Maa Abbayi
-
విలువలు ముఖ్యం
శ్రీవిష్ణు, చిత్ర శుక్ల జంటగా కుమార్ వట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మా అబ్బాయి’. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాశరావు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో తీసిన తొలి చిత్రం ‘మా అబ్బాయి’. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నేపథ్యంలో కథ సాగుతుంది. సెంటిమెంట్‌తో పాటు వినోదం, యాక్షన్ ఉంటాయి. జీవితానికైనా, వ్యాపారానికైనా విలువలే గీటురాయి. ఆ తర్వాతే లాభాలు. విలువలతో ఎదగాలని మా నాన్న బలగ భీమారావు నేర్పారు. విలువలకి పెద్దపీట వేస్తూ సినిమాలు తీసే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తీయాలన్నది నా కల. పలువురికి ఉపాధి కల్పిస్తూ విలువలున్న సినిమాలను నిర్మించాలన్నదే నా లక్ష్యం. త్వరలో మరో నూతన చిత్రం ప్రకటించనున్నాం’’ అన్నారు. -
ఈ అబ్బాయికి తిక్క ఎక్కువ!
ఈ అబ్బాయికి కొంచెం తిక్క ఎక్కువ. ప్రేమ... పగ... ఏదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్స్‌లో కావాలంటాడు. ఎదురింటి అమ్మాయితో ప్రేమలో పడిన ఈ అబ్బాయి లైఫ్ హ్యాపీగా ముందుకు వెళ్తున్న సమయంలో సడన్‌గా యాక్షన్ టర్న్ తీసుకుంది. అబ్బాయి లైఫ్‌లో ఈ మలుపులకు కారణం ఏంటో? వచ్చే వారం వస్తోన్న ‘మా అబ్బాయి’ సినిమా చూసి తెలుసుకోమంటున్నారు దర్శకుడు కుమార్ వట్టి. శ్రీవిష్ణు, చిత్ర శుక్ల జంటగా ఆయన దర్శకత్వంలో బలగ ప్రకాశ్‌రావు నిర్మించిన ‘మా అబ్బాయి’ ఈ నెల 17న రిలీజవుతోంది. ‘‘లవ్, యాక్షన్, రొమాన్స్, కామెడీ.. ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఉన్న చిత్రమిది. ఇటీవల విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. ఫ్యామిలీ అంతా కలసి చూసేలా తీశాం’’ అన్నారు బలగ ప్రకాశ్‌రావు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వండాన రామకృష్ణ, సమర్పణ: బేబి సాక్షి.