విలువలు ముఖ్యం | maa abbayi movie release on today | Sakshi
Sakshi News home page

విలువలు ముఖ్యం

Published Thu, Mar 16 2017 11:07 PM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM

విలువలు ముఖ్యం

విలువలు ముఖ్యం

శ్రీవిష్ణు, చిత్ర శుక్ల జంటగా కుమార్‌ వట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మా అబ్బాయి’. వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాశరావు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్‌లో తీసిన తొలి చిత్రం ‘మా అబ్బాయి’. దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల నేపథ్యంలో కథ సాగుతుంది. సెంటిమెంట్‌తో పాటు వినోదం, యాక్షన్‌ ఉంటాయి.

జీవితానికైనా, వ్యాపారానికైనా విలువలే గీటురాయి. ఆ తర్వాతే లాభాలు. విలువలతో ఎదగాలని మా నాన్న బలగ భీమారావు నేర్పారు. విలువలకి పెద్దపీట వేస్తూ సినిమాలు తీసే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తీయాలన్నది నా కల. పలువురికి ఉపాధి కల్పిస్తూ విలువలున్న సినిమాలను నిర్మించాలన్నదే నా లక్ష్యం.
త్వరలో మరో నూతన చిత్రం ప్రకటించనున్నాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement