ట్రిపుల్‌ ట్రీట్‌: ఒక సినిమా.. మూడింతల ఆనందం | Dhanush, Sudhir Babu, Srivishnu, Tovino Thomas Triple Role Movies | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ట్రీట్‌: ఒక సినిమా.. మూడింతల ఆనందం

Published Sun, Jul 16 2023 4:14 AM | Last Updated on Sun, Jul 16 2023 8:36 AM

Dhanush, Sudhir Babu, Srivishnu, Tovino Thomas Triple Role Movies - Sakshi

వెండితెరపై తమ అభిమాన హీరో ఒక్క పాత్రలో కనిపిస్తేనే కేకలు, విజిల్స్‌ వేస్తూ ఎంజాయ్‌ చేస్తారు అభిమానులు. అదే హీరో ద్విపాత్రాభినయం చేస్తే ఫ్యాన్స్‌ ఆనందం డబుల్‌ అవుతుంది. ట్రిపుల్‌ గెటప్స్‌లో కనిపిస్తే.. ఫ్యాన్స్‌ ఆనందం మూడింతలు అవుతుంది. తాజాగా దక్షిణాదిలో ధనుష్, సుధీర్‌ బాబు, శ్రీవిష్ణు, టొవినో థామస్‌ వంటి హీరోలు తొలిసారి ట్రిపుల్‌ ట్రీట్‌ ఇవ్వనున్నారు. ఆ సినిమాలపై ఓ లుక్కేద్దాం.

కెప్టెన్‌ మిల్లర్‌
వైవిధ్యమైన చిత్రాలతో దూసుకెళుతున్నారు హీరో ధనుష్‌. ప్రస్తుతం అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో ఆయన పాన్‌ ఇండియా సినిమా ‘కెప్టెన్‌ మిల్లర్‌’ చేస్తున్నారు. 1930–1940 నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ధనుష్‌ మూడు గెటప్స్‌లో కని పిస్తారు. ఇప్పటికి రెండు గెటప్స్‌ రిలీజ్‌ అయ్యాయి. ఫస్ట్‌ లుక్‌లో  పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, పెద్ద సైజు గన్ను పట్టుకుని చుట్టూ మరణించిన సైనికుల మధ్య యుద్ధ భూమిలో నిల్చుని ఉన్న ధనుష్‌ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ధనుష్‌ చేస్తున్న పాత్రల్లో కెప్టెన్‌ మిల్లన్‌ పాత్ర ఒకటి. మిగతా రెండు పాత్రల వివరాలు తెలియాల్సి ఉంది.

మామా మశ్చీంద్ర
కెరీర్‌ పారంభం నుంచి వినూత్నమైన, కథా బలమున్న సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు హీరో సుధీర్‌ బాబు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మామా మశ్చీంద్ర’. నటుడు, డైరెక్టర్‌ హర్షవర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మృణాలినీ రవి, ఈషా రెబ్బా హీరోయిన్లు. ఈ సినిమాలో తొలిసారి మూడు పాత్రల్లో (డీజే, డాన్, దుర్గ) సందడి చేయనున్నారు సుధీర్‌ బాబు. ఈ మూడు లుక్స్‌కి సంబంధించిన పోస్టర్లు విడుదలయ్యాయి. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ని ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. కామెడీ, రొమాన్స్, యాక్షన్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.

ప్రీక్వెల్‌లో మూడు పాత్రలు..
డిఫరెంట్‌ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో శ్రీ విష్ణు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సామజ వరగమన’ జూన్‌ 29న విడుదలై సూపర్‌ హిట్‌గా దూసుకెళుతోంది. శ్రీ విష్ణు కెరీర్‌లో అత్యధిక వసూళ్లు (ఇప్పటికే 40 కోట్లు దాటాయి) సాధించిన చిత్రంగా ‘సామజ వరగమన’ నిలిచింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న శ్రీ విష్ణు తాను ఓ చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘రాజ రాజ చోర’ (2021)తో హిట్‌ కాంబో అనిపించుకున్న శ్రీ విష్ణు– డైరెక్టర్‌ హసిత్‌ గోలి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. ఈ మూవీలోనే శ్రీ విష్ణు త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ‘రాజ రాజ చోర’కి ప్రీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement