ఈ అబ్బాయికి తిక్క ఎక్కువ! | Sree Vishnu's 'Maa Abbayi' to be released on 17th March | Sakshi
Sakshi News home page

ఈ అబ్బాయికి తిక్క ఎక్కువ!

Published Fri, Mar 10 2017 11:49 PM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

ఈ అబ్బాయికి తిక్క ఎక్కువ!

ఈ అబ్బాయికి తిక్క ఎక్కువ!

ఈ అబ్బాయికి కొంచెం తిక్క ఎక్కువ. ప్రేమ... పగ... ఏదైనా ఎక్స్‌ట్రీమ్‌ లెవెల్స్‌లో కావాలంటాడు. ఎదురింటి అమ్మాయితో ప్రేమలో పడిన ఈ అబ్బాయి లైఫ్‌ హ్యాపీగా ముందుకు వెళ్తున్న సమయంలో సడన్‌గా యాక్షన్‌ టర్న్‌ తీసుకుంది.

అబ్బాయి లైఫ్‌లో ఈ మలుపులకు కారణం ఏంటో? వచ్చే వారం వస్తోన్న ‘మా అబ్బాయి’ సినిమా చూసి తెలుసుకోమంటున్నారు దర్శకుడు కుమార్‌ వట్టి. శ్రీవిష్ణు, చిత్ర శుక్ల జంటగా ఆయన దర్శకత్వంలో బలగ ప్రకాశ్‌రావు నిర్మించిన ‘మా అబ్బాయి’ ఈ నెల 17న రిలీజవుతోంది. ‘‘లవ్, యాక్షన్, రొమాన్స్, కామెడీ.. ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఉన్న చిత్రమిది. ఇటీవల విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. ఫ్యామిలీ అంతా కలసి చూసేలా తీశాం’’ అన్నారు బలగ ప్రకాశ్‌రావు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్‌ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వండాన రామకృష్ణ, సమర్పణ: బేబి సాక్షి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement