికారిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మగబిడ్డని ప్రసవించింది. తన ఆనందాన్ని తెలియజేస్తూ కొడుకు ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మీరు కూడా వాటిని చూసేయండి.(ఇదీ చదవండి: Kali 2024 Movie Review: 'కలి' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Chitra Shukla Upadhyay (@chitrashuklaofficial) -
తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. గతేడాది పోలీస్ ఆఫీసర్‌తో పెళ్లి (ఫోటోలు)
-
హీరోగా మగధీర విలన్.. టీజర్ రిలీజ్ చేసిన రాజమౌళి!
రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం మగధీర, రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో విలన్ పాత్రలో దేవ్‌గిల్ ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం అహో విక్రమార్క. ఈ చిత్రానికి పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. 'ఇది అసుర రాజ్యం.. ఇక్కడికీ ఎవడైనా రావడమే తప్ప.. ప్రాణాలతో తిరిగిపోవడం ఉండదు' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. తాజాగా విడుదలైన ఈ టీజర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో దేవ్ గిల్ పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. 'పోలీస్ అంటే సింహం కాదురా.. సింహాన్ని కూడా వేటాడే వేటగాడు' అనే డైలాగ్ ఈ మూవీపై అంచనాలు పెంచుతోంది. అసుర రాజ్యం పేరిట అమాయకులను హింసించే వారిని హీరో ఏం చేశాడనేది కథ. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు. Forever grateful to you @ssrajamouli garu 🙏🏼❤️#AhoVikramaarkaTeaser out now! - https://t.co/WIxYwyGxu7#AhoVikramaarka @iamdevsinghgill @ChitraShuklaOff @WriterPravin @tejaswwini @SayajiShinde @BithiriSathi_ @prabhakalakeya @petatrikoti pic.twitter.com/V5bw3GKavM— Dev Gill (@iamdevsinghgill) June 20, 2024 -
Chitra-Vaibhav: పోలీస్తో హీరోయిన్ చిత్రశుక్లా పెళ్లి (ఫొటోలు)
-
తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్స్పెక్టర్!
మరో తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ అయిపోయింది. అయితే బిజినెస్‌మ్యాన్ లేదా యాక్టర్‌ని కాకుండా ఓ పోలీస్ అధికారితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో వివాహం జరగనుండగా, ప్రస్తుతం ఈ ఇద్దరూ పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. ఇంతకీ ఎవరా బ్యూటీ? పెళ్లెప్పుడు? (ఇదీ చదవండి: Bigg Boss 7: ఎలిమినేషన్ హింట్ ఇచ్చేసిన బిగ్‌బాస్.. ఆ ఇద్దరిలో ఒకరు ఔట్?) మధ్యప్రదేశ్‌కి చెందిన చిత్రశుక్లా.. 2014లో 'ఛల్ భాగ్' అనే హిందీ మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఈ సినిమాతో పాటు 'పులి', 'నేను శైలజ' చిత్రాల్లో సైడ్ డ్యాన్సర్‌గా కనిపించింది. 2016లో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన 'మా అబ్బాయి' మూవీతో హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత తెలుగులో 'రంగుల రాట్నం', సిల్లీ ఫెలోస్, తెల్లవారితో గురువారం, పక్కా కమర్షియల్, ఉనికి, హంట్ తదితర చిత్రాల్లో నటించింది. కాకపోతే ఈమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. మరోవైపు కొన్నాళ్ల ముందు నుంచే వైభవ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు పోస్ట్ చేస్తూ వచ్చింది. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ డిసెంబరు 8న పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రస్తుతం మెహందీ, హల్దీ సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఈ క్రమంలోనే చిత్రశుక్లా.. కాబోయే భర్త వైభవ్‌తో ఉన్న ఫొటోలని పోస్ట్ చేసింది. ఇకపోతే వైభవ్.. మధ్యప్రదేశ్‌లో పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతానికైతే చిత్రశుక్లా చేతిలో కొత్త సినిమాలు ఏం లేవు. అంటే ఈ పెళ్లి తర్వాత బహుశా నటనకు టాటా చెప్పేయొచ్చేమో అనిపిస్తుంది. (ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) View this post on Instagram A post shared by Chitra Shukla (@chitrashuklaofficial) View this post on Instagram A post shared by Chitra Shukla (@chitrashuklaofficial) -
పోలీస్ ఆఫీసర్‌తో ప్రేమలో పడిన టాలీవుడ్ హీరోయిన్
సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతుంటారు. ముఖ్యంగా వాళ్ల సినిమా విశేషాల కంటే పర్సనల్ లైఫ్‌పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక హీరో,హీరోయిన్ల ప్రేమ, పెళ్లిళ్లలకు సంబంధించిన వార్తలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ ప్రేమలో పడిపోయిందనే గాసిప్ జోరుగా వినిపిస్తుంది. 'మా అబ్బాయి' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ చిత్రా శుక్లా. ఆ తర్వాత రాజ్ తరుణ్‌తో ‘రంగుల రాట్నం’, అల్లరి నరేష్ తో ‘సిల్లీ ఫెలోస్’, ‘తెల్లవారితే గురువారం’వంటి పలు సినిమాల్లో నటించిన మెప్పించింది. లేటెస్ట్గా గీతసాక్షిగా అనే సినిమాలోనూ నటించింది. తాజాగా ఆమె ప్రేమ వ్యవహారం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. వైభవ్ ఉపాధ్యాయ్ అనే పోలీస్ ఆఫీసర్‌తో చిత్రా కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతుందట. చదవండి: మెగా హీరోకు పార్టీ ఇచ్చిన మంచు మనోజ్ తాజాగా ఆమె బర్త్‌డే సందర్భంగా వైభవ్ షేర్ చేసిన పోస్ట్ ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూరుస్తుంది. హ్యాపీ బర్త్‌డే స్వీట్హార్ట్ అంటూ వైభవ్ పోస్ట్‌చేయడం, దానికి చిత్రా థ్యాంక్యూ నా వైభవ్ అంటూ కామెంట్ చేయడంతో ఈ అమ్మడి లవ్ మ్యాటర్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Vaibhav Upadhyay (@realsupercop) -
హీరోయిన్ చిత్ర శుక్ల లేటెస్ట్ ఫోటోలు
-
నిజ జీవిత సంఘటనల ఆధారంగా 'గీత సాక్షిగా'
ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా నటించిన చిత్రం ‘గీత సాక్షిగా’. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు. చేతన్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఆంథోని మట్టిపల్లి దర్శకత్వం వహించగా.. గోపీ సుందర్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. ఇటీవల విడుదలైన మూవీ ఫస్ట్‌లుక్, టీజర్, సాంగ్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని ఈనెల 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. హోలీ సందర్భంగా ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలను తెలియజేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను మార్చి తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. మేకర్స్ మాట్లాడుతూ..' గీత సాక్షిగా చిత్రం తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ అవుతోంది. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఇప్పుడు నిజ జీవిత సంఘటనల ఆధారంగా ప్రేక్షకులకు మంచి కంటెంట్ అందిస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమాలో చరిష్మా కీ రోల్ పోషించింది. ఆమె చుట్టూనే సినిమా కథాంశం తిరుగుతుంటుంది.' అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, రూపేష్ శెట్టి, చరిష్మా, భరణి శంకర్, జయలలిత, అనితా చౌదరి, రాజా రవీంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
అబ్బా ఓ అబ్బాయా..
ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, జయలలిత, అనిత చౌదరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గీత సాక్షిగా..’. ఆంథోని మట్టిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పుష్పక్, జేబీహెచ్‌ఆర్‌ఎన్‌కేఎల్ సమర్పణలో చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై చేతన్ రాజ్ నిర్మిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘అబ్బా అబ్బా ఓ అబ్బాయా..’ అనే పాటను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘పాట క్యాచీగా ఉంది. పిక్చరైజేషన్, కొరియోగ్రఫీ చాలా బాగున్నాయి’’ అన్నారు. ‘‘నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘గీత సాక్షిగా’. ఈ పాటకి రెహమాన్ సాహిత్యం అందించగా, సాహితీ చాగంటి పాడారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ హనుమ నరిసేటి. -
నిజ జీవిత సంఘటన ఆధారం ‘గీతా సాక్షిగా’.. ఆసక్తి పెంచుతున్న టీజర్
నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన టాలీవుడ్ లేటెస్ట్ మూవీ ‘గీతా సాక్షిగా’. ఆంథోని మట్టిపల్లి దర్శకత్వంలో ఆదర్శ్, చిత్ర శుక్లా జంటగా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ టీజర్ చూస్తుంటే ఇది కోర్ట్ డ్రామాగా ఉండబోతోందని తెలుస్తుంది. ఈ టీజర్లో నటుడు ఆదర్శ్‌ను క్రిమినల్‌గా, రాజా రవీంద్ర, లాయర్ శ్రీకాంత్ అయ్యంగార్, పోలీస్ ఆఫీసర్ ఇలా ముగ్గురూ కలిసి హీరోను టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. ఇందులో ఆదర్శ్ పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి తాను అభిమన్యున్ని కాదని, వాడి బాబు అర్జునున్ని రా అంటూ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ అందరిని ఆకట్టుకుంటుంది. చేతన్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, రూపేష్ శెట్టి, భరణి శంకర్, జయలలిత, అనిత చౌదరి, రాజా రవీంద్రలతో పాటు అనేకమంది సీనియర్ నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. -
‘తెల్లవారితే గురువారం’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్
-
‘ఉనికి’ కోసం తపన
‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్ర శుక్లా జంటగా రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉనికి’. బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి నిర్మాతలు. షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాకి ‘ఉనికి’ అనే టైటిల్‌ని ఖరారు చేసి, పోస్టర్ని విడుదల చేశారు. బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి మాట్లాడుతూ.. ‘‘ప్రతి మనిషి తన ఉనికి చాటుకోవడం కోసం తపిస్తాడు. ముఖ్యంగా అననుకూల పరిస్థితులు, అవరోధాలు ఎదురైనప్పుడు ఇంకా ఎక్కువగా ఉనికి కోసం తపిస్తాడు. ఓ మధ్య తరగతి యువతికి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తన ఉనికి నిలుపుకోవడం కోసం ఎలా పోరాడింది? అనేది ఈ చిత్రం ప్రధాన కథాంశం. రాజమండ్రి సబ్ కలెక్టర్ అంజలి అనుపమను చూసినప్పుడు కలిగిన ఆలోచనతో ఈ స్క్రిప్ట్ తయారు చేశాం. ఈ వేసవికి సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్), సహనిర్మాత: అడ్డాల రాజేశ్. -
థ్రిల్ చేస్తా!
‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్రా శుక్లా జంటగా రాజకుమార్ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతోంది. బాబీ ఏడిద క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. జనవరి మొదటివారంతో సినిమా పూర్తవుతుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇంతవరకు ఎవరూ షూటింగ్ చెయ్యని లొకేషన్స్‌లో చేస్తున్నాం. రాజమండ్రిలో పోలీస్ స్టేషన్ సెట్, కలెక్టర్ ఆఫీసు సెట్, ఇన్వెస్టిగేషన్ సెట్ వేశాం’’ అన్నారు. ఈ చిత్రానికి కథ: బాబీ ఏడిద, రచన: సరదా శ్యామ్, కెమెరా–కూర్పు: హరికృష్ణ, సంగీతం: పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్), సహనిర్మాత: అడ్డాల రాజేష్. -
‘సిల్లీ ఫెలోస్’ మూవీ సక్సెస్ మీట్
-
‘సిల్లీ ఫెలోస్’ మూవీ రివ్యూ
టైటిల్ : సిల్లీ ఫెలోస్ జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : అల్లరి నరేష్, సునీల్, చిత్ర శుక్ల, నందిని, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణముకళి సంగీతం : శ్రీ వసంత్ దర్శకత్వం : భీమినేని శ్రీనివాసరావు నిర్మాత : కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న యంగ్ హీరో అల్లరి నరేష్, హీరోగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక తిరిగి కమెడియన్‌గా టర్న్ అయిన సునీల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ సిల్లీ ఫెలోస్. రీమేక్ చిత్రాల స్పెషలిస్ట్ భీమినేని శ్రీనివాస రావు మరోసారి తమిళరీమేక్తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అంటూ చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పటంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది. అల్లరి నరేష్, సునీల్ ల కెరీర్‌కు ఎంతో కీలకమైన సిల్లీ ఫెలోస్ ప్రేక్షకులను ఆకట్టుకుందా..? అల్లరి నరేష్‌కు ఆశించిన విజయం దక్కిందా..? తిరిగి కామెడీ టర్న్ తీసుకున్న సునీల్ ఆకట్టుకున్నాడా..? కథ ; వీరబాబు (అల్లరి నరేష్), సూరి బాబు (సునీల్) సత్యనారాయణపురం ఎమ్మెల్యే జాకెట్ జానకీ రాం(జయప్రకాష్ రెడ్డి) అనుచరులు. జాకెట్ ఇమేజ్ కాపాడటం కోసం వీరబాబు ఎలాంటి మోసం చేయడానికైనా రెడీ అవుతాడు. అలా ఓ కార్యక్రమంలో జాకెట్ పరువు కాపాడటం కోసం సూరిబాబు, రికార్డింగ్ డ్యాన్సులు చేసే పుష్ప(బిగ్‌బాస్ ఫేం నందిని)లకి పెళ్లి చేస్తాడు. అప్పటికే సూరిబాబుకు కృష్ణవేణి (పూర్ణ)తో పెళ్లి కుదరటంతో పుష్పను వదిలించుకునేందుకు ఎమ్మెల్యే జాకెట్‌ను ఆశ్రయించాలనుకుంటాడు. అదే సమయంలో తను ప్రేమించిన వాసంతి (చిత్ర శుక్ల) ఉద్యోగం కోసం వీరబాబు.. జాకెట్‌కు పది లక్షల రూపాయలు ఇస్తాడు. ఈ రెండు సమస్యలు పరిష్కరించాల్సిన జాకెట్, మినిస్టర్ గోవర్థన్ ను పరామర్శించడానికి హాస్పిటల్‌కు వెళ్లి తిరిగి వచ్చే దారిలో ప్రమాదానికి గురై గతం మర్చిపోతాడు. మినిస్టర్ చనిపోతూ 500 కోట్లకు సంబంధించిన రహాస్యాన్ని జాకెట్‌కు చెప్పటంతో భూతం(పోసాని కృష్ణమురళి) ఆ డబ్బు కోసం జాకెట్ వెంటపడతాడు. మరి గతం మర్చిపోయిన జాకెట్ తిరిగి కోలుకున్నాడా..? 500 కోట్లకు సంబంధించిన రహస్యాన్ని బయటపెట్టాడా? తమ సమస్యల నుంచి వీరబాబు, సూరి బాబలు ఎలా బయటపడ్డారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; కామెడీ స్టార్‌గా మంచి ఇమేజ్ ఉన్న నరేష్ మరోసారి తన ఇమేజ్‌కు తగ్గ కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే పెద్దగా కొత్తదనం చూపించకుండా రొటీన్ ఫార్ములానే ఫాలో అయ్యాడు. తనవంతుగా వీరబాబు పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్ తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్గా చిత్ర శుక్లా పరవాలేదనిపించారు. వాసంతి పాత్రలో యాక్షన్ సీన్స్‌లోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరో కీలక పాత్రలో కనిపించిన బిగ్‌బాస్ ఫేం నందిని రాయ్ నిరాశపరిచారు. జయ ప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర రొటీన్ పాత్రల్లో కనిపించారు. అతిథి పాత్రలో పూర్ణ తళుక్కున మెరిశారు. విశ్లేషణ ; రీమేక్ స్పెషలిస్ట్‌గా పేరున్న దర్శకుడు భీమినేని శ్రీనివాస్ రావు మరోసారి రీమేక్ కథతోనే ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తమిళంలో విజయం సాధించిన ‘వెలైను వంధుట్ట వెల్లకారన్’ సినిమాను తెలుగు నేటివిటికి తగ్గట్టుగా కొద్దిపాటి మార్పులతో రీమేక్ చేశారు. కోలీవుడ్ లో ఈ తరహా చిత్రాలు కొత్తైనా మన దగ్గర చాలా వచ్చాయి. దీంతో మరోసారి రొటీన్ కామెడీ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ ప్రధాన పాత్రల పరిచయం, మంచి కామెడీ సీన్స్ తో ఆకట్టుకున్న దర్శకుడు ద్వితీయార్థంలో ఆ స్థాయిలో అలరించలేకపోయారు. పెద్దగా కథ లేకపోవటంతో ఒకే సన్నివేశాన్ని సాగదీస్తూ టైం పాస్ చేశారు. ముఖ్యంగా జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళీల మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాల విషయంలోనూ ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. శ్రీ వసంత్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రపి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; కామెడీ నరేష్, సునీల్ నటన మైనస్ పాయింట్స్ ; రొటీన్ కథా కథనం సెకండ్ హాఫ్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
నవ్వుకునే చిత్రాలను ఆదరించాలి
‘‘సిల్లీ ఫెలోస్’ చిత్రంలో నాలుగైదు రోజుల పాత్ర చేశాను. భీమనేని శ్రీనివాస్‌తో 26 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. తను హార్డ్ వర్కర్ కాబట్టే సినిమాలన్నీ సూపర్ హిట్స్ అవుతున్నాయి. నరేశ్, సునీల్.. ఎవరో ఒకరుంటేనే కామెడీ పరంగా తట్టుకోవడం కష్టం. అలాంటిది ఇద్దరూ కలిసి నటించారంటే కామెడీ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. హాయిగా నవ్వుకునే సినిమాలను ఆదరించాలి’’ అని నటుడు డా. బ్రహ్మానందం అన్నారు. ‘అల్లరి’ నరేశ్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ, నందినీరాయ్ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘16 ఏళ్ల నా సినీ ప్రయాణంలో ‘సుడిగాడు’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన భీమనేనిగారితో మళ్లీ సినిమా చేయడం ఆనందంగా ఉంది. సునీల్‌గారు, నేను ఈగోస్ లేకుండా నటించాం. ప్రేక్షకులు ‘సుడిగాడు’ రేంజ్ హిట్ అందిస్తారని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. ‘‘నరేష్‌గారు, నేను అన్నదమ్ముల్లా కలిసిపోయాం. ‘తొట్టిగ్యాంగ్’ సినిమాకు ఎంత ఎంజాయ్ చేశానో ‘సిల్లీ ఫెలోస్’కి కూడా అంతే ఎంజాయ్ చేశా. ఇందులో ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్ర చేశా’’ అన్నారు సునీల్. ‘‘సిల్లీ ఫెలోస్’ సినిమా వెనుక చాలా కష్టం ఉంది. మా కష్టాన్ని ఈరోజు తెరపై చూస్తారు. ‘సుడిగాడు’ తర్వాత నేను ఒక సినిమా చేస్తే.. నరేష్‌గారు 12 చిత్రాలు చేశారు’’ అన్నారు భీమనేని శ్రీనివాస్. ‘‘భీమనేని మంచి కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు. పెద్ద హీరోలందరూ తమ సినిమాల్ని కనీసం ఒక షెడ్యూల్ అయినా ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్ చేయాలని కోరుకుంటున్నా. ఇందుకు దర్శక–నిర్మాతలను, హీరోలను రిక్వెస్ట్ చేస్తున్నా’’ అన్నారు ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ చైర్మన్ అంబికాకృష్ణ. ఈ వేడుకలో డైరెక్టర్ కె.నాగేశ్వర్ రెడ్డి, నటి నందినీరాయ్ పాల్గొన్నారు. -
ఆ లోటు తీరుతుంది
‘అల్లరి’ నరేశ్, సునీల్ కలిసి నటిస్తున్న చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. చిత్రా శుక్లా కథానాయిక. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘సుడిగాడు’ వంటి హిట్ చిత్రం తర్వాత నరేశ్, నా కాంబినేషన్లో వస్తోన్న చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. సునీల్ ఈ చిత్రంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఏడాదిపాటు కష్టపడి హిట్ సాధించాలనే లక్ష్యంతో వస్తున్నాం. దాదాపు 200 టైటిల్స్ అనుకున్నాం. ఆఖరికి నా ‘ఎస్’ సెంటిమెంట్‌ను కూడా వదిలేద్దామనుకున్నా. చివరికి ‘ఎస్’తోనే టైటిల్ ఫిక్స్ చేశాం’’ అన్నారు. ‘‘ఆడియన్స్ నా నుంచి ఏదైతే ఇన్నాళ్లు మిస్ అయ్యారో నేనూ అదే మిస్ అయ్యాను. ‘సిల్లీ ఫెలోస్’తో ఆ లోటు తీరుతుంది. ఒకప్పటి కామెడీ జానర్లను తలపించే సినిమా అవుతుంది’’ అన్నారు సునీల్. ‘‘దాదాపు మూడేళ్లు స్క్రిప్ట్‌పై వర్క్ చేసిన సినిమా ‘సిల్లీ ఫెలోస్’. పూర్తి స్థాయి ఎంటరై్టన్మెంట్తో వస్తున్నాం’’ అన్నారు నరేశ్. ‘‘నేనే రాజు నేనే మంత్రి, ఎమ్.ఎల్.ఎ’ చిత్రాల తర్వాత మా బ్యానర్లో వస్తోన్న చిత్రమిది. హ్యాట్రిక్ సాధిస్తామని నమ్ముతున్నాం’’ అన్నారు భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి. చిత్రా శుక్లా పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బ్లూ ప్లానెట్ ఎంటరై్టన్మెంట్స్ ఎల్ ఎల్ పీ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కెమెరా: అనీష్ తరుణ్ కుమార్, సంగీతం: శ్రీ వసంత్. -
‘సిల్లీ ఫెలోస్’కే ఫిక్స్ అయ్యారు..!
వరుస పరాజయాలతో కష్టాల్లో పడ్డ యంగ్ హీరో నరేష్, ప్రస్తుతం జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు. తనకు చివరి హిట్ సుడిగాడు సినిమాను అందించిన భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నరేష్ తో పాటు మరో కామెడీ హీరో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు టైటిల్‌పై కొద్ది రోజులగా చర్చ జరుగుతోంది. చాలా టైటిల్స్‌ను పరిశీలించిన తరువాత ఫైనల్‌గా ‘సిల్లీ ఫెలోస్’ టైటిల్‌కు ఫిక్స్ అయ్యారు చిత్రయూనిట్. ఇద్దరు టాప్ కామెడీ స్టార్లు కలిసి నటిస్తుండటంతో సినిమాలో వినోదానికి డోకా లేదని తెలుస్తోంది. ఇద్దరు హీరోలతో పాటు దర్శకుడు భీమినేని కెరీర్‌కు కూడా ఈ సినిమా విజయం ఎంతో కీలకం. బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూర్ణ, చిత్ర శుక్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
సంక్రాంతి బుల్లోడు బుల్లెమ్మ
-
సమంత ఆటపట్టించింది – నాగార్జున
అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై శ్రీరంజని దర్శకత్వంలో రాజ్‌తరుణ్, చిత్రా శుక్లా జంటగా నాగార్జున నిర్మించిన చిత్రం ‘రంగుల రాట్నం’. ఇందులో సితార, ప్రియదర్శి కీలక పాత్రలు చేశారు. నిర్మాత నాగ్‌తో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ, నటీనటులతో సంక్రాంతి విశేషాలు. ఈ సంక్రాంతి మీకు చాలా స్పెషల్. అఖిల్ ‘హలో’ హిట్. నాగచైతన్య పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు.. అవును. వెరీ స్పెషల్ సంక్రాంతి. పిల్లలు సెటిల్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ‘హలో’తో అఖిల్‌కి మంచి పేరు వచ్చింది. మీడియా, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఆడియన్స్.. ఇలా అందరూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. లాస్ట్ వన్ ఇయర్ బాగాలేదు. పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా ఎదురైన ఒత్తిడిని తట్టుకొని, నిలబడి సినిమా చేశాడు. అఖిల్ యాక్టింగ్ చూసి, నేను కూడా షాక్ అయ్యాను. తండ్రిగా కాకుండా ఒక ఆర్టిస్ట్‌గా చూస్తే ఆ యాక్షన్, డైలాగ్ డిక్షన్, డాన్స్ చాలా బాగా చేశాడనిపించింది. తెలుగు ఇంత బాగా మాట్లాడతాడనుకోలేదు. వాయిస్ అంత బాగా ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు.. భలే పాడాడు. నాన్న (అక్కినేని నాగేశ్వరరావు) ఎప్పుడూ చెబుతుండేవారు ‘కసి ఉంటేనేరా పైకి వచ్చేది’ అని. అఖిల్ ఆ కసితోనే చేశాడనిపించింది. హ్యాపీగా ఉంటే శుబ్బరంగా తిని పడుకుంటాం. ఇప్పుడు మేం అంత హ్యాపీగా ఉన్నాం (నవ్వుతూ). మీరన్నట్లు లైఫ్‌లో వచ్చే ‘డౌన్స్’ని తట్టుకుని నిలబడటం గ్రేట్. ఓ ఫాదర్‌గా మీ పిల్లలకు మీరు భలే మోరల్ సపోర్ట్ ఇస్తారనిపిస్తుంటుంది.. నా మొదటి నాలుగు సినిమాలు ఆడనప్పుడు నాన్నగారు ‘లైఫ్ విల్ టీచ్ యు’ అన్నారు. నేను నా పిల్లలకు కూడా అదే చెబుతుంటాను. దాంతో పాటు గొప్ప గొప్ప వ్యక్తుల లైఫ్ ఎగ్జాంపుల్స్ చెబుతుంటాను. ‘నిన్ను ఎవరైనా తిట్టారు అంటే అది పర్సనల్‌గా కాదు.. బాగా లేని నీ సినిమాని’ అంటుంటా. ‘క్రికెట్లో కోహ్లీ బాగా ఆడలేదు అంటే పర్సనల్ అని కాదు పార్ట్ ఆఫ్ ది గేమ్ అంతే’ అని చెబుతుంటాను. నాకంటే కూడా అమల స్పిరిచ్యువల్‌గా బాగా మోటివేట్ చేస్తుంది. వాళ్లు గంటలు గంటలు మాట్లాడుకుంటారు. పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లలతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారో ఇక వాళ్లకు లోన్లీ ఫీలింగ్ ఎందుకు ఉంటుంది? ఎవరికైనా సరే పేరెంట్స్ సపోర్ట్ ఇస్తే చాలు. మనం ముసలివాళ్లు అయిపోయినా కూడా దెబ్బ తగిలితే ‘అమ్మా’ అనే అంటాం కదా. అవును. ఎంత ఎదిగినా తల్లిదండ్రులకు బిడ్డే కదా. ఓకే.. ఇంటికి కొత్త కోడలు వచ్చాక మీరు జరుపుకుంటున్న ఫస్ట్ సంక్రాంతి. సెలబ్రేషన్స్ ఎలా ప్లాన్ చేశారు? ఈరోజు (శుక్రవారం) అందరం స్టూడియోలోనే కలిశాం. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 42 ఇయర్స్ అయింది. వర్కర్స్ అందరికీ భోజనాలు పెట్టింది సమంత. మేమంతా కలసి భోజనం చేశాం. ఆ సమయంలో ఏవేవో జోక్స్. సమంత అయితే ‘మై హస్బెండ్ ఈజ్ ది బెస్ట్’ అంది. అంతే.. మేమంతా షాక్ (నవ్వుతూ). అంటే.. మేమందరం మా భార్యలకు మంచి హస్బెండ్స్ కాదా? అనడిగాం. ‘లేదు.. లేదు.. మై హస్బెండ్ ఈజ్ ది బెస్టెస్ట్’ అంది. ఆ విధంగా మా అందర్నీ ఆటపట్టించింది. ►చిన్నప్పుడు గాలి పటాలు ఎగరేశారా? ఏవైనా మెమరీస్ ఉంటే చెబుతారా? సంక్రాంతి అంటే అదే పని మీద ఉండేవాళ్లం. ఫ్రెండ్స్‌తో కలిసి తెగ తిరిగేవాణ్ణి. హైదరాబాద్ కదా.. ఇక్కడ హడావిడి ఇంకా ఎక్కువ. చింతల్ బస్తీలో ఫ్రెండ్స్‌తో కలిసి గాలిపటాలు ఎగరేసేవాణ్ణి. కైట్స్, మాంజా తెగ కొనేవాళ్లం. వాటితో పాటు డప్పులు కూడా కొనేవాళ్లం. మేం ఎవరిదైనా కైట్‌ని కట్ చేస్తే.. వెంటనే డప్పులు కొట్టి, డ్యాన్స్ చేసేవాళ్లం. చింతల్ బస్తీ ఏరియా అంతా గోల గోల చేసేవాళ్లం. అప్పట్లో ఉన్నంత సందడి ఇప్పుడు లేదేమో అనిపిస్తోంది. ఎక్కడ? ఒక్క కైట్ కూడా కనిపించడంలేదు (పైకి చూస్తూ). నన్ను చూసి నవ్వుకుంటే చాలు – ప్రియదర్శి సంక్రాంతి పండగ అంటే చాలు.. ‘ఆ బిల్డింగ్ ఎక్కొద్దు.. ఈ బిల్డింగ్ ఎక్కొద్దు’ అని రిస్ట్రిక్షన్స్ పెట్టేవారు మా నాన్నగారు. మేం ఎక్కడ పడిపోతామో అని ఆయన భయం. చిన్నప్పుడు ఓల్డ్‌సిటీలో ఉన్నప్పుడు పెద్దవాళ్లందరూ ఓ బ్యాచ్. చిన్నవాళ్లందరూ ఇంకో బ్యాచ్ అన్నమాట. పెద్దవాళ్లతో పోటీ పడి గాలిపటాలు ఎగరేసేవాళ్లం. నాకు ఊహ తెలిసిన దగర్నుంచి సినిమా అంటే ప్రేమ. స్క్రీన్ మీద నన్ను చూసి ప్రేక్షకులు కొన్నిసార్లయినా నవ్వుకుని, నన్ను గుర్తుతెచ్చుకుంటే అదే చాలని కోరుకుంటున్నాను. ఫామ్‌లోకి రాకముందు, వచ్చిన తర్వాత నాలో వచ్చిన మార్పు ఏంటి? అంటే... ‘మంచి బట్టలు వేసుకుంటున్నానండి. ఇదిగో నా హెయిర్ ఇలా బాగా సెట్ చేసుకున్నాను. అదే మార్పు’ (నవ్వేస్తూ). దారం అందిస్తే రెచ్చిపోయేవాణ్ణి – రాజ్ తరుణ్ నేను ఎనిమిదో క్లాస్‌లో ఉన్నప్పుడు సంక్రాంతి మూడు రోజులూ సినిమాలు చూసేవాణ్ణి. మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లేవాళ్లం. మాములుగా అయితే సంక్రాంతి పండక్కి ఊరు వెళ్లేవాణ్ణి. కానీ, ఈరోజు నా సినిమా ‘రంగుల రాట్నం’ రిలీజ్ ఉంది కదా. అందుకే ఇక్కడే ఉంటున్నా. చిన్నప్పుడు నేను గాలిపటాలు బాగా ఎగరేసేవాణ్ణి. కానీ స్టార్టింగ్ ప్లాబ్లమ్. అంటే.. మా అన్నయ్య గానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కొంచెం దూరం ఎగరేసి ఆ తర్వాత దారం అందిస్తే నేను రెచ్చిపోయేవాణ్ణి. సంక్రాంతి అంటే మనకు ఉన్న అతి పెద్ద ఫెస్టివల్. ఇంత పెద్ద ఫెస్టివల్‌కి నా సినిమా రావడం చాలా హ్యాపీగా ఉంది. సంక్రాంతి అంటే ‘తిల్ లడ్డూ’ ఉండాల్సిందే – చిత్రా శుక్లా మా ఊరు ఇండోర్‌లో సంక్రాంతి అంటే.. కొత్తగా పెళ్లయిన అమ్మాయిలను పుట్టింటికి పిలుస్తారు. స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తారు. ఆ కొత్త జంటతో కలిసి ఇంట్లోవాళ్లందరం గాలిపటాలు ఎగరేస్తారు. ‘తిల్ లడ్డూ’ (నువ్వుల లడ్డూ) కంపల్సరీగా చేస్తాం. అది లేకపోతే సంక్రాంతి లేనట్లే. మేం సూర్య భగవాన్ని పూజిస్తాం. చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తాం. ఈ సంక్రాంతి స్పెషల్ ఏంటంటే... హీరోయిన్గా నా సెకండ్ మూవీ (రంగుల రాట్నం) సంక్రాంతికి విడుదలవుతోంది. నేను, మా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉన్నాం. నేను తెలుగు పరిశ్రమలో పని చేస్తున్నందుకు, రెండో సినిమానే అన్నపూర్ణ బ్యానర్లో చేసినందుకు వెరీ హ్యాపీ. చిన్నప్పుడు చాలా సార్లు రంగుల రాట్నం ఎక్కాను. ఇప్పుడు కుడా చాన్స్ దొరికితే ఎక్కేస్తాను. రంగుల రాట్నం ఎక్కినప్పుడు నవ్వుతాం, భయపడతాం, అరుస్తాం, కేరింతలు కొడతాం.. అన్ని రకాల ఎమోషన్స్ కలుగతాయి.. మన జీవితంలానే. మావయ్య ఇంట్లో సంక్రాంతి – సాయిధరమ్ తేజ్ సంక్రాంతి అనగానే మేము మా పెద్ద మావయ్య (చిరంజీవి) ఇంట్లో కలిసి అందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. కజిన్స్ అందరం కలిసి బాగా సరదాగా టైమ్ స్పెండ్ చేస్తాం. భోగి రోజు మా అమ్మమ్మవాళ్ల ఇంట్లో పాత ఫర్నిచర్‌తో భోగి మంట వేస్తాం. బ్రేక్పాస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి సినిమాలకు వెళతాం లేదా సరదాగా క్రికెట్ ఆడతాం. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ప్రొసీడ్ అవుతాం. ఒక్కోసారి ఏదైనా అవుటింగ్ ప్లాన్ చేస్తాం. చిన్నప్పుడు సంక్రాంతికి ఫ్రెండ్స్‌తో కలిసి గాలిపటాలు ఎగరేసేవాణ్ణి. కాలేజ్ డేస్‌లో అయితే ఫుల్ జోష్ అన్నమాట. స్కూలింగ్ టైమ్ అప్పుడు మేము, మా బాబాయిలు, కజిన్స్ అందరం మా అమ్మమ్మ ఇంటి మేడపై గాలిపటాలు ఎగరేసేవాళ్లం. రైతులు బాగుండాలి కేరళలో సంక్రాంతి లేదు. మకర సంక్రాంతి రోజు మకర జ్యోతిని టీవీలో లైవ్ టెలీకాస్ట్ చూడటం తప్ప పండగ విశేషం ఏం లేదనుకునేదాన్ని. రాజీవ్‌తో పెళ్లయ్యాక ఇక్కడి పండగలు చేసుకోవటం అలవాటైంది. సంక్రాంతి ఎంత పెద్ద పండగో తెలిసింది. అప్పట్లో పండగలంటే తెల్లవారుజామున రంగు రంగుల ముగ్గులు వేయడం, పిండి వంటలు చేయడం చూసేదాన్ని. ఇప్పుడు అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చాక సంక్రాంతి వస్తుంది అన్న ఎగై్జట్ మెంట్ లేదు. అందుకే కొంతమంది ఊరికి వెళుతున్నారు. గాలిపటాలు ఎగరేయటం, మాంజాలు కాట్ చేయటం ఇవన్నీ తెలుసు. సంక్రాంతి అంటే రైతుల పండగ. వాళ్ల చేతికి పంట వస్తుంది. డబ్బులు వస్తాయి. వాళ్లు బావుంటే అందరం బాగుంటాం. -
‘రంగుల రాట్నం’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
అమ్మాయిల గురించి అబ్బాయిలకు ఏమీ తెలీదు
‘‘దర్శకుడు సెల్వరాఘవన్ సార్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా తొమ్మిదేళ్లు పని చేశా. ‘రంగులరాట్నం’ కథ సినిమాటోగ్రాఫర్ మదిగారికి చెప్పా. ఆయన ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్‌గారికి చెప్పమన్నారు. రాజీవన్‌గారు సుప్రియగారికి రిఫర్ చేశారు. కథ విన్న ఆమె నాగార్జునగారికి చెప్పడం, ఆయనకు నచ్చడంతో ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చింది’’ అని దర్శకురాలు శ్రీరంజని అన్నారు. రాజ్ తరుణ్, చిత్రా శుక్లా జంటగా ఆమె దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ‘రంగులరాట్నం’ సంక్రాతికి విడుదలవుతోంది. శ్రీరంజని మాట్లాడుతూ– ‘‘దర్శకురాలిగా నా తొలి చిత్రమిది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో లాంచ్ అవ్వడం అదృష్టంగా భావిస్తున్నా. ఇదొక స్వీట్.. క్యూట్ లవ్ స్టోరీ. తెలుగులో సినిమా అనగానే చాలెంజింగ్ అనిపించింది. సెల్వగారి చాలా సినిమాల షూటింగ్ హైదరాబాద్‌లో చేయడంతో నాకు తెలుగు వచ్చు. అందుకే పెద్దగా భాషతో ఇబ్బంది అనిపించలేదు. హీరో ఎవరన్నది ముందుగా అనుకోలేదు. సుప్రియగారు రాజ్ తరుణ్ గురించి చెప్పినప్పుడు తన సినిమాలు చూశా. పర్ఫెక్ట్ అనిపించి తీసుకున్నాం. ఇప్పటివరకు ఎటువంటి ఇమేజ్ లేని అమ్మాయి బావుంటుందని చిత్రని ఫిక్సయ్యాం. అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ రాయడం పెద్దగా కష్టం అనిపించలేదు. నిజం చెప్పాలంటే అమ్మాయిలకు అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ తెలుస్తుంది. అబ్బాయిలకే అమ్మాయిల గురించి ఏమీ తెలీదు. అందుకే నాకు ఈజీ అనిపించింది. నాగార్జునగారు ఇంకా సినిమా చూడలేదు. సంక్రాంతి రోజు పొద్దున్నే ‘అజ్ఞాతవాసి’, మధ్యాహ్నం ‘జై సింహా’, సాయంత్రం ‘రంగులరాట్నం’ సినిమాలు చూస్తా’’ అన్నారు. మా కుటుంబమంతా నాగార్జునగారి ఫ్యాన్సే – చిత్రా శుక్లా మా కుటుంబంలో అందరూ నాగార్జునగారి ఫ్యాన్సే. అలాంటిది అన్నపూర్ణ బ్యానర్లో చాన్స్ అనగానే చాలా హ్యాపీగా అనిపించింది. కథ విన్నాక అదృష్టంలా ఫీలయ్యా. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నాగార్జునగారికి, సుప్రియగారికి, శ్రీ రంజనిగారికి థ్యాంక్స్. చాలా బాధ్యత ఉన్న అమ్మాయిలా ఈ చిత్రంలో కనిపిస్తా. రాజ్‌తరుణ్, నేనూ చాలా టాకెటివ్. మాట్లాడుతూనే ఉంటాం. తను హిందీ బాగా మాట్లాడతాడు. అందుకని నాకు అర్థం అయ్యేలా హిందీలో డైలాగులు చెప్పేవాడు. సహజంగా, పక్కింటి అమ్మాయిలా కనబడే పాత్రలు, చాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉంది’’ అన్నారు. -
అబ్బాయిలు.. అమ్మాయిలు కనెక్ట్ అవుతారు – రాజ్ తరుణ్
‘‘అందరికీ కనెక్ట్ అయ్యే కథ ‘రంగులరాట్నం’. లవ్ స్టోరీతో పాటు చిన్న చిన్న ఎమోషన్స్ ఉన్నాయి. మదర్ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యింది. కుటుంబమంతా కలిసి చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది’’ అని హీరో రాజ్‌తరుణ్ అన్నారు. రాజ్‌తరుణ్, చిత్రా శుక్లా జంటగా శ్రీ రంజని దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ‘రంగులరాట్నం’ ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజ్‌తరుణ్ పంచుకున్న విశేషాలు. ► అన్నపూర్ణ వంటి పెద్ద బ్యానర్లో ‘ఉయ్యాల జంపాల’ తర్వాత రెండో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను తప్ప ఈ చిత్రంలో నటించిన వారందరూ దాదాపు కొత్తవారే. అయినా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. ► ఈ చిత్రంలో నాది ఓ మధ్యతరగతి అబ్బాయి పాత్ర. బాధ్యతలు తక్కువగా ఉంటాయి. నా లుక్ ఈ సినిమాలో సహజంగా ఉంటుంది. అందరిలా సరదాగా