Srivisnu
-
'ఓం భీమ్ బుష్' సినిమా కలెక్షన్స్ ఊహించలేరు..
హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఓం భీమ్ బుష్. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మించారు. మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ హిట్ అందుకుంది. చాలారోజుల తర్వాత ఫుల్ లెన్త్ కామెడీగా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్నా ఆ ప్రభావాన్ని తట్టుకుని భారీ కలెక్షన్స్ నమోదు చేస్తుంది. సామజవరగమన హిట్ తర్వాత ఓం భీమ్ బుష్ సినిమాతో శ్రీ విష్ణు మరో హిట్‌ను అందుకున్నాడు. రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఊహించిన దానికంటే మంచి కలెక్షన్స్‌నే ఈ చిత్రం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 10.44 కోట్ల గ్రాస్‌ను ఈ సినిమా కలెక్ట్ చేసింది. మొదటిరోజు రూ.4.6కోట్ల, రెండో రోజు రూ.5.84 కోట్లు రాబట్టింది. అమెరికాలో అయితే ఇప్పటికే సుమారుగా రూ. 3 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కేవలం రెండు రోజుల్లోనే ఓం భీమ్ బుష్ సినిమా లాభాల్లోకి వెళ్లిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. తక్కువ బడ్జెట్‌తోనే తెరకెక్కిన ఈ మూవీకి మంచి ఓపెనింగ్‌తో కలెక్షన్స్ రన్ అవుతున్నాయి. తాజాగా ఓం భీమ్ బుష్ సినిమా సక్సెస్ మీట్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. 'నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. ఈ ట్యాగ్ లైన్ పెట్టాలంటే ధైర్యం వుండాలి. థియేటర్‌కు వెళితే నవ్వుకుని వస్తున్నామని ప్రేక్షకులే చెబుతున్నారు. మంచి ఎంటర్టైనర్ మూవీ ఈ సమ్మర్‌కు వచ్చింది. అందరూ థియేటర్‌కు వెళ్లి ఎంజాయ్ చేయండి' అన్నారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ... 'ఓం భీమ్ బుష్' ప్రీమియర్ చూశాను. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురి కాంబినేషన్‌ను కలపడమే ఈ విజయం. ప్రేక్షకులని తప్పకుండా అలరించాలనే టెన్షన్ ఆ ముగ్గురిలో గమనించాను. దర్శకుడు అద్భుతంగా కథ రాసుకుంటే.. ఈ ముగ్గురు ఇంకా అద్భుతంగా నటించారు. మీరు ఇచ్చే డబ్బులకి వందశాతం న్యాయం చేస్తుంది' అన్నారు. BLOCKBUSTER BAZINGAAAA ❤🔥#OmBheemBush grosses 10.44+ CRORES in 2 days worldwide 🔥 Go LOL in the theatres! 🎟️ https://t.co/duPyNtQcze Directed by @HarshaKonuganti #OBB @sreevishnuoffl @PriyadarshiPN @eyrahul #Ayeshakhan @PreityMukundan @SunnyMROfficial @SunilBalusu1981… pic.twitter.com/gcmVwvMqzn — V celluloid (@vcelluloidsoffl) March 24, 2024 -
నాలుగేళ్లకోసారి పుట్టినరోజు జరుపుకుంటున్న హీరో
కొత్తదనం పంచడంలోనూ.. కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడంలోనూ ఎప్పుడూ ముందుంటారు హీరో శ్రీవిష్ణు . రొటీన్ సినిమాలకు భిన్నంగా తనకంటూ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ఆయన హిట్ కొట్టి అభిమానులను సంపాధించుకున్నాడు. గతేడాదిలో 'సామజవరగమన'తో హిట్ క్టొటిన ఆయన నేడు ఫిబ్రవరి 29న 40వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ ఏడాది లీప్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. నాలుగేళ్లకు ఒకసారి ఇలాంటి సందర్భం వస్తుంది. అందుకే ఈ తేదీలో పుట్టినవారు నాలుగేళ్లకు ఒక్కసారి తమ పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటారు. నేడు హీరో శ్రీవిష్ణు కూడా తన పుట్టినరోజును జరుపుకున్నారు. నాలుగేళ్లకు ఒక్కసారి ఈ వేడుకలు జరుగుతుండటంతో ఎంతో ఘనంగా తన అభిమానులతో పాటు ఆయన జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమా విషయాలను షేర్ చేస్తున్నారు మేకర్స్. ఆయన నటించిన 'ఓం భీమ్ బుష్' సినిమా మార్చి 22న విడుదల కానుంది. స్వాగ్, ఏమండో బాగున్నారా సినిమాల్లో నటిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. -
ట్రిపుల్ ట్రీట్: ఒక సినిమా.. మూడింతల ఆనందం
వెండితెరపై తమ అభిమాన హీరో ఒక్క పాత్రలో కనిపిస్తేనే కేకలు, విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తారు అభిమానులు. అదే హీరో ద్విపాత్రాభినయం చేస్తే ఫ్యాన్స్ ఆనందం డబుల్ అవుతుంది. ట్రిపుల్ గెటప్స్‌లో కనిపిస్తే.. ఫ్యాన్స్ ఆనందం మూడింతలు అవుతుంది. తాజాగా దక్షిణాదిలో ధనుష్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు, టొవినో థామస్ వంటి హీరోలు తొలిసారి ట్రిపుల్ ట్రీట్ ఇవ్వనున్నారు. ఆ సినిమాలపై ఓ లుక్కేద్దాం. కెప్టెన్ మిల్లర్ వైవిధ్యమైన చిత్రాలతో దూసుకెళుతున్నారు హీరో ధనుష్. ప్రస్తుతం అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఆయన పాన్ ఇండియా సినిమా ‘కెప్టెన్ మిల్లర్’ చేస్తున్నారు. 1930–1940 నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ధనుష్ మూడు గెటప్స్‌లో కని పిస్తారు. ఇప్పటికి రెండు గెటప్స్ రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ లుక్‌లో పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, పెద్ద సైజు గన్ను పట్టుకుని చుట్టూ మరణించిన సైనికుల మధ్య యుద్ధ భూమిలో నిల్చుని ఉన్న ధనుష్ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ధనుష్ చేస్తున్న పాత్రల్లో కెప్టెన్ మిల్లన్ పాత్ర ఒకటి. మిగతా రెండు పాత్రల వివరాలు తెలియాల్సి ఉంది. మామా మశ్చీంద్ర కెరీర్ పారంభం నుంచి వినూత్నమైన, కథా బలమున్న సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు హీరో సుధీర్ బాబు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మామా మశ్చీంద్ర’. నటుడు, డైరెక్టర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మృణాలినీ రవి, ఈషా రెబ్బా హీరోయిన్లు. ఈ సినిమాలో తొలిసారి మూడు పాత్రల్లో (డీజే, డాన్, దుర్గ) సందడి చేయనున్నారు సుధీర్ బాబు. ఈ మూడు లుక్స్‌కి సంబంధించిన పోస్టర్లు విడుదలయ్యాయి. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ని ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. కామెడీ, రొమాన్స్, యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రీక్వెల్‌లో మూడు పాత్రలు.. డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో శ్రీ విష్ణు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సామజ వరగమన’ జూన్ 29న విడుదలై సూపర్ హిట్‌గా దూసుకెళుతోంది. శ్రీ విష్ణు కెరీర్లో అత్యధిక వసూళ్లు (ఇప్పటికే 40 కోట్లు దాటాయి) సాధించిన చిత్రంగా ‘సామజ వరగమన’ నిలిచింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న శ్రీ విష్ణు తాను ఓ చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘రాజ రాజ చోర’ (2021)తో హిట్ కాంబో అనిపించుకున్న శ్రీ విష్ణు– డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. ఈ మూవీలోనే శ్రీ విష్ణు త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ‘రాజ రాజ చోర’కి ప్రీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. -
డిఫరెంట్ స్టోరీతో..
శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. కృష్ణ విజయ్ ఎల్. దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటరై్టన్మెంట్స్, కృష్ణ విజయ్ ఎల్. ప్రొడక్షన్స్ పతాకాలపై రిజ్వాన్ నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో నారా రోహిత్ క్లాప్ ఇచ్చారు. కృష్ణ విజయ్ ఎల్. మాట్లాడుతూ– ‘‘అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకే కథ’ చిత్రాల తర్వాత ఈ సినిమాకు నిర్మాణంలో భాగస్వామ్యం అవడంతో పాటు దర్శకత్వం వహిస్తుండటం హ్యాపీగా ఉంది. జూలైలో షూటింగ్ స్టార్ట్ చేసి, ఈ ఏడాది చివర్లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘విజయ్‌గారితో పని చెయ్యడం హ్యాపీ. ఈ సినిమా అన్ని వర్గాలవారికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘విజయ్ ఈ కథ చెప్పినప్పుడు కొత్తగా ఫీల్ అయ్యాను. అంత డిఫరెంట్‌గా ఉంది’’ అన్నారు రిజ్వాన్. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి పాల్గొన్నారు. రోహిణి, రఘుబాబు, అచ్చుత్ రామారావు, ఏ.ఎస్.రవికుమార్ చౌదరి (డైరెక్టర్), అజయ్ ఘోష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: శ్రీ ఓం సినిమా, సహ నిర్మాతలు: ఖుర్షీద్ (ఖుషి), అచ్చుత్ రామారావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మనోజ్ మావిల్ల, లైన్ ప్రొడ్యూసర్: సందీప్ గడ్డపు, క్రియేటివ్ ప్రొడ్యూసర్: వినయ్ మాండ్ల, కెమెరా: సిద్. -
విలువలు ముఖ్యం
శ్రీవిష్ణు, చిత్ర శుక్ల జంటగా కుమార్ వట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మా అబ్బాయి’. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాశరావు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో తీసిన తొలి చిత్రం ‘మా అబ్బాయి’. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నేపథ్యంలో కథ సాగుతుంది. సెంటిమెంట్‌తో పాటు వినోదం, యాక్షన్ ఉంటాయి. జీవితానికైనా, వ్యాపారానికైనా విలువలే గీటురాయి. ఆ తర్వాతే లాభాలు. విలువలతో ఎదగాలని మా నాన్న బలగ భీమారావు నేర్పారు. విలువలకి పెద్దపీట వేస్తూ సినిమాలు తీసే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తీయాలన్నది నా కల. పలువురికి ఉపాధి కల్పిస్తూ విలువలున్న సినిమాలను నిర్మించాలన్నదే నా లక్ష్యం. త్వరలో మరో నూతన చిత్రం ప్రకటించనున్నాం’’ అన్నారు. -
మా అబ్బాయే..
నటుడు శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మా అబ్బాయి’. ఈ చిత్రంతో కుమార్ వట్టి దర్శకునిగా పరిచయమవుతున్నారు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్‌రావు నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్, దర్శకుడు పరశురామ్ దగ్గర పనిచేశా. సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా విడుదల తర్వాత శ్రీవిష్ణును అందరూ ‘మా అబ్బాయి’ అనేలా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘పది మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సినీ రంగానికి వచ్చి, ‘మా అబ్బాయి’ చిత్రం తీశా. అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్న మూవీ ఇది. శ్రీవిష్ణు నటన ఇందులో హైలెట్. త్వరలో పాటలు, డిసెంబర్లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ- ‘‘ఇలాంటి చిత్రం తీయాలంటే ధైర్యం ఉండాలి. పెద్ద హీరోతో చేయాల్సిన కథతో నాతో సినిమా తీసిన దర్శక-నిర్మాతలు చాలా ధైర్యవంతులు. ప్రేక్షకులను అలరించేలా మా చిత్రం ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: థమశ్యామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వండాన రామకృష్ణ, సంగీతం: సురేష్ బొబ్బిలి.