
హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఓం భీమ్ బుష్. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మించారు. మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ హిట్ అందుకుంది. చాలారోజుల తర్వాత ఫుల్ లెన్త్ కామెడీగా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్నా ఆ ప్రభావాన్ని తట్టుకుని భారీ కలెక్షన్స్ నమోదు చేస్తుంది.
సామజవరగమన హిట్ తర్వాత ఓం భీమ్ బుష్ సినిమాతో శ్రీ విష్ణు మరో హిట్‌ను అందుకున్నాడు. రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఊహించిన దానికంటే మంచి కలెక్షన్స్‌నే ఈ చిత్రం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 10.44 కోట్ల గ్రాస్‌ను ఈ సినిమా కలెక్ట్ చేసింది. మొదటిరోజు రూ.4.6కోట్ల, రెండో రోజు రూ.5.84 కోట్లు రాబట్టింది. అమెరికాలో అయితే ఇప్పటికే సుమారుగా రూ. 3 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కేవలం రెండు రోజుల్లోనే ఓం భీమ్ బుష్ సినిమా లాభాల్లోకి వెళ్లిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. తక్కువ బడ్జెట్‍తోనే తెరకెక్కిన ఈ మూవీకి మంచి ఓపెనింగ్‌తో కలెక్షన్స్ రన్ అవుతున్నాయి.
తాజాగా ఓం భీమ్ బుష్ సినిమా సక్సెస్ మీట్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. 'నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. ఈ ట్యాగ్ లైన్ పెట్టాలంటే ధైర్యం వుండాలి. థియేటర్‌కు వెళితే నవ్వుకుని వస్తున్నామని ప్రేక్షకులే చెబుతున్నారు. మంచి ఎంటర్‌టైనర్ మూవీ ఈ సమ్మర్‌కు వచ్చింది. అందరూ థియేటర్‌కు వెళ్లి ఎంజాయ్ చేయండి' అన్నారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ... 'ఓం భీమ్ బుష్' ప్రీమియర్ చూశాను. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురి కాంబినేషన్‌ను కలపడమే ఈ విజయం. ప్రేక్షకులని తప్పకుండా అలరించాలనే టెన్షన్ ఆ ముగ్గురిలో గమనించాను. దర్శకుడు అద్భుతంగా కథ రాసుకుంటే.. ఈ ముగ్గురు ఇంకా అద్భుతంగా నటించారు. మీరు ఇచ్చే డబ్బులకి వందశాతం న్యాయం చేస్తుంది' అన్నారు.
BLOCKBUSTER BAZINGAAAA ❤🔥#OmBheemBush grosses 10.44+ CRORES in 2 days worldwide 🔥
— V celluloid (@vcelluloidsoffl) March 24, 2024
Go LOL in the theatres!
🎟️ https://t.co/duPyNtQcze
Directed by @HarshaKonuganti #OBB @sreevishnuoffl @PriyadarshiPN @eyrahul #Ayeshakhan @PreityMukundan @SunnyMROfficial @SunilBalusu1981… pic.twitter.com/gcmVwvMqzn