కనిపిస్తాను. అబ్బాయిలకు, అమ్మాయిలకు ఈ సినిమా ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఆ పాయింట్ నచ్చి ఈ సినిమా చేశా. ► జీవితం రంగులరాట్నంలా తిరుగుతుంటుంది. మా సినిమాలో హీరో జీవితం కూడా అంతే. కథకు తగ్గ టైటిల్ అని ‘రంగులరాట్నం’ అని పెట్టాం. సినిమా చూశా. చాలా బాగుంది. చూస్తున్నంతసేపు హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా సినిమా ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ► శ్రీ రంజనిగారు సెల్వరాఘవన్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. లేడీ డైరెక్టర్ అయినా అబ్బాయి మనస్తత్వం బాగా అర్థం చేసుకొని ఈ సినిమా తెరకెక్కించారు. తనకు కావాల్సింది బాగా రాబట్టుకున్నారు. ► ప్రతి ఏడాది సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. మా సినిమా వేరే చిత్రాలకు పోటీ అనుకోను. కుటుంబం అంతా కలిసి చూడదగ్గ సినిమా మాది. సెన్సార్ పూర్తి కాగానే విడుదల తేదీ ప్రకటిస్తాం. -
‘రంగుల రాట్నం’ మూవీ స్టిల్స్
-
అప్పుడు ఉయ్యాల ఇప్పుడు రంగుల రాట్నం
మాస్‌కి ఈజీగా నచ్చేసే కుర్రాడు రాజ్ తరుణ్. మొదటి సినిమా ‘ఉయ్యాల జంపాల’తో మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా రాజ్ తరుణ్‌ని హీరోగా పరిచయం చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ మళ్లీ అతనితో ఓ సినిమా నిర్మించింది. ‘రంగుల రాట్నం’ పేరుతో శ్రీ రంజని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చిత్రా శుక్లా హీరోయిన్. షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది. సితార, ప్రియదర్శి ముఖ్య పాత్రలు చేసిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: ఎల్.కె. విజయ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్. -
విలువలు ముఖ్యం
శ్రీవిష్ణు, చిత్ర శుక్ల జంటగా కుమార్ వట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మా అబ్బాయి’. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాశరావు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో తీసిన తొలి చిత్రం ‘మా అబ్బాయి’. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నేపథ్యంలో కథ సాగుతుంది. సెంటిమెంట్‌తో పాటు వినోదం, యాక్షన్ ఉంటాయి. జీవితానికైనా, వ్యాపారానికైనా విలువలే గీటురాయి. ఆ తర్వాతే లాభాలు. విలువలతో ఎదగాలని మా నాన్న బలగ భీమారావు నేర్పారు. విలువలకి పెద్దపీట వేస్తూ సినిమాలు తీసే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తీయాలన్నది నా కల. పలువురికి ఉపాధి కల్పిస్తూ విలువలున్న సినిమాలను నిర్మించాలన్నదే నా లక్ష్యం. త్వరలో మరో నూతన చిత్రం ప్రకటించనున్నాం’’ అన్నారు. -
ఈ అబ్బాయికి తిక్క ఎక్కువ!
ఈ అబ్బాయికి కొంచెం తిక్క ఎక్కువ. ప్రేమ... పగ... ఏదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్స్‌లో కావాలంటాడు. ఎదురింటి అమ్మాయితో ప్రేమలో పడిన ఈ అబ్బాయి లైఫ్ హ్యాపీగా ముందుకు వెళ్తున్న సమయంలో సడన్‌గా యాక్షన్ టర్న్ తీసుకుంది. అబ్బాయి లైఫ్‌లో ఈ మలుపులకు కారణం ఏంటో? వచ్చే వారం వస్తోన్న ‘మా అబ్బాయి’ సినిమా చూసి తెలుసుకోమంటున్నారు దర్శకుడు కుమార్ వట్టి. శ్రీవిష్ణు, చిత్ర శుక్ల జంటగా ఆయన దర్శకత్వంలో బలగ ప్రకాశ్‌రావు నిర్మించిన ‘మా అబ్బాయి’ ఈ నెల 17న రిలీజవుతోంది. ‘‘లవ్, యాక్షన్, రొమాన్స్, కామెడీ.. ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఉన్న చిత్రమిది. ఇటీవల విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. ఫ్యామిలీ అంతా కలసి చూసేలా తీశాం’’ అన్నారు బలగ ప్రకాశ్‌రావు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వండాన రామకృష్ణ, సమర్పణ: బేబి సాక్షి. -
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
యువతరానికి నచ్చే కథాంశంతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ విష్ణు, చిత్రా శుక్లా జంటగా నూతన దర్శకుడు కుమార్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని బలగ ప్రకాశ్‌రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘నేటి యువతను ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కథలోని ట్విస్ట్‌లు ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగిస్తాయి’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ యువన్, కెమెరా: తమశ్యామ్, పాటలు: శ్రీమణి.